మెయన్ ఫీచర్

మారుతున్న రాజకీయ ఎజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అని తెలుగు సామెత. ‘అభివృద్ధి’ మంత్రంతో నరేంద్ర మోదీ దూసుకొనిపోతున్న తరుణంలో బలవంతంగా భరత జాతికి సాంస్కృతిక జాతీయవాద మంత్రాన్ని స్వయంగా భారత సర్వోచ్చ న్యాయస్థానం గుర్తుచేసింది. ఇదెలా జరిగింది? దీని పరిణామాలేమిటి? గమనించండి.
1992లో అయోధ్యలో బాబరీ మసీదు కూల్చివేయబడింది. బాబరు సమర్‌ఖండ్ నుండి వచ్చిన ఒక దురాక్రమణదారుడు. అతని సేనాని అయోధ్యలోని శ్రీరాముని మందిరాన్ని కూల్చివేసి దానిపై మసీదు కట్టాడు. ఈ మసీదును 1992లో రామభక్తులు కూల్చివేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఐతే ప్రపంచానికి తెలియని ఒక చారిత్రాకాంశం ఏమిటంటే, కరసేవకులు కూల్చివేసింది మసీదును కాదు, గుడినే. ఎందుకంటే అంతకుముందున్న రాముడి గుడిని కొంచెం పర్షియన్ శిల్పశైలిలో బాబర్ రీమోడలింగ్ చేశాడు. తత్ఫలితంగా ఎల్.కె.అద్వానీ భారత జాతికి తిరుగులేని నాయకుడైనాడు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ‘సబ్‌కా వికాస్’ అనే ఎజెండా జాతి ముందుకు వచ్చింది. 18 ఏప్రిల్ 2017 నాడు భారత సుప్రీంకోర్టు పాతికేళ్లనాటి బాబ్రీ కేసును తిరగతోడింది. అంటే పరోక్షంగా సాంస్కృతిక జాతీయవాదాన్ని గుర్తుచేసింది. రాముడు కృష్ణుడు గంగ గోవు గాయత్రి వీటిని సన్మానించడానికి సాంస్కృతిక జాతీయవాదం అని పేరు. భారత జాతికి హీరో ఎవరు? రాముడా? బాబరా? ఈ అంశం ఇప్పుడు ప్రధానమైన ఎజెండా కాబోతున్నది. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆనాటి కరసేవకులలో ఒకడు. కాబట్టి సాధ్వీ ఋతుంభర ఉమాభారతి, ఆదిత్యనాథ్, ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషీ జైలుకుపోతారు అని కాంగ్రెస్ పార్టీ తన సంతోషాన్ని బహిరంగంగానే టివి ఛానల్స్‌లో వ్యక్తం చేసింది. ఈ కేసు ఇంకా రెండేళ్లు సాగుతుంది. అప్పుడేమి జరుగుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. కాని భారత జాతి ‘మైండ్ సెట్’ ఒక్కసారిగా మారబోతున్నది. రామరాజ్యమా? రోము రాజ్యమా? అనే ఎల్.కె.అద్వానీగారి నినాదం తిరిగి తెరపైకి వచ్చింది. ఇది యాదృచ్ఛికమా? విధి సంకల్పమా?? సారాంశం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇకమీద దేశ ప్రజల చేత- ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేత బలవంతంగా ‘రామభజన’ చేయిస్తున్నది.
ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఎల్.కె.అద్వానీని భారత రాష్టప్రతిగా ప్రకటించాలని బిజెపి ఆలోచిస్తున్న తరుణంలో రామమందిరం సమస్య తెరమీదికి వచ్చింది. 2017 ఆగస్టు నాటికి అద్వానీ భారత రాష్టప్రతి అయితే తర్వాత ఏం జరుగుతుంది? కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వస్తే భారత రాష్టప్రతి హోదాలో అద్వానీగారు జైలుకు పోవలసి ఉంటుంది. నితీశ్‌కుమార్, లల్లూ యాదవ్, సోనియా గాంధీ ఇలా ఆలోచిస్తున్నారు. లోగడ రాముడి గుడి కట్టి కంచెర్ల గోపన్న జైలుకు పోయాడు. బాబరీ మసీదును కూల్చి ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సాధ్వీ ఋతుంభరలు జైలుకుపోతే వీరు భారత జాతి చరిత్రలో నిజమైన హీరోలు కాబోతున్నారని అర్థం.
ఈ మొత్తం ఇతివృత్తంలో ఎక్కువ సంతోషించే వ్యక్తి ఒకాయన ఉన్నాడు. ఆయన పేరు ప్రవీణ్ తొగాడియా. మనం పఠించవలసింది అభివృద్ధి మంత్రం కాదు- హిందూత్వ మంత్రాన్ని- అనేది ఆయన వౌలిక సిద్ధాంతం.
