మెయన్ ఫీచర్

వైవిధ్యాల మధ్య భాషా సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ప్రాంతం వారు మరొక ప్రాంతీయ భాషతోను, సాహిత్యంతోను పరిచయం పెంపొందించుకోవాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైత్ర బహుళ ద్వాదశి, ఆదివారం చేసిన హితబోధ! ప్రతి ప్రాంతంవారు తమ మాతృభాషను మాట్లాడని మరో ప్రాంతంతో ఏడాది పాటు ఇలా జతకట్టాలన్నది మోదీ ఇచ్చిన పిలుపు! దీనివల్ల ప్రతి ప్రాంతంలోని విద్యార్థులు యువజనులు ఇతరులు కూడా తమ ‘మాతృభాష కాని’ మరో ప్రాంతీయ భాషను నేర్చుకొనే అవకాశం ఉంది! దీనివల్ల ప్రాంతీయ వైవిధ్యాలు ‘ఏకైక భారతదేశం’ అన్న వాస్తవ స్థితిని పరిరక్షించి పెంపొందించగలవని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’- ఒకే భారతజాతి, శ్రేష్ఠమైన భారతజాతి- అన్న తరతరాల వాస్తవాన్ని ఆయన ఇలా గుర్తుచేశాడు! ఇలా మరో ప్రాంతీయ భాషను పరిచయం చేసుకునేవారు ఆ భాషలోని ఐదు పాటలను నేర్చుకోవాలి, ఆ భాషా లిపిని కూడా నేర్చుకోవాలి. ఆ భాషకు చెందిన వంద వాక్యాలను నేర్చుకున్నవారు ఆ భాషలో జీవన వ్యవహారాన్ని కొనసాగించవచ్చు! భాషల పేరుతో ‘జాతుల’ను ‘సంస్కృతుల’ను కృత్రిమంగా రూపొందిస్తుండడం జాతీయ వైపరీత్యం. ఈ కృత్రిమ విభేదాలను అతిక్రమించి అన్ని భాషలవారు ఒకే భారత జాతిలో భాగమన్న వాస్తవ ధ్యాస పెరగాలన్నది నరేంద్ర మోదీ మాటలలో ద్వనించిన సారాంశం! మన దేశంలో అనాదిగా అనేకానేక వైవిధ్యాలున్నాయి కానీ జాతీయత మాత్రం ఒక్కటే, సంస్కృతి కూడా ఒక్కటే! మతాలు, భాషలు, ప్రాంతాలు ఇంకా ఇతర వైవిధ్యాలు అనేకం.. జాతి మాత్రం అద్వితీయం! బ్రిటన్ దురాక్రమణదారులు మన ఏకైక భారత జాతిని ‘్భన్న జాతుల కూటమి’గా ప్రచారం చేశారు. ‘‘్భన్న సంస్కృతుల కూటమి’’గా ప్రచారం చేశారు. ఈ కల్పిత జాతులన్నీ కలిసిపోయి ఒకే జాతిగా ఏర్పడడానికి బ్రిటన్ పాలన దోహదం చేసిందన్న మరో అబద్ధం కూడా ప్రచారమైంది. అలాగే భిన్న సంస్కృతులు కలిసిపోయి ఒక ‘సంకర సంస్కృతి’- కాంపోజిట్ కల్చర్- కూడా బ్రిటన్ పెత్తనం కింద మన దేశంలో ఏర్పడిందన్నది ప్రచారమైన మరో అబద్ధం! దక్షిణ భారతీయులు ద్రావిడ జాతి అని, ఉత్తర భారతీయులు ఆర్యజాతి అనీ కట్టుకథలను కల్పించిన బ్రిటన్ దురాక్రమణదారులు ‘ఏకైక భారత జాతి’ని అనైక్యతపాలు చేసిపోయారు. ఇపుడు భాషల పేరుతో ‘జాతులు’ ప్రచారవౌతున్నాయి! తెలుగుజాతి, కన్నడజాతి, తమిళ జాతి, మరాఠీ జాతి, అస్సామీ జాతి అన్నవి లేవు! తెలుగు భాషా జనసముదాయం ఉంది.. అస్సామీ భాషాజన సముదాయం ఉంది! ఇలాగే అన్ని, అనేక ప్రాంతీయ భాషల జన సముదాయాలు కూడా ఉన్నాయి. ఈ భాషా జన సముదాయాలు, విభిన్న మతాల జన సముదాయాలు కలిసి ఒకే ‘జాతి’ కావడం యుగాల చరిత్ర.. ‘తెలుగు జాతి’, ‘తమిళ జాతి’ లేవు.. తెలుగువారిది భారతజాతి, తమిళులది భారతీయ జాతి, అస్సామీలది, కశ్మీరీలది కూడా భారతజాతి...
