మెయన్ ఫీచర్

మహిళలపై వివక్ష మరెంత కాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళిత మహిళలు సంఘటిత శక్తితో శతాబ్దుల నాటి దురాచారానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది ఆగస్టు 15న కూడా మహిళలు గ్రామం నడిబొడ్డున ఇలాంటి
పాదయాత్రలు చేశారు. ఒక దురాచారాన్ని మహిళలు ఇలా సంఘటిత శక్తితో
ఎదుర్కొని విజయాన్ని సాధించగా, మిగతా అకృత్యాల పట్ల వారు
ఎందుకు వౌనం వహించాలి?
దళితులపై కులవివక్ష చూపడం నేరం అంటూ ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఏదోఒక రూపంలో వివక్ష విషజ్వాలలను విరజిమ్ముతూనే ఉంది. గ్రామీణ భారతంలో దళిత స్ర్తిలపై చూపే వివక్ష, సాగించే హింస మరింత అధికం. మనదేశంలో మహిళలపై అనాదిగా చిన్నచూపు ఉందనుకుంటే- అది దళిత స్ర్తిల విషయంలో చాలా ఎక్కువన్నది కాదనలేని వాస్తవం. ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో రోడ్డుమీద చెప్పులు వేసుకుని వెళ్లడానికి దళిత స్ర్తిలు ఒక ఉద్యమం చేపట్టవలసి వచ్చింది. నాగరికమైన 21వ శతాబ్దంలో ఇలాంటి ఉద్యమాలు జరిగాయంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది. ఈ విషయానికి సంబంధించి వివరాల్లోకి వెళ్లేముందు తెలుగు కథలో దళిత సమస్యకు చోటు కల్పిస్తూ కరుణకుమార రాసిన ఒక కథను ఇక్కడ ప్రస్తావించాలి. ఆ కథ పేరు ‘పశువుల కొఠాం’. ‘కరుణకుమార’గా ప్రసిద్ధుడైన కందుకూరి అనంతం రెవెన్యూ అధికారిగా 1930 ప్రాంతంలో ఉద్యోగరీత్యా గ్రామాలకు వెళ్లినపుడు దళితులపై దౌర్జన్యాలను చూచి, చలించిపోయి ఆణిముత్యాల్లాంటి కథలు రాశారు. ‘పశువుల కొఠాం’ కథ కాలానికి వివాహ వేడుకల్లో దళితులు గుర్రం ఎక్కి ఊరేగడం నిషిద్ధం. అగ్రకులాల వధూవరులకే ఆ అవకాశం ఉండేది. దళిత కులానికి చెందిన ప్రేయసీ ప్రియులు తమ వివాహ వేడుకలో గుర్రం ఎక్కి ఊరేగుదామని ఆశపడితే వారు ఎంతటి హింసను భరించవలసి వచ్చిందో ఈ కథ వివరిస్తుంది. ఈ కథను ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే- బుందేల్‌ఖండ్‌లోని దళిత మహిళలకు కూడా ఇట్లాంటి ఆశ మరో రూపంలో వుంది. చెప్పులు ధరించాలని వారు అనుకోవడం ‘ఆశ’ కాదు, అది అవసరం అని గ్రహించాలి. బుందేల్‌ఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో దళిత స్ర్తిలు అగ్రకులస్తుల ఇళ్ల ముందు నుండి వెళ్ళేటప్పుడు తాము వేసుకున్న జోళ్లు తీసి నెత్తిన పెట్టుకుని ఎండకు చుర్రుమని కాలుతున్నా నడవాలి. దశాబ్దుల తరబడి ఉన్న ఈ నియమాన్ని ఉల్లంఘించే దళిత స్ర్తిలపై అగ్రకులస్తులు చర్యలు తీసుకుంటారు. విచిత్రం ఏమిటంటే దళిత పురుషులకు ఈ నియమం లేదు. వారంతా అగ్రకుల భూస్వాముల పొలాల్లో పనిచేస్తూంటారు గనుక ఈ నియమాన్ని గ్రామపెద్దలు అంతగా పట్టించుకోలేదు. ఇతర ప్రాంతాలకు చెందిన యువతులు ఈ గ్రామాలకు కోడళ్లుగా వచ్చినాసరే ఈ దురాచారాన్ని భరించాల్సిందే.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంత మహిళలు తమ హక్కుల కోసం పోరాడడం ప్రారంభించారు. 