సబ్ ఫీచర్

బాలికలను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని రంగాల్లో మనదేశం అభివృద్ధి సాధిస్తోందని పాలకులు చెబుతున్నప్పటికీ బాలికలు మాత్రం ఇంకా పలురూపాల్లో వివక్షకు గురవుతునే ఉన్నారు. ఆడపిల్ల భూమీద పడకుండా భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు వంటివి జరుగుతునే ఉన్నాయి. దీంతో బాలికల సంఖ్య తగ్గుతోంది. చట్టాలెన్ని ఉన్నా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. మన దేశంలో గర్భస్రావాల సంఖ్య ఏడాదికి కోటిపైనే. తల్లిగర్భమే ఆడశిశువులకు మృత్యు పీఠమైతే అంతకంటే దారుణం ఇంకొకటి వుండదు. భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. 12 మిలియన్ల మంది ఆడపిల్లలు పుడితే వారిలో ఒక మిలియన్ మంది మొదటి పుట్టిన రోజు చూసుకోవడం లేదు. మూడు మిలియన్ల మంది తమ 15వ పుట్టిన రోజు చూసుకోవడం లేదు. ఫలితంగా స్ర్తి, పురుష నిష్పత్తి తగ్గుతోంది. ఇక, ప్రతి పదిమంది బాలికల్లో ఆరుగురు బాల్య వివాహాలకు గురవుతున్నారు. ప్రతి పదిమంది బాలికల్లో కనీసం నలుగురు 18 ఏళ్లు నిండకుండానే తల్లులవుతున్నారు. చదువుకు దూరమైన బాలికలు ఇంటి పనులు చేస్తున్నారు. గ్రామీణ పేదల్లో చాలామంది బాలికలు కూలిపనులకు, భిక్షాటనకు వెళుతున్నారు. కొందరు అక్రమ రవాణాకు గురవుతూ వేశ్యావాటికలకు చేరుతున్నారు.
అక్షరాస్యత, ఉన్నత విద్యలో బాలికలు ఇంకా వెనకబడే వున్నారు. 2011లో మన దేశంలో మహిళల్లో అక్షరాస్యతా శాతం 65.46. నేపాల్‌లో ఇది 92 శాతం, పాకిస్తాన్‌లో 74 శాతం, బంగ్లాదేశ్‌లో 54 శాతం. గతంలో కంటే బడిలో చేరే బాలికల సంఖ్య పెరిగింది. అయితే,ప్రతి పది మంది బాలికల్లో ముగ్గురు మాత్రమే 8వ తరగతికి చేరుకుంటున్నారు. 45 శాతం మంది బాలికలు ఐదవ తరగతి లోపే చదువుకు స్వస్తి చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర వసతులు లేకపోవడం వంటి అనేక సమస్యలు ఇందుకు కారణమవుతున్నాయి. చాలాచోట్ల టీచర్ల కొరత కారణంగా బాలికలను చదువులో ప్రోత్సహించే వారే కరవవుతున్నారు. స్ర్తి, పురుష నిష్పత్తి ప్రతికూలంగా వుంటే సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇప్పటికే హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వధువులకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం వుంది.
బాలికలను కాపాడేందుకు అనేక చట్టాలు, సంస్థలు వున్నాయి. అయితే, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. సమగ్ర బాలల సంరక్షణ, జాతీయ శిశు పరిరక్షణ వంటి పథకాలున్నాయి. ఇవి పిల్లలకు పౌష్టికాహారం సమకూర్చడానికి కృషి చేస్తున్నాయి. బాలికలు మానసికంగా ఎదగడానికి కిశోరి శక్తి యోజన వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. భ్రూణహత్యలు, అక్రమ గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలను నివారించేందుకు ఇప్పటికే ఉన్న చట్టాలపై సమాజంలో అవగాహన కలిగించాలి. పాలకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందుకు ఐక్యంగా కృషి చేయాలి. అన్ని ప్రభుత్వ బడుల్లో వౌలిక వసతులు కల్పించాలి. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమానికి ప్రజలు అన్నివిధాలా సహకారం అందించాలి.

- ఇమ్మానేని సత్యసుందరం