సంపాదకీయం

దౌత్య దౌర్జన్యానికి మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర టిబెట్ చివరి అధినేత, ధర్మాచార్యుడు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించ డం పట్ల చైనా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యకరం కాదు. క్రీస్తుశకం 1950వ దశకంలో మన ఉత్తర సరిహద్దుల్లోని స్వతంత్ర దేశమైన ‘టిబెట్’ను ఎలాంటి శ్రమలేకుండా కాజేసిన చైనా, మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా ఆక్రమించడానికి శ్రమిస్తోంది. దశాబ్దుల ఈ చైనా దుస్తంత్రం, దురాక్రమణ స్వభావం దలైలామా పర్యటన పట్ల వ్యక్తమైన రుసరుసలు బుసబుసలకు నేపథ్యం! చైనా అభ్యంతరాలను మన ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడ ఆశ్చర్యకరం కాదు. దశాబ్దుల తరబడి చైనా అభ్యంతరాలను మన ప్రభుత్వం నిరాకరిస్తూనే ఉంది కాబట్టి.. కానీ మన అరుణాచల్‌లోకి ఎవ్వరు వెళ్లాలి? ఎవ్వరు వెళ్లకూడదు? అన్న మీమాంసను చైనా కొనసాగిస్తూనే ఉంది. ఇది మన అంతర్గత వ్యవహారాల్లో చైనా నియంతల అక్రమ ప్రమేయం కొనసాగుతుందనడానికి నిదర్శనం. బుధవారం దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లడం, చైనా మళ్లీ ‘చిందులు తొ క్కడం’ ప్రముఖంగా ప్రచారమైన పరిణామాలు! దలైలామా అరుణాచల్‌ను సందర్శించడానికి అనుమతి ఇవ్వరాదని గత కొన్ని వారాలుగా చైనా హెచ్చరిస్తూనే ఉంది. మన ప్రభుత్వం ఈ హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం మన ‘స్వతంత్ర విధాన పటిమ’కు, చైనాకు భయపడని తనానికి నిదర్శనం.. జరుగుతున్న ప్రచారం ఇది. కానీ, ఈ ‘విధాన పటిమ’లో దశాబ్దుల మన విధాన లోపం కూడా నిహితమై ఉంది. ఈ విధాన లో పం దలైలామా అరుణాచల్‌లో బుధవారం పర్యటించిన సందర్భం గా మరోసారి ప్రస్ఫుటించింది! ఈ లోపం 1947వ- 1962వ సంవత్సరాల మధ్య అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధాన వారసత్వం. చైనా క మ్యూనిస్టు నియంతల పట్ల నెహ్రూకు ఏర్పడి ఉండిన అవ్యాజ అనురాగం ఈ లోపానికి ప్రాతిపదిక. ‘స్వతంత్ర టిబెట్’ మనుగడను సమర్ధించక పోవడం ఈ లోపం, టిబెట్‌ను చైనా దురాక్రమించడాన్ని సమర్థించడం ఈ లోపం, టిబెట్‌కు మన దేశంలో ఉన్న తరతరాల భౌగోళిక, ఆర్థిక, వ్యూహాత్మక, సాంస్కృతిక బంధాన్ని విస్మరించడం ఈ లోపం. టిబెట్‌ను చైనాకు కట్టబెట్టడం ద్వారా చైనాను మన ఉత్తర సరిహద్దులకు ‘తీసుకొని రావడం’ ఈ లోపం. ఈ లోపాలన్నీ నెహ్రూ ప్రభుత్వం పాల్పడిన చారిత్రక మహాపరాధాలు! ఈ వారసత్వాన్ని తరువాతి ప్రభుత్వాలు వదిలించుకొనకపోవడం జాతీయ వైపరీత్యం. చైనా దుందుడుకు తనం, దౌత్య దౌర్జన్యం నిరంతరం విస్తరించిపోవడానికి ఇదీ కారణం!
