ఎడిట్ పేజీ

కాలుష్యం పొగలో ‘కల్తీ’ సూత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగరంలోని ఒక రైతుబజార్ ప్రాంగణంలో ఆకుకూరలు, కూరగాయలు అమ్మే వారు కొలువుదీరి ఉన్నారు. ఎక్కువమంది విక్రేతలు గ్రామీణ మహిళలు. ఆ పక్కనే మహానగర పాలిక వారు ఏర్పాటుచేసిన భారీ ‘చెత్తబుట్ట’ కూడా ఉంది. భయంకరమైన చెత్త పొంగిపొరలుతూ ఉన్న దృశ్యాన్ని కూరలు కొనేవారు దర్శించక తప్పదు! ఎందుకంటే భరించరాని దుర్గంధం మన దృష్టిని ఆ ‘వ్యర్థ పదార్థ భాండారాగాం’ వైపు మళ్లించకమానదు! ‘మరి మీరు రోజంతా ఎలా భరిస్తున్నారమ్మా?’ అన్న ప్రశ్నకు ‘ఏం చేయాలి బాబూ, మూడు రోజులుగా చెత్తను తీయడం లేదు’ అన్న సమాధానం వస్తోంది! అక్కడ ఒక చోట మాత్రమే కాదు, దేశమంతటా ఇదే దృశ్యం పునరావృత్తం అవుతోంది! ‘నగర పాలిక’ నిద్రలేచి ఇక్కడి చెత్తబుట్టను తొలగించారు! మరోచోట, అనేక ప్రదేశాలలో కొత్త ‘దుర్వాసనా భాండాగారాలు’ వెలసిపోతున్నాయి. ఈ చెత్తను వాహనాలలో ప్రధాన వీధుల గుండా తరలిస్తున్నప్పుడు దుర్గంధం దిక్కులు పిక్కటిల్లేలాగ వ్యాపించి పోతోంది. ఇంటిలోనుండి బయలుదేరిన ‘విష రసాయనాల’ చెత్త టన్నులు టన్నులుగా ‘వ్యర్థ పదార్థ నిక్షిప్త ప్రాంగణాల’- లాండ్ ఫిల్ సైట్స్‌కు చేరుతోంది! ఆ పెద్ద పెద్ద ప్రాంగణాలలో సైతం ఈ ‘చెత్త’ నిక్షిప్తం కావడానికి చోటు లేదు. అందువల్ల ఈ ప్రాంగణాలలో చెత్తను తగులబెడుతున్నారు! ఇలా తగులబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం భయంకరంగా విస్తరిస్తోందట! అందువల్ల బహిరంగ స్థలాల్లోను ప్రత్యేకించి ఈ ‘లాండ్ ఫిల్ సైట్స్’లోను చెత్తను తగులబెట్టరాదని ‘జాతీయ హరిత న్యాయ మండలి’- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి- వారు ఇటీవల ఆదేశించారు! బహిరంగ ప్రదేశాలలో కొద్దిపాటి చెత్తను తగులబెట్టినవారికి ఐదు వేల రూపాయల జరిమానా విధించాలన్నది ఎన్‌జిటి వారు చెప్పిన తీర్పు. పెద్ద ఎత్తున చెత్తను తగులబెట్టేవారి నుంచి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాను వసూలు చేస్తారట! ‘లాండ్ ఫిల్ సైట్స్’- వ్యర్థ పదార్థ ఖనన ప్రాంగణాలలో చెత్తను పూడ్చిపెట్టడం వల్ల భూగర్భం విషమెక్కిపోతోంది. ఈ చెత్త మామూలు చెత్త కాదు, రసాయనాలతో సంకరమైపోతున్న నగరాల చెత్త, ‘కల్తీ’ పదార్థాలతో కాలుష్యం పెంచుతున్న నాగరికుల చెత్త! దేశ రాజధానిలోను, ఇతరేతర వందల వేల నగరాలలోను, ‘నరకాల’లోను భూగర్భ జలాలు మురుగునీరుగా మారిపోతుండడానికి ప్రధాన కారణం ‘కల్తీ’ చెత్తను పూడ్చిపెట్టడం! అందువల్ల నగర పాలకులు, పురపాలకులు ‘కల్తీ’ చెత్తను తగులబెట్టారు! ఎన్‌జిటి ఆదేశం తరువాత ఏమి చేస్తారు?
