మెయన్ ఫీచర్

విపక్షం రాద్ధాంతం.. విలువలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమావేశాల్లో నోట్లరద్దుపై చర్చ జరిగితే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకుల అవినీతి బాగోతాలు బయటపడతాయి. వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ప్రతిపక్షాలకు ఏర్పడతాయ. పార్లమెంట్‌లో మోదీ వాదనాపటిమకు దీటుగా సమాధానం చెప్పే నాయకులు లేరు. చర్చ జరిగితే ప్రజల ముందు చులకన అయిపోతామన్న భయం విపక్షాలకు ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి అమలుచేసిన ఏకైక కార్యక్రమం- సమావేశాలు జరగకుండా చూడడం.

పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుని కాంగ్రెస్ సహా కొన్ని విపక్ష పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశానికి తీరని అన్యాయం చేస్తున్నాయి. ప్రజాసమస్యలను చర్చిస్తూ, దేశానికి అవసరమైన చట్టాలను చేయవల్సిన పార్లమెంట్‌లో కాంగ్రెస్, దాని అ నుబంధ పార్టీలు అదేపనిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. సరైన కారణాల్లేకుండా సమావేశాలను స్తంభింపచేయడం వల్ల చట్టాల ఆమోదం జాప్యమై, దేశ ప్రయోజనాలకు హాని కలుగుతుంది. 2012లోనే వేసిన ఒక అంచనా ప్రకారం పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతోంది. విలువైన ప్రజాధనాన్ని, ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నాయకులపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని తగ్గించేలా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయ. ఓటర్ల తీర్పుతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ కొన్ని విధానాలను, ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను ఇస్తుంది. వీటికి అనుగుణంగా చట్టాలు రూపొందిస్తుంది. ఈ గమనంలో అధికార పార్టీ చేసే తప్పుడు విధానాలను, ప్రజావ్యతిరేక చట్టాలను విమర్శించడం, ఎండగట్టడం, అడ్డుకోవడం, ప్రత్యామ్నాయంగా సరైన చట్టాలు రూపొందేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది. ప్రజల జీవనగతిని, దేశప్రగతిని నిర్దేశించే పార్లమెంట్ సమావేశాలను జరగనీయకుండా విపక్షాలు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.
పెద్దనోట్లను రద్దు చేస్తూ బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని, అవినీతిని అడ్డుకునేందుకు, ఉగ్రవాదులకు నగదు అందకుండా చేసేందుకు, మాదక ద్రవ్యాలు, హవాలా వ్యాపారులను నిరోధించేందుకు పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం సబబా? కాదా?, దీని అమలు విధానం సరైనదా? కాదా? లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం ఇదొక్కటేనా? ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అన్న విషయాలను చర్చించాల్సిన ఏకైక వేదిక పార్లమెంట్. పెద్దనోట్ల రద్దు, ఇతర ఆర్థిక సంస్కరణలపై ఎన్ని రోజుల చర్చకైనా సిద్ధం అంటూ ప్రభుత్వం చేస్తున్న అభ్యర్థలను కాదని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సమావేశాలు జరగనీయకుండా శాసన వ్యవస్థను బలహీనం చేస్తున్నాయి.
పెద్దనోట్ల రద్దు తరువాత సమావేశాలను ఎవరెవరు అడ్డుకుంటున్నారు? ఏం ఆశించి పార్లమెంట్‌ను స్తంభింప చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు ఆయా ప్రతిపక్ష పార్టీల నేతలు సమాధానం చెప్పి తీరాలి. పెద్దనోట్ల రద్దును తొలుత సమర్ధించిన కాంగ్రెస్ ఆ తరువాత కొన్ని గంటలకే ఈ నిర్ణయాన్ని విమర్శించింది. తృణమూల్ కాంగ్రెస్, అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలు మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. బహుజన సమాజ్, సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఈ గుంపులో చేరాయి. జె.డి (యు) నాయకుడు నితీష్‌కుమార్ ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, ఆ పార్టీలో మరో నేత శరద్‌యాదవ్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
ప్రజాశ్రేయస్సు కోసం మోదీ సర్కారు తీసుకున్న ఎటువంటి నిర్ణయాన్ని అయినాసరే గుడ్డిగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిశ్చయించుకున్నట్లుగా కనపడుతున్నది. 2014 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా ఆ పార్టీ నాయకులు ఇంకా జీర్ణించుకున్నట్లు లేదు. దశాబ్దాల తరబడి దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం లాంటి రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనైన ఆ పార్టీ తన అస్థిత్వం కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేస్తుండడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య.