వైవిధ్యాల మధ్య సమన్వయం పెంపొందించడానికి వివిధ ప్రాంతాల వారు ప్రయత్నించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాట! వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదన్నది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జాతీయ రాజధానిలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో మోదీ చేసిన ప్రసంగానికి ప్రధాన ఇతివృత్తం. విభిన్న భాషలలోని గీతాలు, శాస్త్రాలు, లిపులు, పాఠ్యప్రణాళికలు, విభిన్న ప్రాంతాల భాషల వారి క్రీడలు, కళలు, ఆహార పదార్థాలు, ఆహార్య రీతులు, వివేచనలు, ఆలోచనలు అద్వితీయ జాతీయతను, ఏకైక సంస్కృతిని పరిరక్షించి పెంపొందించడం భారతీయుల అనాది జీవనరీతి.. ప్రధానమంత్రి ఈ జీవనరీతిని మరోసారి గుర్తుచేశాడు. ఇలా పదే పదే గుర్తుచేసుకోవడం వల్ల, గుర్తుచేయడంవల్ల ‘అద్వితీయ భారతజాతి’ ధ్యాస, ‘అద్వితీయ హైందవ సంస్కృతి’ ధ్యాస పదిలంగా ఉన్నాయి, పదిలంగా ఉండడం సహజ వాస్తవం.. భంగపడడం అపవాదం. అపవాదం సంభవించినప్పుడల్లా ధ్యాస పెంచడం అనివార్యం! బంగారు భవనం సహజం.. బూజు పేరుకొనిపోవడం అపవాదం- ఎక్సెప్షన్! బూజు పేరుకున్నప్పుడల్లా దులపాలన్నది మోదీ మాటలలోని ధ్వని! అద్వితీయ భారతీయ సాంస్కృతిక జాతీయ మందాకినీ మహాప్రవాహం సనాతనం, అంటే శాశ్వతం.. మురికి కాలువలు ఈ స్రోతస్వినిని ముంచెత్తడం అపవాదం! ఈ మురికి కాలువలు వైరుధ్య భ్రాంతికి ప్రతీకలు.. వైవిధ్యాల మధ్య నిరంతర సమన్వయం నిహతమై ఉంది! సూర్యుని వెలుగు సహజమైన సృష్టిగత సూత్రం, గ్రహణం అపవాదం! ‘అపవాదాలు’ పునరావృతవౌతున్నాయి, అపవాద విముక్త సహజస్థితి శాశ్వతమై- అంటే సనాతనమై ఉండడం సృష్టిక్రమం! అందుకే గ్రహణం పునరావృత్తవౌతోంది, సూర్యుని వెలుగు శాశ్వతమై ఉంది; సృష్టిగత వాస్తవాలను సమాజ జీవనస్థితం చేసుకున్న జాతి అనాదిగా భారతజాతి లేదా హైందవజాతి! అందుకే మనది సనాతన జాతి!