భారతీయుల జీవన పద్ధతిలో ‘స్వచ్ఛత’ మళ్లీ సర్వ సమగ్రం కానిదే ‘స్వచ్ఛ్భారత్’ ఏర్పడడం అసంభవం. ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ‘స్వచ్ఛ్భారత్’కు ప్రధాన ప్రతిబంధకం ‘ప్రపంచీకరణ’ వాణిజ్య పద్ధతులతో సంకరమైపోయిన మన జీవన రీతి! మానసిక బౌద్ధిక స్వచ్ఛత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలన్నది అందరికీ తెలిసిన వాస్తవం. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘ప్రవర్తన పాఠం’ ఒకటుంది. ఒక కుటుంబంలో- అంటే పూర్వకాలపుఉమ్మడి కుటుంబంలో ఒక పిల్లవాడు అతిగారాబం వల్ల పాడయ్యాడు! వాడిని ఎవ్వరూ దండించేవారు కాదు. ఎప్పుడో అప్పుడు అతగాడిని ఎవరైనా దండించబోతే, ఈ దండించబోయే వారిని ఇంటిలోని మిగిలిన వారందరూ కలిసికట్టుగా దండించేవారట! ‘అవినీతి’ కూడా అలా పెరిగింది. ‘అవినీతి’ అన్నది ‘వాణిజ్య సాహసం’ అని కూడా ప్రచారమైంది! మోదీ నడుం బిగించి ‘అవినీతి’ని దండించడానికి యత్నిస్తున్నాడు. దేశంలోని విపక్షాలలో అత్యధికం మోదీని దండించడానికి యత్నిస్తున్నాయి! ‘అవినీతి’ వ్యవస్థీకృతం కావడానికి అతి ప్రధాన ప్రాతిపదిక వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్! మన దేశంలో ఈ ‘ప్రపంచీకరణ’ పాతుకొనిపోవడానికి కారణభూతమైన మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ కూడా మోదీని దండించాడు. పెద్దనోట్లను రద్దుచేయడం తప్పన్నాడు! ఈ దేశం గురించి ఏమీ తెలియని రాహుల్ గాంధీ వంటి ‘ఆషామాషీ’ విదూషకులు సైతం మోదీని దండిస్తున్నారు! కానీ అవినీతిని దండించడానికి అత్యంత ఆర్భాటం చేస్తున్న మోదీ ప్రభుత్వం అవినీతిని కేంద్రీకరించిన ‘ప్రపంచీకరణ’ మాయా మారీచ మృగాన్ని మాత్రం దేశం నుండి వెళ్లగొట్టడానికి నడుం బిగించడం లేదు! ఇదీ ‘సాంకర్యం..’ ఇదీ కల్తీ.. మన్‌మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ‘ప్రపంచీకరణ’ విధానం ‘స్వచ్ఛ్భారత్’ను ‘కల్తీ’చేస్తూనే ఉంది! కమలాపండు, అరటిపండు తిన్న తరువాత ‘తొక్కలు’ చెత్త! కానీ ఈ ‘తొక్కలు’ సహజమైనవి కాదు,ప్రాకృతికమైన ‘తొక్కల’పై విష రసాయనాలను చల్లేశారు! అలా చల్లితే తప్ప పళ్ళు, కూరగాయలు ‘నిగనిగలాడుతూ’ వినియోగదారులను మురిపించబోవట! అందువల్ల సహజమైన తొక్కలు, తొడిమలు, ఆకులు, కాడలు ‘మళ్లి’ కల్తీ చెత్తను తయారుచేశాయి! తగులబెడుతున్నది ఇలాంటి చెత్తను. ఇలా పుడమిని, నింగిని ప్రక్షాళనం చేయవలసిన ‘నిప్పు’ వాటిని కాలుష్యవంతం చేస్తోంది! నిప్పులను ‘కల్తీ’ చెదలు గ్రసిస్తోంది!