చైనా దుందుడుకు వైఖరి
అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు పట్టణాలకు చైనా తన భాషలో కొత్త పేర్లు పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ మొత్తం టిబెట్‌లో అంతర్భాగమేనని ప్రకటించింది. ఇక్కడ తవాంగ్ అనే చోట బౌద్ధ ధర్మ కేంద్రం ఉంది. దలైలామా మరు జన్మలో ఇక్కడ మళ్లీ మతగురువుగా జన్మిస్తాడని వారి విశ్వాసం. కొద్ది రోజుల క్రితం అక్కడ జరిగిన ధర్మ సమ్మేళనంలో దలైలామా పాల్గొంటే చైనా హెచ్చరించింది. నిజానికి దలైలామా చేతిలో ఆయుధాలు లేవు. అయినా చైనా ఎందుకు భయపడుతున్నది? ఒకవేళ అరుణాచలప్రదేశ్‌ను చైనాకు దానం చేసినా సమస్య పరిష్కారం కాదు. అసోంకు సౌత్ టిబెట్ అని చైనా పేరు పెట్టింది. ఈ దురాక్రమణ దేశాన్ని కొందరు భారతీయులు సమర్థించటమేమిటి?
చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక వ్యాసంలో ‘దలైలామాకు మద్దతునివ్వటం ద్వారా భారత్ చైనాతో జరిపే ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకుండా చేసుకుంటున్నది’ అని వ్రాసింది. ఇంతకూ ఈ ద్వైపాక్షిక చర్చలు దేనికోసం? ఏ ప్రాతిపదిక (కామన్ ఎజెండా) మీద జరగాలి? 2016 డిసెంబరులో భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ దలైలామాకు రాష్టప్రతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. అందుకు చైనా అభ్యంతరం తెలిపింది. దలైలామాకు నోబుల్ శాంతి పురస్కారం లభిస్తే చైనా నిరసన తెలియజేసింది. కాలిఫోర్నియాలో శాండిగో ప్రాంగణంలో ప్రవాస భారతీయ విద్యార్థులను ఉద్దేశించి దలైలామా శాంతి సందేశం విన్పిస్తే ‘అమెరికాలో దలైలామాకు ఏమి పని?’’ అని నిలదీసింది. అసోంకు చెందిన ఉగ్రవాద సంస్థ ఉల్ఫా అధినేత ప్రస్తుతం చైనా నుండి భారత ఈశాన్య రాష్ట్రాలలో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా ఇదే పనిని కొంతకాలం క్రితం నేపాల్‌లో భట్టారమ్ చెప్పి విజయం సాధించాడు. నిన్న చైనా-నేపాల్ ప్రభుత్వాలు తమ ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించాయి. ఇది ఎందుకు భారత పౌరులు గుర్తించరో తెలియదు. నిజమే! మనకు ఎంతసేపూ సినీ మసాలా, క్రికెట్ పిచ్చి తప్ప చైనా, పాకిస్తాన్‌లు ఎలా అంచెలంచెలుగా భారతదేశాన్ని కబళిస్తున్నాయో గమనించే జ్ఞానం ఎక్కడిది?? ఇంత జరిగినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు??
భారతదేశంలో అంతర్భాగమైన 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తన దేశ పటాలలో తనదిగా చూపించుకుంటున్నది. లోగడ భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, రక్షణ మంత్రి ఆంటోనీ, రాష్టప్రతి శ్రీమతి ప్రతిభా పాటిల్ అమెరికా రాయబారి రిచర్డ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని బౌద్ధ ధార్మిక కేంద్రాన్ని సందర్శిస్తే చైనా అభ్యంతరం పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లేవారికి చైనా పేపర్ వీసాలు ఇస్తున్నది. 1962లో ఆక్రమించుకొన్న ఆక్సాయ్‌చిన్ ప్రాంతాలలోని పరిస్థితి ఇలా ఉంది. ఎ.కె.కృష్ణమోహన్ పుణ్యమా అని 1962లో మనం చైనా చేతిలో ఓడిపోయాము. 20 ఫిబ్రవరి 2017లో చైనా పత్రిక డైబింగ్వోకు చైనా దౌత్యవేత్త వాంగ్ డెహూవా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘బేషరతుగా ఇండియా తవాంగ్ మీద తన సార్వభౌమాధికారం వదులుకుంటే సరిహద్దు సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తాము’ అని ప్రకటించారు. చైనా లోగడ మంగోలియాలో చేతులు కాల్చుకుంది. దక్షిణ సముద్ర జలాల విషయంలో జపాన్‌తో విరోధం పెంచుకుంది. అందుకని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా జపాన్‌తో మొన్న వివిధ అణు ఒప్పందాలను కుదుర్చుకుని వచ్చారు. ‘దలైలామా శాంతి దూత కాడు, ఉగ్రవాది’ అని చైనా ప్రకటించింది.
