సబ్ ఫీచర్

ఎవరికి ఎవరు గురువు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా దగ్గర చదువుకున్న విద్యార్థిని చూడగానే ఎక్కడి నుంచో ప్రేమ ఉబుకరావటమే కాదు, ఆ విద్యార్థికి 50 ఏండ్ల వయసు వచ్చినా ఆ విద్యార్థి శరీరం తాకి దగ్గరకు తీసుకుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. ‘ఇదంతా ఎందుకు?’- అని నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను. పసి పిల్లవాడు చిన్నతనంలో ఎన్నో తప్పులు చేస్తాడు. ఎన్నో తుంటరి పనులు చేస్తాడు. కానీ, అవి ఏవీ జ్ఞప్తికి రావు. ఆ విద్యార్థి శరీరం తాకగానే ఆ స్పర్శ రెండు ఆత్మల జ్ఞాన సంయోగంలా అనిపిస్తుంది. విద్యార్థి వల్ల గురువుకూ ఒక సద్గుణమబ్బింది.
ప్రతివారూ తెలిసో తెలియకో తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పులను క్షమించేతత్వం మాత్రం ఉపాధ్యయునికొస్తుంది. దానివలన ఉపాధ్యాయునికి జీవితంలో ఇతరుల్లోని మంచిని చూసే అవకాశం వస్తుంది. ఇది తరగతి గది ఉపాధ్యాయునికి ఇచ్చిన గొప్ప కానుక. నేను చిన్నప్పుడు ఎన్నో తుంటరి పనులు చేశాను కదా. ఎంత మంది క్షమిస్తే నేను 90 ఏళ్ల వాణ్ణయ్యాను. ఆ తరంలో ఉండే మహానీయులు నన్ను ప్రతి ఘడియలోనూ క్షమించి నన్ను తీర్చిదిద్దారు. దాని వల్లనే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా చిన్న తప్పును వారు గోరంతలు కొండంతలు చేయలేదు.
క్షమించిన వారు ఎంతో గొప్పవారు. అదే గురువును గౌరవ ప్రదమైన మనిషిగా రూపొందిస్తుంది. విద్యార్థి తన తప్పును ఎన్నటికీ మరిచిపోడు. గురువును చూడగానే తన చిన్నతనం, తను చేసిన పోకిరీ పనులు జ్ఞప్తికి వచ్చి గురువుకు పాదాక్రాంతుడవుతాడు. ఉపాధ్యాయునికి విద్యార్థుల తప్పులేవీ జ్ఞప్తికి ఉండవు. విద్యార్థి తరగతి గదిలో చెప్పిన చురుకైన సమాధానాలే అతనికి నిరంతరం జ్ఞప్తికొస్తాయి. అందుకే విద్యార్థి తలపై ఉపాధ్యాయుడు చేయి పెడతాడు. ఆప్యాయంగా ముద్దు పెడతాడు. ఇవాళ 90 ఏళ్ల మనిషి ఓ 50 ఏళ్ల మనిషిని ముద్దు పెట్టుకుంటే వాకింగ్‌లో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నాకు సిగ్గే అనిపించలేదు. నా వ్యక్తిత్వాన్ని కూడా ఆ విద్యార్థే రూపొందించాడు. ప్రతి శిష్యుడూ ఉపాధ్యాయునికి ఓ విధంగా గురువే. ఇద్దరూ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. ఒకరు భవిష్యత్‌కు తయారుచేస్తే, రెండోవారు వర్తమానానికి తయారుచేస్తారు. శిష్యుడి పాత్ర ఉపాధ్యాయుని నిర్మాణంలో ప్రధానమైంది. క్షమించే తత్వం మనిషిని ఉన్నతుడిగా నిలబెడుతుంది. ఇదే గురుశిష్యుల అద్భుత సంబంధం.

- చుక్కా రామయ్య