2004-2014 మధ్య కాలంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు బయటపడ్డాయి. అధికారిక అంచనాల ప్రకారం లక్షా 76 వేల కోట్ల రూపాయలు 32జి స్పెక్ట్రమ్2 కుంభకోణం దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. 2జిస్పెక్ట్రమ్ లైసెన్సులను కొన్ని ప్రయివేట్ టెలికాం కంపెనీలకు నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరలకు అప్పచెప్పి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగేలా చూశారు. ఈ డబ్బంతా కొంతమంది నాయకుల ఖాతాల్లోకి చేరింది. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ పేరిట ఆ పార్టీ నేతలు దాదాపు 70వేల కోట్ల రూపాయలు అప్పనంగా మింగేశారు. భారతదేశ అవినీతి చరిత్రలో కాంగ్రెస్ నేతలు 2010 లో కొత్త అధ్యాయాన్ని రాశారు. అప్పటివరకూ తెరచాటున జరిగే అవినీతి చర్యలను బాహాటంగా, తెగింపుతో నిర్వహించడం మొదలుపెట్టారు. ‘మేం చెప్పిందే వేదం’, ‘మేం కొన్నదే ధర’, ‘మమ్మల్ని ఎవ్వరూ ఏమీ అడగలేరు, అడగకూడదు.. మేం చేసిందే న్యాయం, చెప్పిందే ధర్మం’ అన్న దుందుడుకుతనంతో కాంగ్రెస్ నాయకులు అవినీతి చర్యలకు తెగబడ్డారు. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, సోనియా అల్లుడు రాబర్ట్ వద్రా తదితరులకు వేల కోట్లరూపాయలు ముట్టాయన్న ఆరోపణలు సర్వత్రా వినపడ్డాయి. 2012నాటికి కాంగ్రెస్ పార్టీ అవినీతి విశృంఖల స్థాయికి చేరింది. లక్షా 86 వేల కోట్ల రూపాయలు విలువచేసే బొగ్గుగనుల కుంభకోణం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ‘కాగ్’ నివేదిక ప్రకారం మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యుపిఎ-2 తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి లక్షల కోట్ల నష్టం వాటిల్సింది. అడ్రస్ లేని కంపెనీలకు సైతం ప్రభుత్వం 194 బొగ్గుగనుల లైసెన్సులు జారీచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరుచేసిన 204 బొగ్గుగనుల లైసెన్సులను 2015లో సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో సోనియా, రాహుల్ ఇతర కాంగ్రెస్ నాయకులకు మాత్రమే తెలుసు. మోదీ ప్రభుత్వం వచ్చాక బొగ్గు గనులను బహిరంగ మార్కెట్‌లో వేలం వేయడం ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలను ఆర్జించింది. దేశ రక్షణ, భద్రతలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ నాయకులు 2012లో అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలులో వందల కోట్ల రూపాయలు మింగేశారు. 12 హెలికాప్టర్లను కొనడానికి రాజకీయ నాయకులు, అధికారులకు దాదాపు 610 మిలియన్ అమెరికన్ డాలర్లను లంచంగా ఇచ్చామని అగస్టా ప్రతినిధులే ప్రకటించారు.
