సంపాదకీయం

‘స్వచ్ఛంద’ వైపరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని ‘ప్రభుత్వేతర సంస్థలు’-నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్-ఎన్‌జిఓలు-లో అధిక శాతం విదేశాల నుంచి నిధులను స్వీకరిస్తున్నాయి. ఈ విదేశీయ నిధులను సేవా కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజల సంక్షేమం కోసం, ప్రగతి కోసం విదేశీ నిధులను ఖర్చు చేస్తున్నాయట ‘ఎన్‌జిఓ’లు.. కానీ ఈ స్వ చ్ఛందం ముసుగులో అనేక ‘ఎన్‌జిఓ’లు అక్రమ కలాపాలకు పాల్పడుతున్నాయన్నది దశాబ్దులుగా ధ్రువపడిన వాస్తవం! ప్రత్యేకంగా వివిధ సంస్థల నేరాలు న్యాయస్థానాలలో ధ్రువపడడానికి తగిన సాక్ష్యాధారాలను సేకరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అందువల్ల అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలను అదుపు చేయడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. ఈ ఎన్‌జిఓలలో కొన్ని దేశ విద్రోహకర కలాపాలకు ప్రచ్ఛన్నంగా, ప్రత్యక్షంగా పాల్పడుతున్నాయి. మరికొన్ని సంస్థలు మన దేశానికి, మిత్రదేశాలకు మధ్య విద్వేషం రగిలించడానికి దోహద పడుతున్నాయి. అనేక సంస్థలు మతం మార్పిడి ముఠాలుగా మారి ఈ దేశంలోని అనాది మతాల వారిని విదేశాల నుంచి వ్యాపించిన మతాలలోకి మార్చుతున్నాయి. ఇలాంటి కలాపాలన్నింటికీ విదేశాల నుంచి వచ్చి పడుతున్న వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగమవుతున్నాయి. ‘గ్రీన్‌పీస్’ అన్న ‘ఎన్‌జిఓ’ దేశ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతోందన్న అభియోగంపై ఆ సంస్థకు చెందిన విదేశీయ నిధుల ఖాతాలను 2014 జూన్‌లో ప్రభుత్వం స్తంభింపచేసింది! కానీ నిధుల స్తంభనను 2015 జనవరిలో ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. అభియోగాలను ప్ర భుత్వం వారు న్యాయస్థానంలో ధ్రువపరచడంలో విఫలమవుతుండడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ‘గ్రీన్‌పీస్’ ప్రతినిధి ప్రియాపిళ్లయ్ విదేశాలలో పర్యటించడంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను కూడ హైకోర్టు తొలగించింది. ‘గ్రీన్‌పీస్’ దేశవ్యతిరేక కలాపాలకు పాల్పడినట్టు చివరకి ధ్రువపడిందా? లేదా? అన్నది ప్రధానం కాదు. ఎందుకంటే ‘గ్రీన్‌పీస్’ ఉదంతం ప్రతీక మాత్రమే, దేశవ్యాప్తంగా పుట్టలు పగిలిన ఉన్న లక్షలాది ‘ఎన్‌జిఓ’లలో ఎన్ని సక్రమంగా పని చేయడం లేదన్నది అసలు సమస్య...
కేరళలోని మూడు ‘ఎవాంజిలిస్ట్’ ఎన్‌జిఓలు 2015-2016 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల విదేశీయ నిధులను స్వీకరించాయట! ఇందులో ‘అయనా చారిటబుల్ ట్రస్టు’ అన్న సంస్థ విదేశాల నుంచి నేరుగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లను స్వీకరించిందట! ఇది కేరళలో ప్రధానంగా పనిచేస్తున్న పేరు మార్చుకున్న సంస్థ! ఈ సంస్థ గతంలో ‘గోస్పెల్ ఫర్ ఆసియా’- ఆసియాకు దివ్య సందేశం- అన్న పేరుతో పనిచేసింది. కెనడాలో ఈ సంస్థ ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు దాఖలయిన తరువాత పేరు మార్చుకుని ‘అయన’గా అవతరించిందట! విదేశీయ నిధులను దేశంలోకెల్లా ఎక్కువ మొత్తంలో స్వీకరించిన సంస్థ ఇదేనట! ఈ సొమ్మును ఈ సంస్థ ఎలా ఖర్చు చేసిందన్న వివరాలు లేవు. 2014-2015వ ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల నిధులు పొందిన ‘బిలీవర్స్ చర్చ్’ అన్న మరో సంస్థ 2015-2016లో మూడు వందల నలబయి రెండు కోట్ల రూపాయల విదేశీయ నిధులను వసూలు చేయడం విచిత్రం. ఇదికాక ఈ సంస్థ వారికి దేశంలోని ‘ఎన్‌జిఓ’ల నుంచి మరో ఐదు వందల కోట్ల రూపాయలు లభించాయట! ఇలా విరాళమిచ్చిన సంస్థలకు ఈ నిధులు విదేశాల నుంచి లభించాయట! ‘విదేశీయ ద్రవ్య నియంత్రణ చట్టం’-్ఫరిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్- ఎఫ్‌సిఆర్‌సి-ను పరోక్షంగా ఉల్లంఘించడానికి ఇదొక వ్యూహం! ఒక సంస్థ విదేశాల నుంచి నిధులను స్వీకరించడం, దేశంలోని ఇతర సంస్థలకు ఆ నిధులను విరాళం ఇవ్వడం-ఈ వ్యూహంలో భాగం! గత రెండున్నర సంవత్సరాలుగా ఈ ‘విదేశీయ నిధుల’ను మన ప్రభుత్వం నియంత్రిస్తోంది, క్రమబద్ధీకరిస్తోంది. అయినప్పటికీ విదేశీయ నిధులు వస్తూనే ఉన్నాయి. మన దేశంపై ఈ నిధులిస్తున్న విదేశీయులకు ఎందుకింత ప్రేమ..?
