ఉత్తరాయణం

మళ్లీ నగదు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాతాలున్నవారికి సైతం బ్యాంకుల్లో నగదు కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో పెద్ద నోట్లకు ఎక్స్‌ఛేంజ్ ఇవ్వడం లేదు. ఖాతాదారుల అవసరాలను గుర్తించకుండా పెద్దనోట్లను అంటగడుతున్నారు. చాలా ఎటిఎంలలో రెండువేల నోట్లు వస్తున్నాయ్. వాటిని పోస్ట్ఫాసులో మార్చుకుందాం అనిపోతే అక్కడకూడా ‘నో ఛాన్స్’. తమకు నగదు తక్కువగా వస్తోందని, అందుకే ముందుగానే ఖాతాదారుల నుంచి విత్ డ్రా ఫారాలను తీసుకుంటున్నామని పోస్ట్ఫాసు సిబ్బంది చెబుతున్నారు. కిరాణా షాపులోనైనా చిల్లర అడుగుదామంటే రెండు, మూడు వందల విలువ చేసే సరకులు కొంటేనే గాని చిల్లర ఇవ్వడం లేదు. అసలు రెండువేల నోట్లు ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో అర్థం కావటం లేదు. 500, 100, 20, 10 రూపాయల నోట్లను ఎక్కువగా చెలామణిలో ఉంచాలి.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
అరకొర నిధులతో అవస్థలే..
తెలంగాణలో నూతన విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సౌకర్యాల కల్పనకు ఇచ్చే కంటింజెన్సీ నిధుల్లో భారీగా కోత విధించారు. పాఠశాలల్లో అత్యవసరాలైన రిజిస్టర్లు, తెల్ల కాగితాలు, జిరాక్స్ ఖర్చులు, సైన్స్ పరికరాలు, ఫర్నచర్ రిపేర్లు వంటి ఖర్చుల కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులందిస్తోంది. ఒక్కో పాఠశాలకు ఏడాదికి ఐదునుంచి పదివేల వరకు అందించే నిధుల్లోంచి ఈ ఏడాది దాదాపు సగం కోత కోశారు. పాఠశాల గదులకు సున్నాలు వేయించడం, నల్లబల్లలకు రంగులేయడం, మూత్రశాలల నిర్వహణ, త్రాగునీరు కల్పించడం, పారిశుద్ధ్య సామగ్రి, కరెంటు బిల్లులు తదితర ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. వీటితోపాటు గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల రోజుల్లో మిఠాయి పంపకాలు, విద్యార్థులకు బహుమతులు ఇత్యాది ఖర్చులుంటాయి. ఈ ఖర్చులకు నిధులు సరిపోవని అడిగితే దాతల నుంచి సేకరించుకొమ్మని విద్యాశాఖాధికారులు ఉచిత సలహాలిస్తున్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు నిధుల కేటాయింపులో కోత విధించడం దారుణం. పాఠశాలల అవసరాలకు సరిపడా నిధులు మంజూరు చేసేందుకు ఇకనైనా ప్రభుత్వం తగినన్ని చర్యలు చేపట్టాలి.
- జి.అశోక్, గోదూర్
‘మండలి’లో మేధావులకు చోటెక్కడ?
గవర్నర్ కోటాలో శాసనమండలికి మేధావులను, కళాకారులను నియమించే ఉత్తమ సంప్రదాయానికి స్వస్తిచెప్పడం బాధాకరం. గవర్నర్ కోటాలో సైతం రాజకీయ నేతలను నియమించడం సమంజసం కాదు. మేధావులు, రచయితలు సాధారణ ఎన్నికల్లో పోటీచేసినా గెలవలేరు. వారికి ఏ పార్టీకూడా టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి లేదు. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసే మేధావులకు విధాన పరిషత్‌లో గవర్నర్ కోటాలో నియిమిస్తే ఆ ప్రభుత్వాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి కవులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ప్రఖ్యాత కవి డా.సి. నారాయణ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఈ సంప్రదాయాలను గౌరవించి మేధావులను ‘పెద్దల సభ’లో నియమించాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
చాత్తాద శ్రీవైష్ణవ సంక్షేమం ఏది?
చాత్తాద శ్రీవైష్ణవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి బహుశా ఎనిమిది లక్షలు పైగా వుండొచ్చని అంచనా. వీరు ‘తెంగలై’ శ్రీవైష్ణవశాఖ నుండి జుట్టు, జందెము వదలివేసి, వైష్ణవ మత ప్రచార నిమిత్తం ద్రవిడ దేశం (తమిళనాడు) నుండి వలస వచ్చి తెలుగు నేలపై స్థిరపడినారని, వారు మొదట ద్రావిడులైన తెలుగు జాతిలో మమేకం ఐపోయారనిపిస్తోంది. వీరిలో ఆయుర్వేద, మూలిక వైద్యం, బడిపంతులు, పురోహితం చేసేవారుగా నాడు పల్లెటూర్లలో కనిపించేవారు. కాని నగర నాగరిక జీవనంలో వీరి బతుకులు కూడా చాలావరకు దెబ్బతిన్నాయి. వీరిలో 90% మంది నిరుపేదలుగానే వున్నారు. కాబట్టి వారి ఆర్థిక ఉపాధి, రాజకీయ ఎదుగుదలకు ప్రభుత్వం కృషిచేయవలసి వుంది.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్