ఉత్తరాయణం

సెకండ్ హ్యాండ్ సైకిల్‌కి స్పీడెక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠం గమ్యంగా రేస్ మొదలైంది. అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన ఇస్తామంటూ ‘కమలం’ పట్టుకొని మోదీ, సామాజిక న్యాయం జెండాతో ఏనుగు అంబారీపై మాయావతి, వేగంలో వెనకున్నా వ్యూహంలో ముందున్నామంటూ ‘చెయ్యి’ ఊపుతూ రాహుల్ గాంధీ ఎన్నికల రేస్‌కి రెడీ అయిపోయారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తన ‘సైకిల్’కి స్టాండ్ తియ్యలేదు నిన్నటిదాకా. నేనంటే నేను సైకిల్ తొక్కుతానంటూ ఎన్నికల సంఘం గడపతొక్కారు తండ్రీకొడుకులిద్దరూ. ‘నా అనుభవమంత లేదు నీ వయసు. సైకిల్ నాకిస్తే కళ్లుమూసుకొని రేస్‌లో గెలుస్తాన’ని అంటాడు ములాయం. ‘నాన్నా.. కళ్ళుమూసుకొని తొక్కగలిగినా శరీరం సహకరించే వయసుకాదు నీది. నేనే ఇప్పటికి కరెక్ట్’అంటాడు కుమారుడు అఖిలేష్. ఎన్నికల సంఘం ఈ నాన్నాకొడుకుల పోరు తీర్చింది. సైకిల్‌ని అఖిలేష్‌కే కట్టబెట్టింది. ఇక రేస్‌ని సెకండ్ హ్యాండ్ సైకిల్‌తో సాధించడమే ఆయన ముందున్న సవాల్. సైకిల్‌పై ఉన్న పాత సామాను బరువును ఆయన వదిలించుకొన్నారు. కొత్త ఇమేజ్‌తో ఎంచక్కా సైకిల్‌పై దూసుకుపోవచ్చని అఖిలేష్ ఆశపడుతున్నాడు. పైగా రాహుల్ తనూ సైకిల్‌పై ఓ చేయి వేస్తానన్నాడు. ఆయన సాయం ఏమాత్రమన్నది తరువాత.. ఎత్తుపల్లాల్లో తొక్కినప్పుడు మాత్రం అఖిలేష్‌కి అవసరమైన ధైర్యాన్నివ్వడానికి పనికొస్తుందన్నది ఖాయం. ఇకపోతే ఎంత చెడ్డా తండ్రి చూపే మార్గదర్శనం ఇపుడు అఖిలేష్‌కి అవసరం. ఇందులో ఆయన అర్జునుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. ‘నినె్నలా ఓడించాలో చెప్పు తాతా’ అంటూ నేరుగా భీష్మునే్న అడిగిన అర్జునుడి చతురత ఒంటబట్టించుకోవాలి. ఇదంతా తండ్రీ కొడుకుల ఉమ్మడి వ్యూహమే అనుకోవడంలో కూడా ఆశ్చర్యపడాల్సింది లేదు. అఖిలేష్ ప్రస్తుతానికి రేస్‌లో ముందువరసలోకి వచ్చేసినట్టే. అసలే సెకండ్ హ్యాండ్ సైకిల్‌కి స్పీడ్ ఎక్కువని చరిత్ర కూడా చెప్పింది మరి.
- డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ. పార్వతీపురం
జాతీయ ప్రభుత్వం ఎలా?
బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ మీద కోపం వచ్చింది. పెద్దనోట్ల రద్దుతో ఆ కోపం పరాకాష్ఠకి చేరింది. భావప్రకటనా స్వేచ్ఛ ఉంది కాబట్టి ‘మోదీ అసమర్ధుడు. దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అతడ్ని ఇంటికి సాగనంపండి’ అని మమతా బెనర్జీ రాజకీయ కోణంలో అనడం వరకు ఓకే. కానీ, బిజెపి నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ లేదా జైట్లీ నేతృత్వంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మమత డిమాండ్ చేయడమే విచిత్రం. జాతీయ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? రాజ్యాంగంలోని ఏ సూత్రం ప్రకారం అది సాధ్యం? ఆ విషయం ఆమె చెప్పలేదు. ఎందుకంటే అలాంటి ఏర్పాటు రాజ్యాంగంలోనే లేదు.
- శాంతిచంద్రిక, సామర్లకోట
జీవనోపాధికే వలసలు
నేడు దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు తగిన ఉద్యోగ అవకాశాలు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది పట్ట్భద్రులు రోజువారీ వేతనాలకు పనిచేస్తున్నారు. కొందరు పొట్టచేత పట్టుకుని విదేశాలకు వలస పోతున్నారు. చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు పొంతన ఉండటం లేదు. డిగ్రీ స్థాయిలోనే స్వయం ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. దీనివల్ల డిగ్రీ పూర్తిచేసిన వారు అసంతృప్తికి లోనుకాకుండా, కాలాన్ని వృథా చేసుకోకుండా నచ్చిన రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంది.
- జె.సుధాకరరావు, కాకినాడ