టిబెట్ విషయంలో మన ప్రభుత్వం 1950వ దశకంలోనే చైనాను నిరోధించి ఉండినట్టయితే అరుణాచల్ గురించి చైనా ప్రస్తావించడానికి అవకాశం ఉండేది కాదు. ఇది వౌలికమైన లోపం. బుధవారం దలైలామాకు అరుణాచల్‌లోని బోమిడిలా బౌద్ధ విహారంలో ఘన స్వాగతం లభించిన సమయంలో ఈ వౌలిక లోపం పునరావృత్తమైంది. దలైలామా పర్యటన కేవలం బౌద్ధమత నిష్ఠకు సంబంధించినదని మన ప్రభుత్వం చైనాకు ‘వివరణ’ ఇచ్చుకుంది. ఇలా ‘ఇచ్చుకోవడం’ చైనా వారి టిబెట్ దురాక్రమణను ఆమోదించడంలో భాగం. దలైలామా పర్యటన మతనిష్ఠకు సంబంధించినదా? వినోద విహారమా? వాణిజ్య వ్యవహారమా? రాజకీయమైనదా? అన్నప్రశ్నలు దలైలామాకు, మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. చైనాకు చెప్పవలసిన అవసరం ఏమిటి? మన ఈ మెతకదనం వల్లనే చైనా ప్రభుత్వం బీజింగ్‌లోని మన రాయబారి విజయగోఖలేను తమ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయానికి పిలిపించ గలిగింది. అరుణాచల్ గురించి ‘అవాకులను చెవాకుల’ను ఆవిష్కరించ గలిగింది. ఈ చైనా దౌత్య దౌర్జన్యానికి దీటుగా మన ప్రభుత్వం కొత్త్ఢిల్లీలోని చైనీయ దౌత్య కార్యాలయం వారిని పిలిపించి మందలించింది ఉండాలి. మన ప్రభుత్వానికి అలా తోచినట్టు లేదు! దలైలామా విధానంలోను వ్యవహారంలోను కూడ విచిత్రమైన వైపరీత్యాలు కొనసాగుతున్నాయి. చైనా నియంతలు పేట్రేగిపోవడానికి ఇది మరో కారణం. టిబెట్‌కు స్వాతంత్య్రం అక్కరలేదని దలైలామా దశాబ్దికి పైగా ప్రచారం చేస్తుండడం టిబెట్ ప్రజలకు నచ్చని విషయం..
దాదాపు రెండువేల ఐదువందల ఏళ్లుగా టిబెట్ స్వతంత్ర దేశం. అంతకుపూర్వం టిబెట్ భారతదేశంలో భాగం. టిబెట్‌ను దురాక్రమించడానికి చైనా పాలకులు దాదాపు పదిహేను వందల ఏళ్లపాటు చేసిన ప్రయత్నాలను టిబెట్ తిప్పికొట్టడం చరిత్ర. టిబెట్ భాషతోకాని మతాలతో కాని సంస్కృతితో కాని జీవన పద్ధతులతో కాని చైనాకు ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ భారతీయమైనవి. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది చివరి వరకూ అరుణాచల్ తదితర ఈశాన్య ప్రాంతాల వనవాసీ ప్రజలు బ్రిటన్ దురాక్రమణను ప్రతిఘటించగలిగారు. ఆ తర్వాత మన ఈశాన్య ప్రాంతాలు బ్రిటన్ దు రాక్రమణకు గురి అ య్యాయి. 1903లో యంగ్ హసబండ అనే బ్రిటన్ అధికారి కొంత సైన్యంతో టిబెట్‌లోకి చొరబడి రాజధాని ‘లాసా’కు చే రాడు. అప్పటి నుంచి టిబెట్‌కు బ్రిటన్ సా మ్రాజ్యవాదుల ప్రమాద భయం పట్టుకొంది. బ్రిటన్ నుంచి రక్షించుకొనడానికై టిబెట్ అప్పటి అధినేత దలైలామా చరిత్రలో తొలిసారిగా చైనాతో చెలిమి చేశాడు. 1903వ 1914వ సంవత్సరాల మధ్య బ్రిటన్- బ్రిటన్ ఆక్రమిత భారత్‌తోను, చైనాతోను సమాన దూరం పాటించడం ద్వారా టిబెట్ తన స్వాతంత్య్రాన్ని రక్షించుకొంది. 1914లో కుదిరిన ఒప్పందం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమన్న అనాది వాస్తవాన్ని ‘స్వతంత్ర టిబెట్’ అంగీకరించింది. అందువల్ల టిబెట్ స్వతంత్ర దేశంగానే కొనసాగి ఉండినట్టయితే చైనా అరుణాచల్ తనదని వాదించడానికి ఆస్కారం లేదు, భౌగోళిక సదుపాయం లేదు!
ఈ భౌగోళిక సదుపాయాన్ని 1950 దశకంలో మన ప్రభుత్వమే చైనాకు కల్పించింది. 1959లో చైనా దళాలు టిబెట్‌ను పూర్తిగా దురాక్రమించాయి. అప్పుడు ఇరవై రెండు ఏళ్ల యువకుడైన ప్రస్తుత దలైలామా దాదాపు తొంబయి వేలమంది టిబెట్ పౌరులతో కలసి చైనా దళాలకు దొరకకుండా తప్పించుకొని మన దేశానికి వచ్చాడు. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వం ఏర్పడి ఉంది. స్వతంత్ర టిబెట్‌ను తిరిగి సాధించడం ఈ ప్రవాస ప్రభుత్వ లక్ష్యం! కానీ దలైలామా 2005లో ‘స్వతంత్ర టిబెట్’ సాధనకు స్వస్తి చెప్పాడు. చైనాలో అంతర్భాగంగా టిబెట్ ఉండాలని కోరుతున్నాడు. వ్రతం చెడిన దలైలామాకు ఫలితం దక్కలేదన్న వాస్తవానికి చైనా దౌర్జన్య దౌత్యం కొనసాగుతున్న నిదర్శనం..