సబ్ ఫీచర్

హైందవం..సనాతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సృష్టిపుట్టకముందే రాముడు పుట్టిండు,’’ అధునాతన పరిశోధకులు తేల్చిన మాట రోజు, వారం, నెల, సంవత్సరం, దశాబ్దం, సహస్రాబ్దం అనేవి కాలం యొక్క పరిధులను తెలియజేసేవి. వీటి మాదిరిగానే యుగము, మహాయుగము కల్పము, మన్వంతరము. కృతయుగం- 17,28,000 సంవత్సనాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాల వయస్సులు కలిగి ఉన్నాయి. ఈ నాలుగు యుగాలను కలిపి ‘మహాయుగం’ అంటారు. దీని వయస్సు 43,20,000 సంవత్సరాలు. వెయ్యి మహాయుగాలను కలిపి ‘కల్పము’ అంటారు. కల్పము వయస్సు 432,00,00,000 సంవత్సరాలు. ‘కల్పాన్ని’ పదునాలుగు మన్వంతరాలుగా విభజించినారు. రోజును పగలు, రాత్రిగా ఎట్లు పరిగణిస్తున్నామో సృష్టికి కూడా ఉదయకల్పం పగలు వంటిది. క్షయకల్పం రాత్రి వంటిది. నెలలకు చైత్రం నుండి ఫాల్గుణం వరకు పనె్నండు నెలలకు ఏ విధంగా పేర్లున్నాయో పధ్నాలుగు మన్వంతరాలకు, ముప్పయి కల్పాలకు కూడా పేర్లున్నాయి. శే్వతవరాహ కల్పము, నీలలోహిత, వాసుదేవ, రథంతర, రౌరవ, దేవ, బృహత్, గంధర్వ, సత్య, ఈశాన, తమఃసారస్వత, ఉదాన, గారుడ, పేర్లమాసి, నారసింహ, సమాన, ఆగ్నేయ, సోమ, మానవ, తత్పురుష, వైకుంఠ, ‘లక్ష్మీ సావిత్రి, ఘోర, వైరాజవరాహ, గౌరీ, మహేశ్వర, పితృకల్పము. ప్రస్తుతం కొనసాగుతున్న కల్పం ‘శే్వతవరాహ కల్పము’. ఇం దులో ఏడవ మన్వంతరము నడుస్తున్నది. దీని పేరు ‘వైవస్వతము’ ఇందులో ఇప్పటివరకు ఇరవై ఏడు మహాయుగాలు పూర్తయ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములు పూర్తికాబడి కలియుగంలో ఐదువేల ఒక వంద పదిహేడవ సంవత్సరము కొనసాగుతున్నది.
ఇరువై నాలుగవ మహాయుగంలోని త్రేతాయుగం కాలము నాటి వాడు ‘రాముడు’. రఘురాముడు- దశరథరాముడు- కౌసల్య రాముడు- సీతారాముడు- కోదండరాముడు- మర్యాద పురుషోత్తముడు అని వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలను అధ్యయనం చేసిన భారతీయ ఇతిహాసకులు, చరిత్రకారులు చెప్పుతున్న వాస్తవాలు. వీరందరు వేదాలను అనుసరిస్తూ, వైదిక మతాలలోని బహుదేవతారాధన చేస్తూ, పునఃర్జన్మను నమ్ముతూ ‘కృణ్వంతో విశ్వమార్యమ్’ సంపూర్ణ విశ్వాన్ని శ్రేష్ఠంగా తీర్చిదిద్దుతాం!’’ ‘‘వసుదైవ కుటుంబకమ్’’ సంపూర్ణ భూమండలమే ఒక కుటుంబమ్!’’ ‘‘స్వదేశోభవనత్రయమ్’’ ముల్లోకాలు మనకు స్వదేశాలే! అనే ఉదాత్త భావాలు గలవారు.
ఏది ఏమైనప్పటికి హిందువులు తమ కుటుంబాలతో జరుపుకొనే శుభకార్యాల సమయంలో తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకోవడం అనాదిగా కొనసాగుతున్న తంతు. పూజ ప్రారంభించేముందు తీసుకొనే సంకల్పంలో ఆదిబ్రహ్మణః ద్వితీయపరార్థే శే్వతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ వారికి సమీపంలోని పుణ్యక్షేత్రాలను పుణ్యనదులను పూజా కార్యక్రమము సమయంలోని తిథి నక్షత్రాలతోపాటు వారి గోత్రనామాలను స్మరించుకుంటూ పూజాధిక్యాలను నిర్వహించుకొనుట అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయం. దీని ద్వారా ‘సృష్టి’ ఏర్పడ్డప్పటి నుండి హిందూ సమాజం అనాదిగా తరతరాలవారు నిరంతరం ‘సృష్టి’ ఏర్పాటు కాలాన్ని స్మరించడం అంటే సృష్టికాలాన్ని పరిశోధించి చెప్పవలసిన అవసరం లేకుండానే ముందుతరంవారు వారి తరువాత తరానికి అందించడమే. అందుకే దీనిని అనుసరించేవారిని సనాతన ధర్మావలంబులు అంటారు. ‘సనాతనము’ అంటే శాశ్వతము అని గుర్తించాలి. క్రీస్తుకు పూర్వం నాలుగువేల నాలుగవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక రోజున ఉదయం తొమ్మిది గంటలకు సృష్టి జరిగినట్లు అది కూడా ఆరు రోజుల వ్యవధిలోనే జరిగినట్లు బైబిల్ వాక్యం. అంటే సృష్టి జరుగకముందే ఫిబ్రవరి నెల, రోజు, ఉదయం, తొమ్మిది గంటలు సృష్టికి ముందే ఉన్నట్లే కదా! ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్’లోని పరిశోధకులు ‘రాముడి’ జన్మదినం క్రీస్తుపూర్వం 5114 జనవరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలని చెప్పడం ఒక వింతైన పరిశోధన. ఇదెలా సాధ్యం?

- బలుసా జగతయ్య