ఇతర మతస్థులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికై కృషి చేసే వారిని ఆంగ్లంలో ‘ఎవాంజలిస్ట్’లు అని అంటారు. ‘ఆక్స్‌ఫర్డ్’ ఇంగ్లీషు నిఘంటువు వంటి ప్రామాణిక గ్రంథాలు ఈ అర్థాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మన దేశంలో ‘ఎవాంజిలిస్ట్’ సంస్థల స్వభావం, లక్ష్యం కూడా మతం మార్పిడి మాత్రమే! కానీ ‘ఎవాంజలిస్ట్’ సంస్థలు గొప్ప సమాజ సేవ చేస్తున్నాయన్నది జరుగుతున్న ప్రచారం. ఈ సేవను పొందినవారు, ఈ సేవా నిరతికి ముగ్ధులైపోతున్నవారు ఇతర మతాలనుంచి క్రైస్తవంలోకి మారడం శతాబ్దుల చరిత్ర! అలా మారడం వల్లనే ఒకప్పుడు ‘సున్నశాతం’ ఉండిన క్రైస్తవుల సంఖ్య మన దేశంలో గణనీయంగా పెరిగింది. క్రీస్తుశకం 1947లో బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశం నుండి నిష్క్రమించే నాటికి నాగాలాండ్, మిజోరమ్ వంటి ఈశాన్యప్రాంతాలలోని జనాభాలో దాదాపు తొం బయి శాతం క్రైస్తవులుగా మారారు. ఆ తరువాత ఈ ప్రాంతాలలోను, మేఘాలయ వం టి ప్రాంతాలలోను క్రైస్తవుల శాతం ఇంకా పెరగడం ‘మతం మా ర్పిడి’-ఎవాంజలిజమ్-్ఫలితం! మన దేశం అనాదిగా అనేక మతాల నిలయం! అన్ని మతాలను సమాన దృష్టితో చూడడం, అన్ని మతాల పట్ల సమభావం ప్రకటించడం, అన్ని మతాలు సమానంగా సమాంతరంగా పరిఢవిల్లడానికి అవకాశం కల్పించడం, వైవిధ్య మతాల లక్ష్యం ఒక్కటేనని భావించడం అనాదిగా మన జాతీయ స్వభావం! ఈ సర్వమత సమభావం విదేశాలలోని కొన్ని మతాలు పుట్టక ముందు, అవి మన దేశంలోకి వ్యాపించకముందు లక్షల ఏళ్లుగా, యుగయుగాలుగా మన దేశపు జాతీయ స్వభావం! ఈ జాతీయత పేరు భారతీయత లేదా హిందుత్వం! విదేశాల నుంచి క్రైస్తవం, ఇస్లాం వ్యాపించిన తరువాత ఈ సర్వమత సమభావ జాతీయ స్వభావం మారలేదు! ఈ స్వభావానికి సరికొత్త ధ్రువీకరణ 1950 నుండీ అమలు జరుగుతున్న మన రాజ్యాంగం..
ఒక దేశపు రాజ్యాంగ వ్యవస్థ ఆ దేశపు జాతీయుల సమష్టి స్వభావానికి అనుగుణంగా రూపొందడం చరిత్ర! కానీ ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులైన ప్రాంతాలు దేశం నుండి విడిపోయి ‘సర్వమత సమభావం’ లేని పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. ఈశాన్యంలో క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో ఉన్న నాగాలాండ్, మిజోరమ్‌లను కూడా దేశం నుండి విడగొట్టడానికి కుట్ర జరుగుతోంది. మతం మార్పిడుల వల్ల ఏర్పడుతున్న ప్రధానమైన ప్రమాదం ఇదీ! ఉత్తరప్రదేశ్‌లో రైళ్లను పడగొట్టిన వారిని ఒక ‘ఎన్‌జిఓ’ పురికొల్పిందట..!