2008లో రాజీవ్‌గాంధీ మహిళా వికాస్ పరియోజన (ఆర్‌జిఎంవిపి) కార్యక్రమం అమలులోకి వచ్చాక దళిత మహిళలు ‘స్వయం సహాయక బృందాలు’గా ఏర్పడి ఆర్థిక సాధికారత కోసం ఉద్యమిస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక బృందంలోనూ వెనుకబడిన, దళిత కులాలకు చెందిన 10 నుండి 15 మహిళలు సభ్యులుగా వుంటారు. స్వయం సహాయక బృందాలన్నీ ‘గ్రామ సంగర్తన్’కు అనుసంధానించి వుంటాయి. ఇవన్నీ బ్లాక్ స్థాయి కమిటీకి అనుబంధించి వుంటాయి. స్వయం సహాయక బృందాల సమావేశంలో ప్రభుత్వం నుండి సహాయం లభించే కార్యక్రమాల గురించి, మహిళల హక్కులు, సామాజిక, ఆర్థిక సమస్యలపై చర్చిస్తారు. విద్యాగంధం లేని బీద మహిళలు ఇందులో సభ్యులుగా చేరడంతో వారు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ‘బరారో’ అనే గ్రామంలో ఒక స్వయం సహాయక బృందానికి అధ్యక్షురాలైన మమత సమావేశంలో ఒక సభ్యురాలి పాదం నుండి రక్తం ధారలా కారుతూ వుండడం చూచింది. ఏమైందని ఆమెను మమత ఆరా తీస్తే- ‘పెద్దోళ్ల ఇంటిముందు నుండి వెళ్ళేటప్పుడు జోళ్లు నెత్తిమీద పెట్టుకుని వెళ్లాలి కదా, తొందరగా వెడదామన్న హడావుడిలో రాయిని గుద్దుకున్నా. రక్తం చిమ్మింది’ అన్నది. అది విన్న అక్కడ వున్న సభ్యులందరూ తమ బాధలను కూడా చెప్పుకొన్నారు. మండువేసవిలో ఎండ నిప్పులు చెరుగుతున్న వేళ- తప్పనిసరిగా బయటకు వెళ్లినపుడు చెప్పులు తీసి నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నపుడు కాళ్లు బొబ్బలెక్కిన వైనాన్ని గురించి కొందరు, చీకట్లో చెప్పులు తీసుకుని నడవాల్సి నచ్చినపుడు ఏ పురుగు కుతుందోనన్న భయంతో బిక్కచచ్చిపోయామని మరికొందరు మహిళలు వివరించారు. ఈ విషయాలన్నీ చర్చించుకున్న తర్వాత ఆ స్వయం సహాయక బృందం (కాళీమాతా బృందం) వారు ఈ దురాచారాన్ని నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు. ఈ పనిని తాము మాత్రమే చేయలేమని తలచి, సమీప గ్రామాల్లోని మిగతా స్వయం సహాయక బృందాలన్నింటినీ కలుపుకొని ధిక్కారస్వరం వినిపించారు. 2012 ఆగస్టు 15న సుమారు 300 మంది దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు జాతీయ జెండాను చేతబుచ్చుకుని, జోళ్లు వేసుకుని అగ్రకులస్థుల ఇంటిముందు నడిచి తమ సంఘటిత శక్తిని నిరూపించుకున్నారు. భూస్వాముల దురహంకారానికి విసిగిపోయిన దళిత పురుషులు కూడా ఇందుకు మద్దతు తెలిపారు. ఇలా దళిత మహిళలు సంఘటిత శక్తితో శతాబ్దుల నాటి దురాచారానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది ఆగస్టు 15న కూడా మహిళలు గ్రామం నడిబొడ్డున ఇలాంటి పాదయాత్రలు చేశారు. ఒక దురాచారాన్ని మహిళలు ఇలా సంఘటితశక్తితో ఎదుర్కొని విజయాన్ని సాధించగా, మిగతా అకృత్యాల పట్ల వారు ఎందుకు వౌనం వహించాలి?
ఇటీవలి కాలంలో మహిళలు చేసిన ఐక్య పోరాటాలు ఫలిస్తున్నాయని చెప్పడానికి చక్కటి నిదర్శనం- ప్రముఖ ఆలయాల్లో వారికి ప్రవేశం లభించడం. శనిషింగనాపూర్ (మహారాష్ట్ర) లోని శనీశ్వర ఆలయం లోనికి తమను అనుమతించాలని ఉద్యమించి మహిళలు ఘన విజయం సాధించారు. అలాగే, శబరిమల అయ్యప్ప దేవాలయం లోనికి ప్రవేశించేందుకు మహిళలు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. ఇవన్నీ కేవలం దళిత మహిళలకో, వెనుకబడిన కులాల అతివలకో చెందిన సమస్యలు కావు. దేశవ్యాప్తంగా మహిళలందరికీ సంబంధించిన సమస్యలు.
