సబ్ ఫీచర్

బోధనలో నిజాయతీ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను తరగతి గది నుంచి రాగానే టీచర్స్ రూమ్‌కు వెళ్లేవాణ్ణి. నాగలి విడిచిన ఎద్దు మాదిరిగా కాకుండా బడి విడిచిన పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చినట్లు వెళ్లేవాణ్ణి. ఆనాడు టీచర్స్ రూమ్ అంటే అదొక విద్యామండలి. ఎవరికివారుగా వాళ్ల సొంత విషయంకన్నా ప్రతివాడు తరగతి గదిలో ఏం జరిగిందో చర్చకు పెట్టేవారు. ప్రతి ఉపాధ్యాయుడు అన్ని క్లాసులకు పోడు. ఈ చర్చవలన ప్రతి ఉపాధ్యాయుడికి ఏ తరగతిలో ఏం జరుగుతున్నదో తెలిసేది. ఆ చర్చ కొన్నిసార్లు రసవత్తరంగానే జరిగేది. కొన్నిసార్లు టీచర్స్ రూమ్‌లో అనేక విషయాలు తెలుసుకున్నాను. అందులో కొందరు మంచికోరేవారు, కొందరు సన్నిహితులు, కొందరు స్నేహితులుంటారు. వీళ్లందరికన్నా స్నేహితులు చెప్పిన మాటలే నాకు శిరోధార్యం. హితులు ఏంచేసినా భళే అంటారు.
సన్నిహితుడైతే ప్రచారం కూడా చేస్తారు. కానీ స్నేహితుడనే వాడు మనకు పాఠాలు చెబుతాడు. ఆ స్నేహితుడే భువనగిరి స్కూల్లో తెలిదేవర వెంకట్రావు. ఆయన వయస్సు అప్పటికే 50 ఏళ్లకు పైబడి ఉండేది. నా వయసు 20 సంవత్సరాలుండేది. ఆయనంటే ప్రేమ, వినయం ఉంది. తరగతి గదిలో జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పేది. కొన్నిసార్లు నవ్వేది, కొన్నిసార్లు మెచ్చుకునేది. కొన్నిసార్లు కోప్పడేది. ఇంకా నువ్వు చదువవలసింది చాలా ఉంది. ఎప్పుడు కూడా పిల్లలకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. విషయం తెలియకుంటే రేపు చెబుతాను అని చెప్పాలి కానీ నోటిముచ్చట మాట మాట్లాడకూడదు. టీచర్ చెప్పిన దాన్ని విద్యార్థులు అదే సరైనది అనుకుంటారు. ఆ అభిప్రాయం విద్యార్థికి జీవితాంతం అదే ఉంటుంది. తప్పుడు అభిప్రాయం, తప్పుడు సమాచారం ఇస్తే ఒక తరం పెడతోవన పడుతుంది. రేపు తరగతి గదికి వెళ్లగానే బహిరంగంగా తాను నిన్న చెప్పిన సమాచారం తప్పు అని కానీ సరైనదికాదు అని కాని చెప్పాలి. అప్పుడు పిల్లలు హర్షిస్తారు. ఇలా చేయటంవల్ల ఉపాధ్యాయుని గౌరవం పెరుగుతుంది. కానీ పోదు. ఫలానా పుస్తకం చదువు అని, అందులో అనేక అంశాలు ఉన్నాయని తెలిదేవర వెంకట్రావు చెప్పేవారు. అలాంటి స్నేహితులు నాకున్నారు. టీచర్స్ రూమ్ అంటే స్ట్ఫారూమ్ కాదు, అదొక విద్యామండలి.
అందువల్లనే ఉత్తమమైన స్నేహితులు మనల్ని తప్పుడు మార్గం నుంచి మంచి మార్గంలోకి దిశానిర్దేశం చేస్తారు. ఒప్పులుంటే మెచ్చుకుంటారు. మనలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ మనమెట్లా ఉండాలో చెబుతారు. అందువల్లనే ప్రపంచంలో ఉత్తమ స్నేహితుడితో మరొకరిని సరిపోల్చలేం. స్టాఫ్‌రూంలో ఉండగా అంటువంటి స్నేహితులు పుణ్యమా ని నాలోని లోపాలను సరిదిద్దుకొని ఎప్పటికప్పుడు సరికొత్త అనుభవంతో తరగతి గదికి ఉత్సాహంగా వెళ్లేవాడిని. నిజమే...పిల్లలు తమ గురువులు చెప్పిన విషయాలను..నిజమైనవిగా భావిస్తారు. అవే వారి మనో ఫలకాలపై ముద్రితమై జీవితాంతం శాశ్వతంగా నిలిచి ఉంటాయ. అటువంటి పరిస్థితుల్లో, విద్యార్థులకు చెప్పాల్సిన అంశాలు చాలా స్పష్టంగా, నిజమై నవిగా, వారి జీవితానికి ఎంతో ఉపకరించేవిగా ఉండాలి. పాఠశాల దశలో మనసులో నాటుకుపోయన అంశాలే విద్యార్థులు తాము పెద్దయ్యాక రోజువారీ అనుభవాల్లో వారికి దిశా నిర్దేశం చేస్తుంటాయ. అన్నీ కాకపోవచ్చు. కొన్నయనా వారిపై తప్పనిసరిగా ప్రభావం చూపేవిగా ఉంటాయ. అందువల్ల విద్యాబోధన సమయంలో ఉపాధ్యాయుడు ఎంతో నిజాయతీగా తనకు తెలిసిన విషయాలను స్పష్టంగా చెబుతూ, తెలియని విషయాలను తర్వాత చెప్పడం ఉత్తమం. అప్పటికప్పుడు మాట దక్కించుకోవడానికి ఏదో ఒకటి చెబితే వారికి ద్రోహం చేసినట్టే లెక్క.

- చుక్కా రామయ్య