సబ్ ఫీచర్

తరగతికి తల్లిదండ్రుల సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యూబా విద్యారంగంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. అది కేవలం లాటిన్ అమెరికా వారికే కాకుండా ప్రపంచంలోని చాలా మూలాల్లో ఉన్న ప్రజానీకంపై కూడా తీవ్ర ప్రభావం పడింది.
ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ ముందు గద్వాల దగ్గర ఒక ఊరికి చెందిన 25 ఏళ్ల ఆవిడ పండ్లు అమ్ముకుంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి చదువుకోసం ఆమె ఇక్కడికి వచ్చింది. పిల్లలకు స్కూలు ఉపాధ్యాయుడు ఎంత ప్రధానమో తల్లిదండ్రుల అవేర్‌నెస్ కూడా అంతే ప్రధానం. తల్లిదండ్రుల అవేర్‌నెస్ వలన పిల్లలకు సోషల్ క్యాపిటల్ వస్తుంది. తల్లిదండ్రులు చదువుకున్నట్లయితే పిల్లలు చదువుతూ ఉంటారు. దీన్ని గమనించి అమెరికా వారు కేజీ స్కూల్స్ లోపల నెలకొకసారి విధిగా తల్లిదండ్రులు తరగతి గదికి రావాలని నిర్ణయించారు. వచ్చినవారు ఏదో ఒక కథ చెప్పాలి. ఆ కథ ప్రభావం విద్యార్థులపైన పడి అది హ్యూమన్ క్యాపిటల్ (మానవ సంపద)గా మారుతుంది. చదువుకునే పిల్లలపై పెట్టే ఖర్చును పెట్టుబడి అనుకుంటారు. తమ భవిష్యత్‌ను పిల్లల ద్వారా నిర్మించుకుంటారు. ఇంటిలోపల పుస్తకాలుంటే అది తల్లిదండ్రుల లోపల పరివర్తన తీసుకువస్తుంది.
ఆడవారు చదువుకున్నట్లయితే గర్భిణులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. పుష్ఠికరమైన ఆహారంవల్ల శిశువు ఆరోగ్యవంతంగా జన్మిస్తాడు. తెలంగాణ గ్రామాలలో 3 కేజీల బరువున్న పిల్లలు పుడుతున్నారు. ఇతర దేశాల్లో 5 నుంచి 6 కేజీల బరువున్న పిల్లలు జన్మిస్తున్నారు. చాలా దేశాల్లో ఆడవారి చదువువలన శిశు మరణాల సంఖ్య తగ్గిందంటున్నారు. కథల పుస్తకాల వలన విలువలు చిన్నప్పటినుంచే వస్తాయి. క్యూబాలో విద్యార్థుల రాణింపుపై చాలా పరిశోధనలు చేశారు. క్యూబాలో డాక్టర్‌లను అత్యధిక సంఖ్యలో ఎలా తయారుచేయగలుగుతున్నారని శోధించారు.
తల్లిదండ్రుల చదువువల్ల విద్యా ప్రమాణాలు చిన్నప్పటినుంచి పెంచేందుకు, సైంటిఫిక్ టెంపర్ పెరిగేందుకు అమెరికాకు ఎందరినో డాక్టర్స్‌ను అందించగలిగారు. ఇలాంటి వార్తల ప్రచారంవలన తెలంగాణ ప్రాంతంలో పేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసమై వలసలు వస్తున్నారు. తల్లిదండ్రుల ఈ జాగ్రత్తవలన పిల్లలకు అది సోషల్ క్యాపిటల్‌గా మారుతుంది. వయోజన విద్యవల్ల అది తల్లిదండ్రులకు హ్యూమన్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, చివరికది సోషల్ క్యాపిటల్‌గా మారుతుంది. చదువుకున్న తల్లిదండ్రులు పాఠశాలలకన్నా సమాజానికి మధ్యన ఒక బ్రిడ్జిగా మారతారు. చదువులో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ముఖ్యం. అదే విద్యా ప్రమాణాల పెరుగుదలకు దోహదపడుతుంది. తల్లిదండ్రుల కోపరేషన్ పరిసరాల సహకారంగా మారుతుంది. తరగతి గదికి పరిసరాలే బలం.

-చుక్కా రామయ్య