మెయన్ ఫీచర్

అసలు ముప్పు ‘అర్బన్ టెర్రరిస్టుల’ నుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ నగరపాలిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అవమానకరమైన ఓటమిని చవిచూసినందుకు మనం ఏ మాత్రం పట్టించుకోనక్కర్లేదు. అయితే, ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్‌ను ఓ సాహసవీరుడిగాను, నరేంద్ర మో దీకి ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగాను కీర్తించడాన్ని ‘వృత్తిగా చేసుకొన్న’ టీవీ మీడియా తీరును మాత్రం మనం పరిశీలించాలి. నిజానికి గత సార్వత్రిక ఎన్నికలకు ముందే- 2013లోనే దిల్లీ మీడియా కేజ్రీవాల్ అంటే ఎందుకోగాని తెగ చొంగ కార్చుకుంటూ ‘మోదీని ఢీకొనే మొనగాడుదొరికాడం’ టూ తెగ ఊదరగొట్టింది. అన్నింటా ‘స్వతంత్రుడి’నని భావించే కేజ్రీవాల్ కూడా- మోదీకి తా ను మాత్రమే ‘బలమైన జాతీయ ప్రత్యామ్నాయమ’ని ఊహాలోకాల్లో విహరించాడు. ఈయనగారి ఘనతను చాటిచెప్పేందుకు టన్నుల కొద్దీ న్యూస్‌ప్రింట్‌ను దినపత్రికలు, వేలాది పనిగంటలను టీవీ చానళ్లు వృథా చేశాయి. ఎట్టకేలకు పంజాబ్, గోవా, దిల్లీ ఓటర్లు కేజ్రీవాల్‌కు ఆయన స్థానం ఏమిటో చూపించారు. మానసిక రుగ్మతను కలిగి, రాజకీయ వేదికపై నాయకుడిగా నటించే ఈ వ్యక్తి గురించి చర్చించడం వల్ల కాలహరణం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.
అందుకే- ప్రస్తుతం జాతి సమగ్రతకు పెనుముప్పు తె స్తున్న కీలక అంశంపై దృష్టి సారిద్దాం. ఓ మాజీ ప్రధాని అంగీకరించినట్లు నక్సలైట్ల సమస్య ఈ దేశపు శక్తిని, భద్రతా బలగాల పాటవాన్ని పీల్చేస్తోంది. బస్తర్ లేదా జగదల్‌పూర్ అడవుల్లోనో, ఒడిశాలోనో ‘దాగి ఉన్న’ వారి గురించి కాదు, ‘పట్టణ టెర్రరిస్టుల’పై మనం నిశితంగా దృష్టి సారించాలి. వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రవాదానికి మద్దతు ఇస్తుంటారు. మేధావులు, ఉదారవాదులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు వంటి వేషాల్లో ‘అర్బన్ టెర్రరిస్టులు’ కనిపిస్తారు. దిల్లీలోని రంజాస్ కళాశాలలో జాతి వ్యతిరేక నినాదాలివ్వడమే కాదు.. బస్తర్, కాశ్మీర్‌లో సైతం వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. నక్సలైట్ల కీడును వృద్ధి చేసేందుకు ఈ ‘అర్బన్ టెర్రరిస్టులు’ సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. విధ్వంసక ఉద్యమం మనుగడకు అవసరమైన ప్రాణవాయువును వీరు అందిస్తుంటారు.
తాజాగా చత్తీస్‌గఢ్‌లోని సుకుమాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లకు పెను విషాదం ఎదురుకాగా, ‘పట్టణ టెర్రరిస్టుల్లో’ని కొందరు తమ గదుల్లోంచి బయటకు వచ్చి పాతపాటే వినిపించారు. ‘తీవ్రవాదం మూలాల్లో’కి మనం వెళ్లాలన్నది వారి వాదన. ‘కొండకోనల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు, మావోయిస్టు ఉద్యమానికి ప్రభుత్వానిదే బాధ్యత’ అంటూ పట్టణ టెర్రరిస్టులు తేలిగ్గా చెప్పే మాటలను చాలా కాలంగా వింటున్నాం. నక్సలైట్లు అభివృద్ధిని అడ్డుకుంటున్న వాస్తవాన్ని మాత్రం ఈ ఉదారవాదులు ఎంతమాత్రం అంగీకరించరు. రహదారులు, వంతెనలు, బడి భవనాలు, టెలిఫోన్ టవర్లు, ఆస్పత్రులను నక్సలై ట్లు ధ్వంసం చేస్తుంటే- గిరిజనులు ఎప్పటికీ పేదలుగా, నిరక్షరాస్యులుగా మిగిలిపో రా? సుకుమా జిల్లాలో రోడ్డు పనులు సజావుగా సాగేలా భద్రత కల్పించేందుకు వచ్చిన సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రా ణాలు కోల్పోయారు. ఈ వాస్తవాలను చూడలేక కళ్లు మూసుకునే ‘పట్టణ టెర్రరిస్టులు’ అభివృద్ధి లేదన్న సాకుతో ప్రభుత్వాన్ని అదేపనిగా నిందిస్తుంటారు. కొన్ని దశాబ్దాల క్రితమైతే కొండకోనల్లో అభివృద్ధి లేదని అనుకోవచ్చు. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. టీవీ స్టూడియోలకే పరిమితమయ్యే మీడియా కూడా పాతబాణీలోనే తన వాదన వినిపించడం పరిపాటి.
