సబ్ ఫీచర్

విజయ సోఫానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ‘సక్సెస్’ సాధించిన విజేతలకు సన్మానం జరుగుతుంటే ఈ వరుసలో వివిధ వయసుగల వాళ్లు, వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్లు, వివిధ ప్రాంతాల వాళ్లు కనపడతారు. కొందరికి ‘సక్సెస్’ అంటే- పెద్ద ఉద్యోగం దొరకటం, ఆ ఉద్యోగం కూడా ఎక్కువ ఆదాయం ఉన్నదే కావాలి. కొందరికి పెద్ద వ్యాపారం చేస్తే సక్సెస్. కొందరు గొప్ప రీసెర్చి చేయగలిగితే వారిని సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అంటారు. సక్సెస్ అనేది మనిషి ఆలోచనల ధోరణిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనలు, జీవితాశయాలు తరగతి గదిలోనే అంకురిస్తాయి. ఆశయదీపాలను పిల్లల మనసుల్లో వెలిగించటం తరగతి గది లక్ష్యాలలో ఒకటి. ఆశయాలు ఉపాధ్యాయుని దృక్పథంపై ఆధారపడి ఉంటాయి. అవి సఫలీకృతం అవ్వటానికి పరిస్థితులు కలిసిరావాలి. పరిస్థితులంటే గ్రహచారం కాదు, అనుకూలమైన మనుషుల సాంగత్యం. ఇంటి ఆర్థిక పరిస్థితి బాధ్యతలపైన ఆధారపడి ఉంటుంది. అన్ని ఆశయాలు సాధించబడవు. సాధించిన విజయాలకు, ఆశించిన లక్ష్యాలకు ఉన్న నిష్పత్తినే సక్సెస్ అంటారు. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టూ సాధించిన విజయాలు లేదా ఏర్పరుచుకున్న లక్ష్యాలు. అది ఎప్పుడైనా ఒకటికన్నా తక్కువగానే ఉంటుంది. జీరోకన్నా ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఇండెక్స్ ఉంటుంది.
అది జీరో టూ వన్ మధ్యనే ఉంటుంది. తరగతి గది ఎన్నో ఆశయాలను కలిగించాలంటే ఆ విద్యార్థికున్న ఆలోచనలను బట్టి ఉంటుంది. ఆ విద్యార్థి చదువుకున్న కాలం, ఆర్థిక స్థితి, ఇతరులతో సాంగత్యం అన్నీ కలిస్తే ఆ విద్యార్థి ‘కల్చర్’ను నిర్ణయిస్తుంది. ఆ కల్చరే ఆ విద్యార్థికి మార్గదర్శకమవుతుంది.
‘కల్చర్’ ఎలా ఏర్పడుతుంది? అది భవిష్యత్ ప్రణాళికలకు, ఆలోచనా విధానానికి, విలువలతో కూడిన జీవనశైలికి సంబంధించినది. సరైన వ్యక్తిత్వానికి అది ఎంతవరకూ దోహదం చేస్తుంది? ఈ సందర్భంగా మనం ఓ వాస్తవాన్ని గమనించాలి. జపాన్‌లో అన్ని దేశాల కన్నా 18వ శతాబ్దంలోనే అక్షరాస్యత వచ్చింది. సింగపూర్‌లో అక్కడి ప్రతివ్యక్తి తన జీతంలో అరవై శాతం మాత్రం ఖర్చుచేసి, మిగతా 40 శాతం పొదుపుచేస్తాడు. దక్షిణ కొరియాలో నవీన ఆవిష్కరణలు విద్యలో భాగమైపోయాయి. అమెరికా చాలాకాలంగా వలసవాదులకు నిలయమైంది. ఇతరులతో ఏ విధంగా మెలగాలి? సహనం ఎలా ఉండాలో మనం అమెరికా నుంచి నేర్చుకోవాలి. అందుకే ఉపాధ్యాయుడిని ‘కల్చరల్ ఎంబాసిడర్’ అంటారు. కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, ఇతరులపై చాడీలు చెప్పటం కొందరికి జీవితంలో భాగవౌతుంది. ఇలాంటి లక్షణాలకు చోటివ్వకుండా విలువలు గల జీవితాన్ని రూపుదిద్దటమే విద్య లక్షణం. పరీక్షలో ఒకసారి ఫెయిల్ అయినా, రెండోసారి ఫస్ట్‌క్లాస్‌లో పాసైనవారున్నారు. జ్ఞానంలో కొరత ఉంటే నేర్పించుకోవచ్చు. కానీ మనిషి కల్చర్ తప్పితే ఆ జీవితమే కుంటుపడుతుంది. ఒక మనిషి వ్యక్తిత్వమైనా, జాతి ప్రగతి అయినా, గ్లోబల్ రాజకీయమైనా కల్చర్ మీదే ఆధారపడి ఉంటాయి. కల్చర్ ఎదుగుదల, వికాసం అన్నవి మనిషి ఆలోచన మీదే ఆధారపడి ఉంటాయి. సామూహిక ఆలోచనే కల్చర్‌గా ఏర్పడుతుంది. క్లాస్‌రూం లక్ష్యం ఆలోచనలను బలంగా నిర్మించడం. తరగతి గది ఆలోచనలు బహిర్గతం చేసి, సరైన కల్చర్‌ను నిర్మాణం చేస్తుంది.

- చుక్కా రామయ్య