ఉత్తరాయణం

ఉద్యమంగా జల సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం బాగానే ఉంటుందని వాతావరణ శాఖ భావిస్తోంది. అన్ని దక్షిణాది రాష్ట్రాలు మూడేళ్లుగా వర్షాభావంతో ఇక్కట్లు పడుతున్నాయి. కరువు తాండవిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో మంచి వర్షపాతం ఉండబోతుందన్న వార్త తీపి కబురే. నదీ జలాల్ని సక్రమంగా వాడుకొనే దీర్ఘకాలిక ప్రణాళికలతోపాటు ప్రస్తుతం ఉన్న నీటిని, రాబోయే వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలు ఇప్పుడే ఊపందుకోవాలి. దేశంలో తలసరి నీటి లభ్యత ఐదు దశాబ్దాల క్రితం ఐదువేల క్యూబిక్ మీటర్లుండగా, నేడది పదిహేను వందల క్యూబిక్ మీటర్లు. పదిహేడు వందల క్యూబిక్ మీటర్లకన్నా తక్కువ ఉన్నపుడు ఆ ప్రాంతాన్ని నీటి ఎద్దడి ప్రాంతంగా గుర్తిస్తారు. ఆ రకంగా మన దేశం నీటి ఎద్దడితో ఉన్నట్టే. ఏటికాయేడు త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తూ వస్తుంది. నేలజారిన బొట్టు బొట్టూ భూమిలోకి ఇంకేలా, నీటి దుర్వినియోగాన్ని అదుపు చేసేలా ప్రజా ఉద్యమం రావాలి. అందుకు ప్రభుత్వంతోపాటు పౌర సమాజం, ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
వీళ్లు భారతీయులేనా?
‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లే భారతీయులా? మిగిలినవారు కాదా?’ అని అక్కసు వెళ్లగక్కాడు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం. ఈ చిదంబరమే గతంలో ఒకసారి ‘్భరతీయులకు జ్ఞానభిక్ష పెట్టింది ఇంగ్లీష్ కానె్వంట్‌లే’ అన్నాడు. అమర్త్య సేన్ లాంటి ఆర్థిక నిపుణుల దృష్టిలో మోదీ ప్రధాని పదవికి అనర్హుడు. మన ‘వామపక్షులు’ పాక్‌ను, కసబ్‌లను కీర్తిస్తారు. జమ్ము, కశ్మీర్ పాక్‌కే చెందుతాయని అంటారు. కొంతమంది ఉదారవాదులైతే ‘అసహనా’న్ని భరించలేక ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వాపసు చేసే నాటకం ఆడతారు. వీళ్లా భారతీయులు?
-శాంతి సమీర, వాకలపూడి
పిఆర్‌సి అమలు ఎప్పుడు?
పి.ఆర్.సి ఇచ్చి మూడు సంవత్సరాలైంది. పిఆర్‌సి సిఫారసు చేసిన వాటిలో ఆర్థికపరంగా ఒక్క ఫిట్‌మెంట్ తప్ప బకాయిలు ఈనాటికీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఆదాయం పెరిగితేనే ఉద్యోగులకు సహకరించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రులు అనడం శోచనీయం. ఈ మూడు సంవత్సరాలనుండి లక్షల కోట్లు ఖర్చు పెరుగుతూ, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ఈ సమయంలో అలా అనడం పెన్షనర్లను మరింత బాధించినట్లవుతుంది. 70 సం.లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పీఆర్‌సి సిఫారసు చేసింది. మూడు సంవత్సరాలైనా ఇంకా పరిశీలిస్తున్నామనడం భావ్యం కాదు. మార్కెట్‌లో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వేతన జీవులకు బతుకు భారమవుతోంది. ఇక పెన్షనర్ల సంగతి చెప్పనసరం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లనుండి తమ స్థాయిని బట్టి రూ.90, రూ.120 నెలనెలా నగదు రహిత వైద్యానికి వసూలు చేస్తున్నారు. అది కోట్లాది రూపాయలు అయింది. ఏ ఆసుపత్రికి వెళ్లినా డబ్బు ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నారు. వసూలు చేసిన డబ్బంతా ఏమైందో?
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
బిఎస్‌ఎన్‌ఎల్ స్పందించాలి
బిఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన పి.వి./ఎస్.టి.వి స్కీములో ఇన్ని సెకన్లకు ఇరవై ఎనిమిది రోజులు, అరవై రోజులకు ఇంత డబ్బుతో మాట్లాడే వెసులుబాటు కల్పించింది. అయితే మాట్లాడిన వెంటనే బ్యాలెన్స్‌ను గంటలు, నిముషాలు, సెకన్లను తెలియపరుస్తున్నారు.కాని ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉన్నదో లేక ఎక్స్‌పైరి తేదీని కూడా సెల్‌లో మెసేజ్ రావాలి. ఈ సదుపాయం లేకపోవడంవల్ల ఆఖరు తేదీ ముగియగానే మిగిలిన బాలెన్స్ నిరుపయోగం అవుతున్నది. ఆఖరు తేదీ లోపల మరలా ఛార్జ్ చేసుకుంటే పాత బ్యాలెన్స్ కొత్త ఎకౌంట్‌లో కలుస్తుంది. ఆఖరు తేదీని మెసేజ్ ద్వారా తెలియపరచమని మనవి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్*