వైవిధ్యాల మధ్య నిరంతర సమన్వయం సృష్టిగతం. మత భాషా ప్రాంత ఇత్యాది అనేక వైవిధ్యాలమధ్య సమన్వయం అనాది భారత జాతీయ తత్త్వం! అసంఖ్యాక ఉపగ్రహ, గ్రహ నక్షత్రాల, బ్రహ్మాండ సమూహమైన సృష్టి మాత్రం ఒక్కటే అయి ఉంది! సృష్టి అద్వితీయమైనది అంటే రెండవది కాదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన వేదవిజ్ఞానం ప్రాతిపదికగా కొలంబో నుంచి కైలాసం వరకు ఒకే ఒక జాతి వికసించింది, ఒకే సంస్కృతి పరిమళించింది. కొలంబో, కైలాసం ఈ జాతీయ సమగ్రతా క్షేత్రం నుంచి ప్రస్తుతం విడిపోయి ఉండడం అపవాదం.. మన జాతిని దోచుకొనడానికి మన సంస్కృతిని మంటకలపడానికి వచ్చిన బ్రిటన్ దేశానికి చెందిన బౌద్ధిక బీభత్సకారులు మప్పిన అబద్ధాలను మన విద్యాలయాలలో ఇప్పటికీ వల్లె వేస్తుండడం జాతీయతకు పట్టిన గ్రహణం! అద్వితీయ హైందవ జాతీయత అనాదిగా ప్రకాశిస్తూ ఉండడం వాస్తవం! ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి నేనామెకు పుత్రుడను- ధైర్యః పితా పృథివీ మాతా- ఆకాశం తండ్రి భూమి తల్లి- అన్నవి వేద ఋషులు దర్శించిన సనాతన వాస్తవాలు. ‘జాతికి మాత’ భూమి, ‘జాతిపిత’ ఆకాశం. ఆకాశం అనంతం. రూపం లేనిది. రూపరహితమైన ఆకాశానికి ఆత్మ వంటి సూర్యుడు ప్రతీక.. ‘‘సూర్య ఆత్మా జగతః’’అన్నది వేదం వివరించిన ఆత్మ! అందువల్ల భూమిని వర్షధారలతో పండిస్తున్న ఆకాశం లేదా సూర్యుడు తండ్రి, భూమి తల్లి!! ఈ వాస్తవం భారతజాతికి మాత్రమే కాదు మొత్తం ప్రపంచంలోని అన్ని జాతులకు వర్తించే సృష్టిగత వాస్తవం! కానీ ఈ వాస్తవాన్ని అనాదిగా భారతీయులు మాత్రమే గుర్తించారు, వేద ద్రష్టలు వివరించారు! అందుకే సూర్యుని కిరణంవలె సూర్యుని ఉదయంవలె మనది సనాతన జాతి! గుర్తించని ‘జాతులు’ అంటే భారతదేశం వెలుపల జాతులు భూమిని తల్లిగా భావించలేదు, సూర్యుడిని తండ్రిగా సంభావించడంలేదు. ఈ వేద విజ్ఞానం జానపదుల జీవన వ్యవహారమైంది. ‘‘నేల తల్లి నింగి తండ్రి’’ అన్నది వనవాసీలు గుర్తించిన సనాతన సత్యం! వైవిధ్య శ్రేణుల ఏకైక భారతజాతిలో శ్రేణులమధ్యకల సమన్వయ తత్త్వానికి ఇది ఒక వౌలిక సాక్ష్యం.. ఈ జాతికి చెందిన కొన్ని ‘శ్రేణు’లు మాత్రమే అనాదిగా ఇక్కడ పుట్టి పెరిగాయని, మరికొన్ని ‘శ్రేణులు’ విదేశాలనుంచి వచ్చిపడ్డాయని భ్రమించడం బ్రిటన్ వదలి వెళ్లిన బౌద్ధిక వారసత్వం! మొత్తం స్వజాతి ప్రజలు అనాదిగా ఈ దేశంలోనే పుట్టి పెరగడం వాస్తవం! ఈ వాస్తవాన్ని బ్రిటన్ దురాక్రమణ సమయంలో థామస్ బాబింగ్టన్ మెకాలే - బిషప్ కాల్డ్‌వెల్ వంటి దుర్జనులు వక్రీకరించారు. ఈ వక్రీకరణ ఫలితంగానే భాష పేరుతో ‘జాతి’- నేషన్, ప్రాంతం పేరుతో ‘జాతి’- నేషన్, మతం పేరుతో ‘జాతి’, సంప్రదాయం పేరుతో ‘జాతి’ వంటివి పుట్టుకొచ్చాయి! ‘్భష’ పేరుతో ప్రత్యేక ‘జాతి’ అన్న భ్రాంతిని తొలగించాలన్నది నరేంద్ర మోదీ ప్రసంగంలోని ఇతివృత్తం!!