దేవుడిని, గ్రహ ప్రభావాలను నమ్మడం, నమ్మకపోవడం అనేది వ్యక్తిగత విషయం. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ వుండకూడదు. కానీ, నమ్మకం కలిగిన వ్యక్తి తాను వెళ్లదల్చుకున్న దేవాలయానికి వెళ్లరాదని అంటే- అది ఆ వ్యక్తి హక్కులను కాలరాచినట్టవుతుంది. దానికోసం ఎవరైనా పోరాటం చెయ్యక తప్పదు. జాతిపిత మహాత్మా గాంధీ పరమ ఆస్తికుడైనప్పటికీ సాధారణంగా గుడికి వెళ్లేవారు కాదు. దేవాలయాల్లో హరిజనుల ప్రవేశం కోసం ఆయన సత్యాగ్రహోద్యమాలు చేశారు. ‘హరిజనులను ఆలయాల్లోకి అనుమతించినంత మాత్రాన, వారి సమస్యలకు పరిష్కారం లభించినట్టేనా? అసలు వారు గుడుల్లోకి వెళ్లవలసిన అవసరం ఏముంది?’ అని కొందరు విమర్శకులు గాంధీజీని ఎద్దేవా చేశారు. ‘అది వారికిగల హక్కు. దాని కోసం పోరాడుతున్నాను. హరిజనులందరూ తప్పనిసరిగా దేవాలయాల్లోకి వెళ్లాలని నా ఉద్దేశం కాదు’ అన్నారాయన. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచి విప్లవం రోజులలో రూసో, వోల్టేర్ అనే ఇద్దరు గొప్ప తత్త్వవేత్తలు జ్ఞాపకానికొస్తున్నారు. వారు రూపొందించిన ఒక గ్రంథాన్ని ఆనాటి ఫ్రెంచి ప్రభుత్వం నిషేధించి ప్రతులను తగులబెట్టింది. వోల్టేర్- ‘రూసో ఆ పుస్తకంలో రాసిన ఒక్క వాక్యంతోనూ నేను ఏకీభవించను. కానీ, అతడికి అలా రాయడానికిగల హక్కు కోసం ప్రాణాలైనా ఒడ్డి పోరాడతాను’ అన్నాడు. అదీ హక్కు అంటే!
ఇక, ప్రస్తుత విషయానికి వస్తే శనిషింగనాపూర్ మహారాష్టల్రోని ఒక గ్రామం. ఆ గ్రామంలోని శనీశ్వరాయలం మహా శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. అయిదున్నర అడుగుల శనీశ్వరుడి నల్లరాతి విగ్రహం ఎత్తయిన అరుగుమీద వుంటుంది. ఆలయ అంతర్భాగమైన అరుగుమీదకు ఎక్కి శనీశ్వరుడి దర్శనం పురుషులు చేసుకోవచ్చు గాని, స్ర్తిలు చేసుకోకూడదు. దీనికి స్థానికులు చెప్పే కారణం ఏమిటంటే- శనీశ్వరుడు బ్రహ్మచారి. స్ర్తిలు స్వామివారిని దర్శనం చేసుకుంటే, విగ్రహం నుంచి వచ్చే కాంతి కిరణాలు వారికి హాని కలిగిస్తాయి. స్ర్తిలకు ఋతుక్రమం వుంటుంది కాబట్టి ఆలయ ప్రవేశం మంచిది కాదని అంటారు వారు. అందుకే ఇక్కడ పురుషులు మాత్రమే శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. గత సంవత్సరం ఓ మహిళ ఆలయ నిబంధనలు అతిక్రమించి శనీశ్వరుడి దర్శనం చేసుకుంది. ఇది పెద్ద రగడ అయింది. మహిళా సంఘాల వారు ఇది తమ హక్కులను కాలరాయడమేనంటూ పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. తృప్తీదేశాయ్ అనే మహిళ నాయకత్వంలో న్యాయ పోరాటం చేయడంతో చివరికి మహారాష్ట్ర హైకోర్టు మహిళలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న శనీశ్వరాలయంలోనికి మహిళలు వెళ్లి శనీశ్వరుడిని అర్చించుకునే హక్కు లభించింది. అయిష్టంగానే ఆలయ ధర్మకర్తలు అంగీకరించారు. అయినా మహిళలకు ఏదో విధమైన ఇబ్బంది కొనసాగుతూనే వుంది. శనిషింగనాపూర్ కథ సుఖాంతమే అయినా ఇంకా మహిళలకు సంబంధించి కొన్ని ఆలయాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ హక్కులను సాధించుకునేందుకు వారింకా ఉద్యమించవలసి వుంది. అప్పుడే- ‘ఇంకానా..? ఇకపై సాగదు..’ అనే నినాదం పురుషాధిక్య సమాజానికి పూర్తిస్థాయిలో అవగతం అవుతుంది.

- కోడూరి శ్రీరామమూర్తి, 9346968969