సంపాదకీయం

‘రాళ్ల వాన’ ఫలితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీర్ లోయ ప్రాంతంలో వరదలు వెల్లువెత్తినప్పుడు అనేక మందిని సైనికులు రక్షించారు. ఇలా రక్షించిన సైనికులను నీటినుండి బయటపడిన వారు మెచ్చుకున్నారు. కానీ వారిలో కొందరు మళ్లీ సైనికులపై రాళ్లు రువ్వుతున్నారు- అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం కశ్మీర్‌లోని వాస్తవ స్థితికి అద్దం. సైనికులపై రాళ్లురువ్వుతున్నవారు దేశ వ్యతిరేకులు, జిహాదీ ఉగ్రవాదులు, జిహాదీల మద్దతుదారులు, పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తులు! తూటాలు పేల్చి, బాంబులు విసిరి హత్యాకాండకు పాల్పడుతున్న బీభత్సకారులుకంటే మన సైనికులపై రాళ్లు రువ్వుతున్న వారు భద్రతకు, సమగ్రతకు మరింత ప్రమాదకరంగా మారారు. తుపాకులు, బాంబులు ధరించి ఉన్నవారు ఎక్కడో అక్కడ పొంచి ఉండి సైనికులపై దాడులు చేస్తున్నారు. కాని ఈ రాళ్ల వాన కురిపించే ముష్కరులు ‘లోయ’ ప్రాంతంలో ప్రధానంగా జమ్ము కశ్మీర్ వసంత రాజధాని శ్రీనగర్‌లో ప్రతి చోట నిరంతరం కనిపిస్తున్నారు. ‘తుపాకీ’ల జిహాదీలను సైనికులు ఎదుర్కొని ప్రతి చర్యలకు పూనుకుంటున్నారు, వారు కాల్పులు జరపగానే సైనికులు కూడ కాల్పులు జరుపుతున్నారు. కానీ ‘రాళ్ల’ జిహాదీలు ‘పౌరుల’ ముసుగు వేసుకున్న ప్రచ్ఛన్న ఉగ్రవాదులు. ఈ ప్రచ్ఛన్న ఉగ్రవాదులు విద్యార్థులుగా చెలామణి అవుతున్నారు. ‘పిల్లలు’గా పేరు మోసి ఉన్నారు. అందువల్ల ఈ ‘విద్యార్థులు’ ‘పిల్లలు’ తమపై రాళ్లు రువ్వుతున్న సమయంలో సైనికులు ఎదురు కాల్పులు జరపడానికి వీలులేదు, లాఠీ చార్జి జరపడానికి వీలులేదు. వీలు కల్పించుకున్నట్టయితే ‘సైనిక దళాలవారు పౌరులను హత్య చేస్తున్నారహో...!’ అని లోయ ప్రాంతంలోని పాకిస్తాన్ అనుకూల దేశద్రోహులు భూన భోంతరాళాలు దద్దరిల్లిపోయేలాగ గోల చేస్తారు. ఈ గోల చేస్తున్న వారిలో ‘్భరత రాజ్యాంగ వ్యవస్థకు తాము విధేయులము కామని’ నిర్భయంగా నిర్లజ్జగా ప్రకటిస్తున్న హురియత్ ముఠాల వారున్నారు!!’ భారత రాజ్యాంగానికి తాము విధేయులమని ప్రకటించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతున్న స్థానిక రాజకీయ పక్షాలవారు కూడ ఇలా సైనిక వ్యతిరేక ఆర్భాటం చేస్తుండడమే అంతుపట్టని వింత! అందువల్ల రాళ్ల వాన కురిసినప్పుడు సైనికులు ఏం చేయాలి? గాయపడి రక్తం కారుతున్న ముఖాలతో, భుజాలతో, ఛాతీలతో, తలలతో దారి వెంట సాగిపోవాలి! రాళ్లు రువ్వుతున్న బీభత్సకారులను బీభత్సకారిణులను సైనికులు ఏమీ చేయలేకపోవడం వికృత వాస్తవం! నల్లటి ముసుగు వేసుకున్న ఒక మహిళ శ్రీనగర్‌లో భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్విన దృశ్యం ఇరవయ్యవ తేదీన మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఈ బీభత్సకారిణి ‘పాఠశాల విద్యార్థి’-స్కూల్‌గర్ల్-గా ప్రచారం పొందడం మరో వికృత వాస్తవం...