‘మతం’ పేరుతో ‘జాతి’ అన్న కృత్రిమ సిద్ధాంతం క్రీస్తుశకం 1947లో అఖండ భారత విభజనకు దోహదం చేసింది. భాష పేరుతో ‘జాతి’ అనీ కృతక సిద్ధాంతం ఒకే జాతి ప్రజల మధ్య భాషా ఉన్మాదాలను, అన్య భాషా ద్వేషాన్ని పెంచి పోషిస్తోంది! అలాగే వనజనుల మధ్య పురజనుల మధ్య వివిధ ప్రాంతాల మధ్య ద్వేషం కల్పించడానికి కూడా ‘కృత్రిమ జాతుల కృతక సిద్ధాంతం’ దోహదం చేస్తోంది. భాషా మత శ్రేణి ప్రాంతీయ వైవిధ్యాల సర్వసమగ్ర సమాహారం హైందవ జాతి అన్న, భారతీయ అద్వితీయ సంస్కృతి అన్న అనాది వాస్తవ ధ్యాస తగ్గిపోతుండడానికి కారణం వదలని బ్రిటన్ వారసత్వం! వాస్తవ ధ్యాస పెరగాలన్నది నరేంద్ర మోదీ చెప్పిన మాట! ఒక భాషాజన సముదాయం మరో భాషను నేర్చుకొనడంవల్ల అన్ని భాషలలోని భావజాలం సమానమన్న జాతీయ వాస్తవం మది మదిలో వెలుగుతుంది! భాషలు వైవిధ్య స్వరూపాలు, స్వభావం ఒక్కటే, ఈ స్వభావం జాతీయ సంస్కృతి! వివిధ భారతీయ భాషా నదీ నదాలన్నీ ఒక సాంస్కృతిక ‘మానస సరోవరం’ నుంచి ప్రభవిస్తున్నాయన్నది వాస్తవం! వివిధ భాషల భావం అద్వితీయం. తమిళ కంబ మహాకవి రఘురాముని కథ చెప్పాడు, హిందీ తులసీదాసు మహాకవి రఘురాముని కథ చెప్పాడు. తెలుగు త్యాగరాజస్వామి, భద్రాచల శ్రీరామదాసు ఆ రఘురాముని అనుభూతిని పొందారు. ఉజ్జయినీ, ధారా నగరాల మధ్య నడచిన భోజ మహారాజు అదే రఘురాముని కథ చెప్పాడు. ఏ భారతీయ భాష అయినా కథ కథనం సంస్కారం ఇతివృత్తం అదే... ‘‘్భవములు ఒక్కటైన ప్రభావ తత్త్వము’’ అని తాళ్లపాక అన్నమాచార్యులు చేసిన సమన్వయించాడు!! కర్నాటక సంగీతంగా పేరుపొందిన సారస్వత వేదనాద ప్రస్ఫుటికి పాఠ్య ప్రణాళికను తయారుచేసినవాడు కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు. ఈ పాఠాలు రచించినవాడు తెలుగువాడైన కాకర్ల త్యాగరాజు. ఈ సంగీత విస్తృతిని సాధించినవారు తమిళులు.. ఇదీ జాతీయతలోని అద్వితీయత! గోదాదేవి వేల ఏళ్ల క్రితం పాడిన బాలకృష్ణుని కథను వందల ఏళ్ల క్రితం మీరాబాయి మళ్లీ ఆలపించింది! ఇదీ సమన్వయం! ఈ సమన్వయ మాధ్యమం సంస్కృత భాష.. అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషకు రూపాంతరాలు! ఇది సనాతన సత్యం.. ఈ సత్యాన్ని బిషప్ కాల్డ్‌వెల్ భంగఫరిచాడు! అన్ని భారతీయ భాషల ‘లిపుల’కు మాతృక మూలభూతమైన బ్రాహ్మీ లిపి.. అన్ని భారతీయ భాషలూ అక్కచెల్లెళ్ళు, తల్లి సంస్కృత భాష!!
‘ఆర్య’ అన్న జాతి- నేషన్ లేదు! ‘ద్రవిడ’ అన్న జాతి లేదు! ‘ఆర్యుడు’ అని అంటే సంస్కారవంతుడు. ‘ద్రవిడ’ శబ్దం భౌగోళిక పరిధిని సూచించే ప్రాంతీయ నామం మాత్రమే! సంస్కారవంతులందరూ ఆర్యులే. ద్రవిడ ప్రాంతం కూడా అఖండ భారత జాతిలో భాగం! సింహళ, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలవారు పంచ ద్రావిడులు.. ‘ద్రమిళుడు’ అన్న రాజు పాలించిన ఈ ప్రాంతం ‘ద్రమిళ’ ‘ద్రవిడ’ ప్రాంతమైంది. ఈ ప్రాంతాల వారు అందువల్ల ప్రత్యేక జాతి కాలేదు. వీరు అనాదిగా భారత జాతీయులు! హిందూ జాతీయులు!!

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352