ఇపుడు పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా రంకెలు వేస్తూ రోడ్డుకెక్కిన నాయకుల్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఒకరు. 2009లో వెలుగు చూసిన అతి పెద్ద చిట్‌ఫండ్ కుంభకోణంలో మమతకు భారీగా డబ్బు ముట్టిందని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కునాల్‌ఘోష్ టీవీలకు ఇంటర్వ్యూలే ఇచ్చారు. టిఎంసి ఎంపీలకు, మంత్రులకు శారదా గ్రూప్‌తో సంబంధాలున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మదన్‌మిత్ర ఈ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టమని ప్రజలను ప్రోత్సహించారు. బెంగాల్‌లోని (బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని) మాల్దా దొంగ నోట్ల చెలామణికి ప్రధాన కేంద్రం. ఈ మాఫియాతో తృణమూల్ నేతలకు సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. శారద స్కాంతోపాటు ఇతరత్రా సంపాదించిన డబ్బంతా ఎక్కడున్నదో మమతకు తెలుసు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ సిఎం కేజ్రీవాల్ మొదట్నుంచీ అవినీతి కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తూనే వస్తున్నారు. కేజ్రీవాల్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను- దొంగ సంతకాలు, బలవంతపు వసూళ్ళు, వేధింపులు, కల్లోలాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు, హత్యాప్రయత్నాలు, అవినీతి తదితర నేరాలపై అరెస్ట్‌చేశారు. తన సహచరుల అవినీతి, నేర చరిత్రలతో జవాబుచెప్పలేని నిస్సహాయ స్థితికి చేరుకున్న కేజ్రీవాల్ ప్రజల దృష్టిని మళ్ళించేందుకు అసహనంతో మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేత, దిల్లీ మాజీ సిఎం షీలాదీక్షిత్‌ను జైలుకు పంపిస్తానని గొప్పలు చెప్పిన కేజ్రీవాల్ ఇపుడు కాంగ్రెస్ నాయకులను రక్షించే పనిలో ఉన్నారు. ఇక- బిఎస్‌పి అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుల అవినీతికి, ధనదాహానికి అడ్డులేదన్న వాదనలు బలంగా ఉన్నాయి.
పెద్దనోట్ల రద్దుతో చాలామంది నేతలు దాచుకున్న కోటానుకోట్ల రూపాయలు చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. వీటిని బ్యాంకుల్లో జమచేయలేని, ఇంట్లో దాచుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దశాబ్దాలుగా అవినీతికి అలవాటుపడ్డ జీవులు ఇపుడు నీటిలో నుంచి బయటపడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నాయి. అవినీతిపై పోరాటం, ఆర్థిక సంస్కరణలకు ఇది ఆరంభం మాత్రమేనని మోదీ పదే పదే ప్రకటించడంతో వీరందరి గుండె కొట్టుకోవడం దాదాపుగా ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వచ్చాయి. సమావేశాల్లో నోట్లరద్దుపై చర్చ జరిగితే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకుల అవినీతి బాగోతాలు బయటపడతాయి. వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ప్రతిపక్షాలకు ఏర్పడుతాయ. పార్లమెంట్‌లో మోదీ వాదనాపటిమకు దీటుగా సమాధానం చెప్పే నాయకులు లేరు. చర్చ జరిగితే ప్రజల ముందు చులకన అయిపోతామన్న భయం విపక్షాలకు ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి అమలుచేసిన ఏకైక కార్యక్రమం- సమావేశాలు జరగకుండా చూడడం. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తే అనేక కీలకమైన చట్టాలు ఆగిపోతాయి. ఫలితంగా ప్రజాసంక్షేమ పథకాల అమలు ఆలస్యం జరుగుతుంది. ప్రజాసంక్షేమ పథకాల అమలు ఆలస్యమైతే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక భావనలు ఏర్పడతాయి. అవి తమకు రాజకీయంగా ఉపయోగపడవచ్చునన్న కుత్సిత ధోరణితో ఇవాళ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి.
ప్రభుత్వాలు మంచిపని చేస్తున్నప్పుడు సమర్ధించడం, తప్పులు చేస్తున్నప్పుడు ఎండగట్టడం విజ్ఞత కలిగిన రాజకీయ పార్టీల లక్షణం. ఇవాళ ఆ పరిపక్వతను కాంగ్రెస్, ఇతర పార్టీలు చూపిస్తున్నట్లుగా కనపడడం లేదు. ఇందుకు జి.ఎస్.టి. అమలు ఒక ఉదాహరణ. జి.ఎస్.టి. అమలులోకి వస్తే దేశంలో పన్నుల విధానంలో అద్భుతమైన సవరణలు జరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే ప్రజాసంక్షేమానికి వీలు కలుగుతుంది. మోదీకి, బిజెపికి ఎక్కడ పేరుప్రఖ్యాతులు వస్తాయోనన్న భయంతో కోట్లాది మంది ప్రజల శ్రేయస్సును కాలరాసి కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. ఈ పరిణామాలను సునిశితంగా గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో వీటిని ఏ మాత్రం సహించరు. మొండిగా ప్రవర్తిస్తూ, ప్రజాస్వామ్యం గొంతునొక్కాలని విపక్ష నేతలు చేస్తున్న ప్రయత్నాలను జనం తిప్పికొడతారు. 1975-77లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీనే ప్రజలు చిత్తుచేశారు. వారికి ఇదొక లెక్క కాదు. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113