చైనా అరుణాచల్, టిబెట్‌లలో కొన్ని నగరాల పేర్లు మార్చింది. అలాగే బ్రహ్మపుత్ర నది పేరును కూడా మార్చింది. అంటే ఈ ప్రాంతాలు ఆ నది అన్నీ తమవే అని దీని భావం. ‘ఇలా పేర్లు మార్చటంవలన చైనా తన సార్వభౌమాధికారాన్ని ఆ ప్రాంతాలపై ప్రకటించుకున్నట్లు అవుతున్నది’ అని యూనివర్సిటీ ఆఫ్ చైనాలోని ఎథ్నిక్ శాఖకు చెందిన ప్రొఫెసర్ జియాంగ్ కుంజిన్ చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
టిబెట్ అసలు పేరు త్రివిష్టవం. అది భరతవర్షంలోని భారత ఖండంలో అంతర్భాగం అని చరిత్ర చెపుతున్నది. అంటే నేపాల్ - టిబెట్ రెండూ భారతదేశంలోని అంతర్భాగాలే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నది? గౌతమబుద్ధుడు మనవాడు. లుంబిని మనది. దలైలామా మనవాడు. అంటే త్రివిష్టవం మనది. అందుకే టిబెట్‌పై చైనా ఆధిపత్యాన్ని వెంటనే ప్రశ్నించాలి.
అవినీతి జాడలు
రాయలసీమలోని ఒక చెక్‌పోస్టు వద్ద రెండు లారీలు పట్టుబడ్డాయి. అందులో బంగారం బిస్కెట్లు దొరికాయి. అవి చెన్నైలోని కార్తిక ఇంటికి వెళ్తున్నాయి. ఈ కార్తి పళనియప్ప చిదంబరంగారి కుమారుడు. ఈ సంఘటన 2004లో జరిగింది. ఇటీవల వీరికి సంబంధించిన విదేశీ ఆస్తుల జాబితా వెల్లడి అయింది. ఫెరా ఉల్లంఘన కింద 17 ఏప్రిల్ 2017నాడు కార్తికి నోటీసులు అందాయి. టిటివి దినకరన్ ఎ.కె.శశికళకు మేనల్లుడు. ఆర్‌కెపురా ఉప ఎన్నికలో ఓటుకు నాలుగు వేల చొప్పున దాదాపు 90 కోట్ల ధనం దినకరన్ పంచాడని, రెండాకుల గుర్తు తనకు కేటాయించవలసిందిగా 60 కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్‌లో అధికారికి లంచం ఇవ్వజూపాడని ఆరోపణలు వచ్చాయి. ఇక మమతపై అవినీతి ఆరోపణలకు లెక్కలేదు. ఆమెపై పెట్టుకున్న ఆశలు నీరుగారుతున్నాయి. అమెరికాలో కూడా అవినీతి ఉంటుంది. కాని అది చిన్న స్థాయిలో ఉండదు. అందరూ తమ తమ పనులు చకచకా చేసుకుంటూ పోతారు. అందుకు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు. కాని ఇండియా అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఫైలు కదులుతుందా? ‘స్వాతంత్య్రం రాకముందు బ్రిటీషు పాలనలో ఇంత అవినీతి లేదు’ అని ముసలివాళ్లు చెప్పుకుంటున్నారు. మరి స్వతంత్ర భారతం ఎందుకు ఇలా మారింది?? తప్పు మొత్తం నెహ్రూ, ఇందిర, సోనియా కుటుంబంమీదనే వేయలేము. జాతి మైండ్ సెట్ మారింది. ‘పుల్లయ్య చాదస్తుడు. తాను తినడు- మనలను తిననివ్వడు’- ఈ వాక్యం నిజాయితీపరులను గూర్చి మనం ప్రతిరోజూ వింటున్నాము. నిరుద్యోగంవల్లనే ఆర్థిక నేరాలు జరుగుతున్నాయని అనుకోలేము. నల్లడబ్బు దాచుకున్నవారంతా నిరుద్యోగులు కాదు. పెద్ద పెద్ద ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖ సినీ నిర్మాతలు, కళాకారులు.
శారదా చిట్‌ఫండ్ స్కాం, నారదా స్టింగ్ స్కాం రెండూ మమతాబెనర్జీకి ఉచ్చుగా మారాయి. చిట్‌ఫండ్‌లో పెట్టుబడి పెట్టుకునే వారు సామాన్యంగా మధ్యతరగతికి చెందినవారుంటారు. వారు చిట్ పాడుకొని వచ్చిన ఆ మొత్తంతో పెళ్లి - విద్య - వైద్యం వంటి అవసరాలను తీర్చుకుంటారు. ఇలా లక్షలమంది చిట్‌ఫండ్ ఖాతాదారుల నోట్లో మట్టికొట్టడం మమతాబెనర్జీకి తగునా? భారతీయ బ్యాంకులకు 9000 కోట్లు ఎగగొట్టి లండన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యా 18 ఏప్రిల్, 2017నాడు అరెస్టు చేయబడిన 180 నిమిషాలలో విడుదల అయినాడు. సోనియా నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్టు చేయబడిన ఐదు నిమిషాలల్లో బెయిల్ తెచ్చుకున్నది. మామూలు పౌరులకు 14 రోజులు రిమాండ్ విధిస్తారు. అసలు కోర్టు ముఖం చూడకుండా ప్రముఖ బాలీవుడ్ నటుడు బయటపడ్డాడు. ఇవేవీ కొత్త వార్తలు కావు. ప్రజలు ఇలాంటి నూతన పార్లమెంటరీ సంస్కృతికి అలవాటుపడిపోయారు.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్