ఇలా సైనికులపై రాళ్లు రువ్వుతున్న వారిపట్ల దేశంలోని వివిధ రాష్ట్రాలలో నిరసనలు చెలరేగడం బహుశా అసంకల్పిత ప్రతీకార చర్యకు ప్రతీక! జమ్ము కశ్మీర్ కొనసాగుతున్న విద్రోహ కాండ గురించి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్స కాండ గురించి దేశంలోని ఇతర రాష్ట్రాలలో ధ్యాస లేకపోవడం దశాబ్దుల వైపరీత్యం. ఈ ధ్యాస పెరుగుతోందన్న దానికి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల సంభవిస్తున్న ఘటనలు నిదర్శనం. అయితే రాళ్లు రువ్వుతున్నవారి పట్ల గల కోపాన్ని జమ్ము కశ్మీర్ నుంచి వచ్చి ఇతర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రదర్శించడం దురదృష్టకరం. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లోని మేవాడ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కశ్మీరీ విద్యార్థులకు స్థానిక విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి. కశ్మీరీ విద్యార్థులను ‘రాళ్లు రువ్వేవారు’-స్టోన్ పెల్టర్స్-అని స్థానిక విద్యార్థులు గేలి చేశారట! దాంతో కశ్మీరీ విద్యార్థులకు స్థానిక విద్యార్థులకుమధ్య తోపులాట, కుమ్ములాటలు జరిగిపోయాయి. ‘కశ్మీరీలు ఉత్తరప్రదేశ్‌నుండి వెళ్లిపోవాలి, లేకుంటే...’ అన్న హెచ్చరికలతో కూడిన అట్టలను మీరట్ నగరంలో ప్రదర్శించారట! కశ్మీర్ ప్రజలు భారతీయులు. అందువల్ల దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా జీవించగల అధికారం కశ్మీరీలకు ఉంది! అందువల్లనే కశ్మీరీ విద్యార్థులు మన పిల్లలు.. వారికి రక్షణ కల్పించడం మన బాధ్యత‘ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పష్టం చేయడం జాతీయ సమైక్య నిష్ఠకు, ప్రాదేశిక సమగ్రతా పరిరక్షణ ధ్యాసకూ నిదర్శనం. కశ్మీరీ విద్యార్థులకు రక్షణ కల్పించవలసిందిగా దేశ వ్యవహారాల మంత్రి రాజనాథ్‌సింగ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరడం సందర్భోచితం...!
దేశంలో ఎక్కడైనా జీవించడానికి కశ్మీర్ ప్రజలకు హక్కు ఉన్నట్టుగానే కశ్మీర్‌లో సైతం స్వేచ్ఛగా జీవించడానికి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ అధికారం ఉండాలి! యుగాలనాటి సహజసిద్ధమైన ఈ అధికారానికి కశ్మీర్‌కు లభిస్తున్న ‘ప్రత్యేక ప్రతిపత్తి’ గ్రహణం వంటిది. ఇదీ అసలు సమస్య. జాతీయ సమైక్యానికి సార్వభౌమ అధికారానికి ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తున్న అంశమిది. రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయి అధికరణం ప్రసాదించిన ప్రత్యేక ప్రతిపత్తిని కశ్మీర్ రాజకీయ వేత్తలు, పాకిస్తాన్ సమర్ధక జిహాదీ ముఠాలు విపరీత వ్యాఖ్యానాలు చేయడం దశాబ్దుల చరిత్ర. దేశమంతటికీ ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం ఉన్నాయి. కశ్మీర్‌కు మాత్రం మరో రాజ్యాంగం, మరో పతాకం ఉండడం ప్రత్యేకత! ఈ ప్రత్యేకత దేశ విద్రోహకర శక్తులకు బలం చేకూర్చింది. ‘ప్రత్యేకత’తో అతిశయించిన, అహంకరించిన ముఠాలు జమ్ము కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా మార్చడానికి కుట్రను కొనసాగిస్తున్నాయి. ఈ కుట్రలో భాగం పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకాండ! సైనికులపై రాళ్లు రువ్వడం బీభత్సకాండలో భాగం. అందువల్లనే రాళ్లు రువ్వుతున్నవారు బీభత్సకారులని, దేశద్రోహులని, పాకిస్తాన్ ప్రభుత్వ దళారీలని రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ అభివర్ణించాడు!
రాళ్లు రువ్వుతున్న వారిని ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ వారు వెనకేసుకొస్తున్నారు! అధికారంలో లేనప్పుడు మెహబూబా ముఫ్తి నాయకత్వంలోని ‘పీపుల్స్ డెమోక్రాటిక్’ పార్టీ-పిడిపి-కూడ రాళ్లు రువ్వుతుండిన ‘పిల్లల’ను సమర్థించడం చరిత్ర! రాజస్థాన్‌లోను ఇతర చోట్ల విద్యనభ్యసిస్తున్న వారు సైనికులపై రాళ్లు రువ్వి ఉండకపోవచ్చు! కానీ రాళ్లు రువ్వుతున్న దేశద్రోహులను ఈ విద్యార్థులు నిరసించిన జాడ లేదు. పైగా స్థానికుల మనోభావాలను గాయపరిచే విధంగా ఈ కశ్మీరీ విద్యార్థులు మేవాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే ఆవుమాంసం ఆరగించారట! గత ఏడాది ఇది ఘర్షణలకు దారి తీసింది! 2012లో మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాళ్లు రువ్విన’ నేరస్థులందరినీ కశ్మీర్ జైళ్లనుంచి విడుదల చేయించింది. అందువల్ల వారు మళ్లీ మళ్లీ రాళ్లు వేస్తున్నారు.
*