1984 డిసెంబరు రెండవ తేదీ రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘యూనియన్ కార్బయిడ్’ వారి ఎరువుల కర్మాగారం నుంచి ‘మెథిల్ ఐసోసినేట్’ అన్న విషవాయువు వెలువడింది. మూడు వేల ఎనిమిది వందల మందిని బలితీసుకుంది. అనేక వేల మందిని శాశ్వత మానసిక బౌద్ధిక శారీరక రుగ్మతలకు గురిచేసింది. విషవాయువును వదలిపెట్టిన ప్రధాన హంతకుడు, ‘యూనియన్ కార్బయిడ్’ సంస్థ అధిపతి వారెన్ యాండర్‌సన్ భోపాల్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి తన దేశమైన అమెరికాకు విమానాలెక్కి పారిపోయాడు. అప్పటి మన కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఈ విమానాలను ఏర్పాటుచేసి యాండర్‌సన్‌ను సురక్షితంగా దేశం వెలుపలకి తరలించడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ప్రాబల్యంతో రాజకీయాలు ‘కల్తీ’ అయిన తీరుకు నిదర్శనం. ఈ ‘కల్తీ’ వలయంలో ‘స్వచ్ఛత’ కూడా ప్రస్ఫుటించింది. కాలుష్య వాయువులను పసిగట్టగానే కొన్ని కుటుంబాల వారు తమ ఇళ్లలోని ‘హోమ’కుండాల ముందు కూచుని అగ్నిని వెలిగించారు. కల్తీలేని హోమ ద్రవ్యాలను ఆహుతి చేశారు. కర్మాగారపు విషవాయువులు వెలువడడం ఆగిపోయేవరకూ ఈ కుటుంబాల వారు తమ ఇళ్ళలోని హోమకుండాల వద్దనే కూచుని హోమధూపాన్ని పీల్చారట! ఫలితంగా ‘యూనియన్ కార్బయిడ్’ హంతక కర్మాగారం సమీపంలోనే ఉన్నప్పటికీ ఈ కుటుంబాలవారు విషవాయు ప్రభావానికి గురికాలేదు! విషవాయు ప్రభావాన్ని హోమాగ్ని జ్వాలలు, హోమ ధూమం నిరోధించాయి! ఇది కల్పన కాదు, కమనీయమైన వాస్తవం! హోమద్రవ్యాలను ‘తగులబెట్టడం’వల్ల పరిసరాలు ప్రక్షాళన అవుతున్నాయి. అందువల్ల ‘హోమం’ చేయడం కాలుష్య నివారణకు మార్గమన్న శాస్ర్తియ సత్యాన్ని పాశ్చాత్యులు గుర్తించి ఆచరిస్తున్నారట! పారిశ్రామిక కాలుష్యంతో మన దేశం ఇప్పుడు పొగచూరిపోయింది. కానీ అమెరికా, ఐరోపా దేశాలు ఎప్పుడో పొగచూరిపోయాయి! నీలం రంగులోని స్వచ్ఛమైన ఆకాశం కన్పించడం ఈ దేశాలలో యాభయి ఏళ్ల క్రితమే అరుదైపోయింది! అందువల్ల ‘హోమం’, ‘యజ్ఞం’ వంటి ‘అగ్నికార్యం’ ద్వారా మాత్రమే పరిసరాలు ప్రక్షాళనవౌతున్నాయన్న సూత్రాన్ని ఈ పాశ్చాత్య దేశాలలో అనేక చోట్ల అమలు జరుపుతున్నారట! ఈ ‘అగ్నిగృహాల’- ఫైర్ ప్లేసెస్ గురించి దశాబ్దులుగా ప్రచారవౌతోంది! ‘యజ్ఞాత్ భవతి పర్జన్యః’- యజ్ఞం వల్ల మేఘం ఏర్పడుతుందన్నది యదుకుల కృష్ణుడు ఐదు వేల నూట యాభయి మూడేళ్లకు పూర్వం పాండవ మధ్యముడైన అర్జునునికి వివరించిన ప్రాకృతిక వాస్తవం. మేఘం ఏర్పడడమంటే వర్షం కురుస్తుంది! యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది! కానీ ఈ ‘సత్యం’ ఇప్పుడు ‘కల్తీ’ అయిపోయింది! విషరసాయన వర్షాలు కురుస్తున్నాయి!
