ఉత్తరాయణం

బొంద పెడతారట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిజెపికి బొంద పెడతా’నని తెరాస నేత అన్నట్టు టీవీ వార్త! బొంద పెట్టడానికి అది ఒక కుటుంబపు పార్టీ కాదు. ఛత్రపతి శివాజీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ‘నా తండ్రిని, అన్నని- నీళ్లు తప్ప అన్నీ ఇచ్చి- పీకలు కోసి చంపాను. శివాజీ చనిపోయాక అతని కొడుకు శంభాజీని పట్టుకోగలిగాను కానీ శివాజీకి బొంద పెట్టలేకపోయాను. నేను అసమర్ధుడ్ని, నీచుణ్ణి’ అని ఏడుస్తూ ఔరంగజేబు కన్ను మూసాడు. ఆ శివాజీ వారసులే ఈ బిజెపి వారు. వీరికి వెన్నుదన్నుగా వున్నవారు త్యాగనిరతులు. అవివాహితులుగా ఉండిపోయి దేశం కోసం జీవితాన్ని అర్పించుకుంటున్నవారు. బిజెపిలో లోపాలుండవచ్చు. కానీ బిజెపికి వ్యతిరేకంగా మైనార్టీలకు 12 శాతం ‘కోటా’ ఇచ్చి తీరతానని చేసే శపథం అనంతకోటి లోపాలకన్నా ఎక్కువ కాదా? హిందూ దేశంలో హిందువుల్ని నిలువునా మాడ్చేయడం కాదా? జన్మ-కర్మ అన్న హిందూ సిద్ధాంతం అణువణువునా పాతాళలోకం దాకా వ్యాపించి ఉన్న సంస్కృతి ఇది. కనుక ఒకవేళ బిజెపి బొందపెట్టబడినా మళ్లీ ఏదో ఒక ‘ఏజెపి’ వచ్చి వాళ్లకి బొందపెట్టదని గ్యారంటీ ఏమిటి? ప్రభుతాంధకారం వ్యాపించి ఉన్న వాళ్లను ఎవరు కాపాడగలరు?
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
సీరియళ్లకు సెన్సార్ వద్దా?
టీవీ సీరియల్స్‌లో హింస దారుణం. సినిమాల్ని మించిపోయిన విలనిజం ఉంటోంది. కుట్రలతో సన్నివేశాలను నింపేస్తూ సమాజం నాశనం అయేలా చిత్రీకరిస్తున్నారు. సెన్సార్ బోర్డు పట్టించుకోవడం లేదంటూ ఏపి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వంటి వారు వాపోతున్నారు. టీవీ కార్యక్రమాలకు ఎలాంటి సెన్సారింగ్ లేదు. వీక్షకులు చానళ్లవారికి ఉత్తరాలు రాసినా ప్రయోజనం ఉండదు. మహిళా కమిషన్ స్పందించి టీవీ సీరియళ్ల రచయితలు, దర్శకులతో సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శనం చేయాలి. టీవీ కార్యక్రమాల బాగోగులు పర్యవేక్షించడానికి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది.
-ప్రభాస్, కాకినాడ
మోక్షం లేని కోర్టు కేసులు
విదేశాల్లో కీలకమైన కోర్టు కేసులు మూడు నెలల్లో పరిష్కారం అవుతుంటే మన దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య లక్షల్లో వుంటే వాయిదాల పర్వం ధర్మమా అని కేసుల పరిష్కారానికి సగటున రెండు దశాబ్దాల కాలం పడుతోంది. ఈ కాలయాపన కారణంగా కొన్ని కీలకమైన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడి న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. విదేశాలల్లో పదిలక్షల మందికి సగటున వందమంది న్యాయమూర్తులు వుండగా ఇక్కడ పదిమంది ఉన్నారు. అక్కడ ఏడాదికి ప్రతి న్యాయమూర్తి రెండువేల కేసులు పరిష్కరిస్తుండగా ఇక్కడ ఎనభై మాత్రమే! జనాభాకు తగినట్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సి ఉండగా వున్న ఖాళీలను భర్తీ చేయడమే మహద్భాగ్యమన్న పరిస్థితులు నెలకొన్నాయి. కేసుల జాప్యం కారణంగా ఘరానా నిందితులు హాయిగా సభ్య సమాజంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ తిరుగుతుండగా, సామాన్య పౌరులకు సకాలంలో న్యాయం అందడం అసాధ్యంగా మారింది.
-ఎం.కనకదుర్గ, తెనాలి