సంపాదకీయం

జిహాదీ ద్వంద్వనీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాద సంబంధ సమాంతర పరిణామాల మధ్య రెండు వైపరీత్యాలు స్ఫురిస్తున్నాయి. మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న జిహాదీ బీభత్సకాండను చైనా ప్రభుత్వం ప్రోత్సహించడం మొదటి వైపరీత్యం. జిహాదీ మతోన్మాద హత్యాకాండ పట్ల అత్యధిక ‘ఇస్లాం మత ప్రభుత్వ దేశాలు’- ఇస్లామిక్ స్టేట్స్- ద్వంద్వనీతిని పాటిస్తుండడం రెండవ వైపరీత్యం. ‘జాయిష్-ఏ- మహమ్మద్’ జిహాదీ ముఠాకు చెందిన మొదటి హంతకుడు మసూద్ అఝార్‌ను విచారించి శిక్షించడానికి దోహదం చేసే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రభుత్వం వమ్ము చేయడం మొదటి వైపరీత్యానికి నిదర్శనం. చెన్నై నగరం కేంద్రంగా బీభత్స వ్యూహాన్ని అమలు జరుపుతున్న ‘ఇరాన్ సిరియా ఇస్లాం మతరాజ్యం’- ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా- ఐఎస్‌ఐఎస్- జిహాదీ ముఠాకు సిరియా నుంచి నిధులు సమకూడుతుండడం రెండవ వైపరీత్యం. ప్రపంచంలోని అత్యధిక జిహాదీ ముఠాలకు సౌదీ అరేబియాలోని సంపన్నుల నుంచి నిధులు సమకూడుతున్నాయి. ఇలా నిధులను సమకూర్చుతున్న సౌదీ అరేబియా గత నాలుగు నెలల్లో ముప్పయి తొమ్మిదివేల పాకిస్తానీ అక్రమ ప్రవేశకులను పాకిస్తాన్‌కు తిప్పి పంపిందట. ఈ ‘వీసా’ల నిబంధనలను ఉల్లంఘించిన వారిలో అ త్యధిక సంఖ్యాకులు ఐఎస్‌ఐఎస్ మద్దతుదారులన్నది సౌదీ ప్రభుత్వం వారి అనుమానం. ప్రపంచంలోని దా దాపు అన్ని జిహాదీ ముఠాల అనుసంధాన వ్యవస్థ పేరు ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్’- ఐఎస్‌ఐ- ఇటీవలి కాలంలో పశ్చిమాసియాలోను, మన దేశంలోను, ఆఫ్రికాలోను, ఐరోపాలోను ఉద్థృతంగా పనిచేస్తున్న ఐఎస్‌ఐఎస్ కూడ ఐఎస్‌ఐ అనుసంధాన వ్యవస్థలో భాగస్వామ్యమైంది. ఆఫ్రికాలోని ‘బోకోహరామ్’ జిహాదీ హంతకులకు ఐఎస్‌ఐ శిక్షణనివ్వడం కూడ అంతర్జాతీయ బహిరంగ రహస్యం. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా పేరు మోసిన ఐఎస్‌ఐ నిజానికి జిహాదీ బీభత్స కలాపాల అనుసంధాన సంస్థ. నేపాల్‌లోకి కూడ చొరబడిన ఐఎస్‌ఐ, ఐఎస్‌ఐఎస్ మన దేశంలో బీభత్స కలాపాలను కొనసాగిస్తున్నాయి. ఐఎస్‌ఐ ప్రధానంగా సూత్రధారి, కానీ ఐఎస్‌ఐ ముష్కరులు పాత్రధారులుగా కూడ మారుతున్నారు. నేపాల్‌లో గత నాలుగవ తేదీన పట్టుబడిన షంషూల్ హోడా అనేవాడు ఐఎస్‌ఐ నేపాల్‌లో జరుపుతున్న కలాపాలకు ప్రతినిధి. నేపాల్ పౌరుడైన ఇతగాడు ఐఎస్‌ఐ ముఠాలోని వాడని ధ్రువపడడం విస్తరిస్తున్న ఐఎస్‌ఐ కలాపాలకు నిదర్శనం. షంషూల్ హోడా ముఠావారు గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదానికి కారకులు.
