ఉత్తరాయణం

రోగుల్లో నమ్మకం పెంచాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరికీ జనరిక్ మందులను తక్కువ ధరలో అందించాలనే ఆలోచన అభినందనీయం. ఈ జెనెరిక్ మందుల వ్యాపారం అభివృద్ధి చేసే ప్రయత్నంలో బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీల ఆగ్రహవేశాలను ప్రభుత్వం మూటకట్టుకోవలసి వచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. కేవలం జెనెరిక్ మందులకే బ్రాండ్ అంబాసిడర్‌లాగ ప్రభుత్వం పనిచేస్తే మిగతా మందుల కంపెనీలు అమ్మకాల పరిస్థితి ఏమిటి? దేశంలో వివిధ మందుల కంపెనీల్లో లక్షలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాటి వ్యాపారం దెబ్బతింటే పరోక్షంగా ఉద్యోగులు కూడా నష్టపోతారు. మరీ అంతగా పేదలకు సహాయపడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అన్ని కంపెనీల వారిని రోగులకు అత్యవసరమైన మందులను తక్కువ ధరకు అమ్మే ఏర్పాటుచేయాలి. జెనెరిక్ మందులను వాడాలని డాక్టర్లు చెప్పడం కాదు. అనవసర పరీక్షలు చేసి పేషెంట్లను దోచుకోవద్దని వైద్యులను ప్రభుత్వం హెచ్చరించాలి. జ్వరంతో వెళ్లినవాడికి ఇసిజి, ఎక్స్‌రే, యూరిన్ టెస్ట్, బ్లడ్‌టెస్ట్, స్పూటమ్ టెస్ట్ వగైరా చేయించే వైద్య మహాశయులెందరో ఉన్నారు. జెనెరిక్ దుకాణాలు పరిమితమైన ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచడంతోపాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ప్రభుత్వ వైద్యాలయాలలో సిబ్బంది నిస్వార్థంగా సేవ చేస్తే ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు.
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు
‘రెండాకులు’ విలవిల!
అసలే ‘అమ్మ’ పేరు లేదు. పిన్నమ్మ వర్గం, పన్నీరు వర్గం మధ్య పొసగడం లేదు. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు- అన్నా డిఎంకె పార్టీ గుర్తు ‘రెండాకుల్ని’ ఎన్నికల సంఘం తెంపుకుపోయి గూట్లో పెట్టింది. ఆ ‘రెండాకుల్ని’ సంపాదించగలిగితే చాలు.. ‘అమ్మ’ జయలలిత పేరు చెప్పుకొని వాటి నీడన ఎదగొచ్చు అని అన్నా డిఎంకెలోని రెండు వర్గాలూ భావిస్తున్నాయి. ఈలోగా బలమైన పిన్నమ్మ వర్గం అంతే బలంతో ఉప ఎన్నికల్లో డబ్బు పంచుతూ దొరికినట్టు సాక్ష్యం దొరకడంతో ఉప ఎన్నిక వాయిదా పడింది. పిన్నమ్మ మేనల్లుడు ఎన్నికల సంఘం గోడ దూకి, దొంగతనంగా ‘రెండాకుల్ని’ తెంపుకుపోయే ప్రయత్నం చేశాడంటూ కేసు పడింది. ఇక నైతిక బలం పన్నీరు వర్గానికి వచ్చినట్టే. అయితే- విడిగా ఉంటే బలహీనవౌతాం, కలుద్దాం అంటూ ఇరు వర్గాలూ రాజీకి కూర్చోవడం మంచి పరిణామం. దీన్ని ‘చేతులు కాలక ముందే ఆకులు పట్టిన’ విజ్ఞతగా మనం అభివర్ణించవచ్చు. వీలైనంత త్వరగా వారు ‘సంధి’ పూర్తిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ‘రెండాకులు’ నిజంగానే ‘సూర్యుడి’ (డిఎంకె గుర్తు) వేడికి వాడిపోతాయి లేదా ‘హస్తిన’ గాలికి సోలిపోతాయి.
-డి.వి.జి.ఎస్. పార్వతీపురం
గోడదూకిన వారికి పదవులా?
ఏదో ఒక సాకుతో అధికార పార్టలోకి చేరి, కొంతమంది విపక్ష ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందటం ఎంతవరకు సమంజసం. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏమయ్యింది? ఏపి, తెలంగాణ నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు తప్ప అసలు విషయాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఉభయ రాష్ట్రాల స్పీకర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు. గవర్నర్ సైతం పట్టనట్లు ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఫిరాయింపుదారులకు పదవులు రాకుండా పటిష్టమైన చట్టం రూపొందాలి.
-అయినం రఘురామారావు, ఖమ్మం