ఇలా ప్రక్షాళనం చేయగలిగిన ‘అగ్ని’- కాలుష్యాన్ని పెంచుతుండడానికి కారణం ‘్భరతీయత’ ప్రపంచీకరణతో సంకరం కావడం, కల్తీ కావడం! భారతీయులు పుడమిని మొత్తం ఒకే ఇల్లుగా భావించారు, ఇదే ‘వసుధైక కుటుంబం’, ‘వసుధైవ కుటుంబం’! దీనికి ప్రాతిపదిక సంస్కార పరిమళ సమాహారమైన సంస్కృతి! కానీ ఇపుడు ‘పుడమి పల్లె’ పేరుతో చెలామణి అవుతున్న ‘ప్రపంచీకరణ’కు ప్రాతిపదిక కొన్ని సంపన్న దేశాల అక్రమణ వాణిజ్య ప్రయోజనం! అందువల్ల స్వదేశీయ సంస్కారాలు అక్రమ విదేశీయ అక్రమ వాణిజ్య ప్రయోజనాలతో ‘కల్తీ’ అవుతున్నాయి! ‘అగ్ని’ కాలుష్యపు పొగలను సృష్టించడానికి ఇదీ కారణం! ‘ఆవు నెయ్యిని అన్నంలో కలుపుకుని తింటారా ఎక్కడైనా? పూజలకు మాత్రమే కదా ఆవు నెయ్యి!’ అని అనడం జీవనరీతి- ఫాషన్ అయిపోయింది! ‘హోమం’ వల్ల, ‘యజ్ఞం’ వల్ల కాలుష్యం తొలగకపోవడం ‘కల్తీయుగం’ ప్రభావం! ‘హోమం’ ద్వారా ప్రక్షాళన జరగాలంటే ఆవు నెయ్యి కావాలి. కానీ ఆవు సైతం కల్తీ అయిపోయింది! ‘జెర్సీ’ ఆవు నెయ్యి నిజానికి ఆవు నెయ్యి కాదు! అది రకరకాల పశువుల నెయ్యితో సమానం! ‘ఆవు నెయ్యి’ అంటే దేశవాళీ ఆవునెయ్యి! స్వచ్ఛమైన గడ్డిమేసిన దేశవాళీ ఆవుపాల నుండి, పెరుగు నుండి లభించే నెయ్యి. దేశవాళీ ఆవులు శతాబ్దులుగా హత్యలకు గురై అంతరించాయి. రెండు వందల జాతుల దేశవాళీ ఆవులలో ఇరవై తొమ్మిది జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయట! ఇలా మిగిలి ఉన్న జాతుల ఆవుల సంఖ్య కూడా కోట్లనుండి లక్షలకు పడిపోయింది! ఉన్నవాటికి స్వచ్ఛమైన గడ్డి ఏది?
రెండు వందల నలభై కిలోమీటర్ల పరిశుభ్ర జలాలలో ఓషదీ రసాలతో పరుగులు తీసిన ముచికుందా నది, ఇపుడు మురుగునీటి ‘మూసీ’గా మారిపోయింది. ఈ నదీ తీరంలో పెరుగుతున్న ‘గడ్డి’లో విషపూరితమైన ‘సీసపు’ రసాయనాలు పేరుకొనిపోతున్నాయట! దేశంలోని అన్ని నదుల తీరాలలోని గడ్డిలో కూడా విష రసాయనాలు పెరుగుతున్నాయి. ఇలాంటి గడ్డి మేసిన దేశవాళీ ఆవులు సైతం ‘బొగ్గుపాల’ను మాత్రమే ప్రదానం చేస్తున్నాయి. అలాంటి ఆవుపాల నుండి పెరుగు నుంచి లభించే ‘నెయ్యి’ని హోమంలో దగ్ధం చేయడం వల్ల కాలుష్యం ఎలా తొలగుతుంది? వర్షం ఎలా కురుస్తుంది? ‘కల్తీ’ విశ్వరూపం దాల్చి విస్తరించిపోతుందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! సువిశాలమైన వ్యవసాయ క్షేత్రాలలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలను బహిరంగంగా తగులబెట్టడం గతంలో నిరపాయకరం! కానీ దశాబ్దుల తరబడి పంటల గడ్డి, ఇతర వ్యర్థ పదార్థాలు రసాయన ఎరువులతో, క్రిమి సంహారక విషాలతో కలుషితమైపోయాయి. హర్యానా రైతులు తగులబెట్టిన ‘గోధుమ కొయ్యల’ వల్ల ఢిల్లీలో కాలుష్యపు పొగలు కమ్ముకుంటున్నాయట!
*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352