ఐఎస్‌ఐ సూత్రధారిగానే కాక పాత్రధారిగా మారిందనడానికి హోడా పట్టుబడడం ఒక ఉదాహరణ మాత్రమే. యుపి లోని కాన్పూర్ సమీపంలో గత ఏడాది ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో దాదాపు నూట నలబయి ఐదు మంది బలైపోయారు. బిహార్‌లోని ఘోరాసహాన్ స్టేషన్‌కు సమీపంలో గత అక్టోబర్‌లో రైలును పడగొట్టడానికి విఫలయత్నం చేసిన దుండగులు హోడా ముఠావారేనట! ఇలా విఫలమైన ఇద్దరు ముష్కరులను హోడా ముఠావారు నేపాల్‌కు పట్టుకొనిపోయి కాల్చి చంపారట! ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఆగస్టులో రెండు గూడ్సురైళ్లు పట్టాలు తప్పడానికి ఈ ఐఎస్‌ఐ ముఠాల వారే కారకులన్నది ఇప్పుడు ధ్రువపడింది. గత జనవరిలో సైతం బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో రైలుపట్టాలను పగులగొట్టడానికి విఫలయత్నం చేసిన వారు కూడా ఐఎస్‌ఐ ముష్కరులే! ఐఎస్‌ఐ బీభత్స కలాపాలకు నిధులను, సైద్ధాంతిక భూమికను సమకూర్చింది సౌదీ అరేబియా. పాకిస్తానీ సమాజాన్ని సౌదీ ప్రభుత్వం, మతపెద్దలు జిహాదీ స్వభావంతో నింపడం దశాబ్దుల చరిత్ర. ఇస్లాం మతనిష్ఠను పెంపొందించడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను దశాబ్దుల తరబడి పాకిస్తాన్‌కు బహూకరించింది. కానీ, మతనిష్ఠ మాటున జిహాదీ ఉన్మాదాన్ని పెంచడం అసలు లక్ష్యం. జిహాదీ సిద్ధాంతం ఇండోనేసియా వంటి తూర్పు ఆసియా దేశాల్లోని ఇస్లాం మతస్థులకు సైతం వంటబట్టించడానికి సౌదీ ప్రయత్నించింది. కొన్ని దశాబ్దుల క్రితం వరకు మతసామరస్యాన్ని, మత సంక్లిష్టతను పాటించిన ఇండోనేసియాలో ఇటీవల జిహాదీలు పేట్రేగడానికి కారణం సౌదీ అరేబియా. ఇలా జిహాదీ తత్త్వాన్ని అంతర్జాతీయంగా పెంపొందించిన సౌదీ అరేబియా ఇప్పుడు ముప్పయి తొమ్మిది వేల పాకిస్తానీలను బహిష్కరించడం వెనుక ఆంతర్యం ఏమిటి?
‘తోడేళ్ల’తో కలసి తరిమిన సౌదీ అరేబియా ప్రభుత్వం ‘కుందేళ్ల’తో కలసి పారిపోతుండడం కొత్త దృశ్యం కాదు. ఇస్లాం మతరాజ్య వ్యవస్థలున్న కూటమి- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్- ఓఐసి-కి ప్రధాన కేంద్రం సౌదీ అరేబియా. ఏకమత వ్యవస్థ సహజంగానే ప్రజల్లో అన్యమత ద్వేషాన్ని రగిలిస్తుంది. ఈ అన్యమత ద్వేషం, ఇతర మతాల ఉనికిని సహించలేక పోవడం జిహాదీ బీభత్సానికి ప్రాతిపదిక. జిహాదీల బీభత్సకాండకు చరమలక్ష్యం ప్రపంచంలోని ఇస్లామేతర మతాలను నిర్మూలించడం. జిహాదీ బీభత్సకాండకు, జిహాదీలు రూపొందడానికి ప్రాతిపదిక ‘ఇస్లాం మతరాజ్యాంగ వ్యవస్థ’. సౌదీ అరేబియా కాని మరో మతరాజ్యాంగ దేశం కాని చిత్తశుద్ధితో జిహాదీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టయితే, ఈ దేశాలవారు తమ దేశాలలో ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’లను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు సౌదీ అరేబియా అంగీకరించినట్టయితే మిగిలిన ‘ఓఐసి’ దేశాలు కూడా ఒప్పుకుంటాయి. దీనికి మాత్రం సౌదీ అరేబియా అంగీకరించదు. ఎందుకంటే సౌదీ అరేబియా ప్రజల సమష్టి స్వభావం దశాబ్దులుగా జిహాదీ భూమికపై అంకురించి మహావృక్ష సమూహంగా మనుగడ సాగిస్తోంది. సౌదీ ప్రభుత్వం ఐఎస్‌ఐఎస్ ముఠాను నిరసిస్తున్నట్టు అభినయిస్తోంది. కానీ, సౌదీలోని సంపన్నులు ఐఎస్‌ఐఎస్‌కు నిధులిస్తున్నారు. ఐఎస్‌ఐఎస్ బీభత్సకాండకు ప్రస్తుతం బలి అవుతున్నది ప్రధానంగా సిరియా. ఐఎస్‌ఐఎస్‌కు, సిరియా ప్రభుత్వానికి, సిరియా నియంతృత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న తిరుగుబాటు దళాలకు మధ్య ముక్కోణపు యుద్ధం నడుస్తోంది. ఫలితంగా సిరియా నుంచి లక్షలాది మంది పారిపోతున్నారు, ఐరోపాలో శరణార్థులుగా జీవిస్తున్నారు. అలాంటి సిరియాలోని సంపన్నులు ఐఎస్‌ఐఎస్‌కు నిధులిస్తున్నారు. చెన్నైలో బయటపడిన ఐఎస్‌ఐఎస్ ముఠాకు ఇది నిదర్శనం. ఈ ముఠాలో తెలంగాణకు చెందిన ఒక బీభత్సకారుడు కూడ ఉన్నాడట.
ఏడు ఇస్లాం దేశాలకు చెందిన వారిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలోనికి రాకుండా నిషేధించాడు. ఈ నేపథ్యంలో అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా తన ‘చిత్తశుద్ధి’ని చాటుకుంది. అందువల్లనే పాకిస్తానీల బహిష్కరణ. ద్వంద్వనీతికి ఇది పరాకాష్ఠ. దశాబ్దుల తరబడి జిహాదీ బీభత్సకారులను తమ సింకియాంగ్ ప్రాంతం నుంచి ఏరివేసిన చైనా ప్రభుత్వం వారు మన దేశానికి వ్యతిరేకంగా మాత్రం జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నారు. మసూద్ అఝార్‌కు చైనా మద్దతు ఈ ద్వంద్వనీతికి ఒక ఉదాహరణ మాత్రమే.