నిఘా విభాగం దారుణ వైఫల్యం వల్లే ‘సుకుమా’ ఘటనల రూపంలో పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది మీడియా చేసే మరో ఆరోపణ. క్షేత్రస్థాయి పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేకుండా టీవీ స్టూడియోలో నాలుగు గోడలకే మీడియా పరిమితమై పోవడం అసలు సమస్య. ‘నక్సలైట్లకు గ్రామీణ ప్రజలు సహకరిస్తున్నారన్న’దే మీడియా ఎప్పుడూ చెప్పే మాట. అది ఎంతమాత్రం నిజం కాదు. పల్లెవాసులకు అంతకుమించి మరో మార్గం లేదు. నిఘా వర్గాలకు తాము సమాచారాన్ని చేరవేస్తున్నట్లు నక్సలైట్లకు అనుమానం వచ్చిందంటే- గ్రామీణులు తమ బతుకులను మూల్యంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. తమ గురించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా గిరిజనుల కదలికలపై నక్సలైట్లు కనే్నసి ఉంచుతారు. అందుకే నక్సలైట్ల ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాదు. రహదారులు, టెలిఫోన్ వ్యవస్థ, వంతెనలు, ఇతర నిర్మాణాలను నక్సలైట్లు ధ్వంసం చేసినా ఆ వివరాలు నిఘా సంస్థలకు తెలిసే అవకాశమే ఉండదు. రవాణా, సమాచార వ్యవస్థను నాశనం చేస్తుంటే- ‘నిఘా వైఫల్యం’ అంటూ మీడియా చేసే వ్యాఖ్యానాలు వింతగా అనిపిస్తాయి.
సిఆర్‌పిఎఫ్‌కు పూర్తిస్థాయి అధిపతి లేకపోవడం మరో వైఫల్యమన్నది మీడియా చేసే మరో ఆరోపణ! దేశంలోనే భారీ భద్రతా దళమైన సిఆర్‌పిఎఫ్‌కు అధిపతిని నియమించేవరకూ ప్రభుత్వం చే తులు ముడుచుకుని కూ ర్చోదు. సమస్యాత్మక ప్రాం తాల్లో జవాన్ల సేవలు కొనసాగాల్సిందే. దారుణ విషాదాలు జరగడానికి- సిఆర్‌పిఎఫ్‌కు పూర్తిస్థాయి అధిపతి ఉన్నా డా? లేడా? అన్నది కారణం కాదు.
నక్సలైట్ల సమస్య నానాటికీ విషమిస్తోందని, దీన్ని ఎదుర్కొనడం ప్రభుత్వానికి చేతకావడం లేదని దిల్లీ మీడియా ఇపుడు విమర్శల జోరు పెంచింది. నక్సల్స్ బెడదను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ఊహాజనితమైన, వినూత్నమైన వ్యూహం లేదన్నది నిజం. కేంద్రమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు భావిస్తున్నాయన్నది కొందరి వాదన. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున సంబంధిత ప్రభుత్వాలే పక్కా వ్యూహంతో ముందుకు రావాలని కేంద్రం భావిస్తోంది. అయితే, పరిస్థితి మరీ దిగజారిందన్న విమర్శ సరికాదని- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాలను గమనిస్తే అవగతమవుతుంది. 2010లో నక్సల్స్ విధ్వంసాలకు సంబంధించి 2,213 సంఘటనలు జరిగాయి. 2011లో జరిగిన 1,760 సంఘటనల్లో 611 మంది మృత్యువాత పడ్డారు. 2014లో 222 మంది పౌరులు, 88 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో 168 మంది పౌరులు, 58 మంది జవాన్లు, 89 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలపై మావోయిస్టుల దాడులు 2014 కంటే 2015లో తగ్గాయి. 2014లో 155 చోట్ల, 2015లో 118 చోట్ల మావోయిస్టుల దాడులు జరిగాయి. 2016లో 120 మంది పౌరులు, 66 మంది భద్రతా సిబ్బంది, 244 మంది నక్సలైట్లు మరణించారు. ఈ గణాంకాలను తెలుసుకునేందుకు తీరిక లేని మీడియా బాధ్యతారహితంగా ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. ఎందుకంటే- విపక్షాలు చెప్పిందే వారికి వేదం గనుక.
ఏదిఏమైనా, ‘సల్వాజుడుం’ గురించి పట్టణ టెర్రరెస్టులు చేసే ‘హానికరమైన ప్రచారా’న్ని మనం గమనించాలి. నక్సలైట్లను ఎదుర్కొనేందుకు కేంద్రం సహాయంతో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2005లో ‘సల్వాజుడుం’ను ఏర్పాటు చేసింది. పౌరుల భాగస్వామ్యం ఉన్న ‘ఎదురుదాడి చేసే’ వ్యవస్థ ‘సల్వాజుడుం’. ఏ గిరిజనులనైతే నక్సల్స్ వాడుకుంటున్నారో అదే గిరిజనులను శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించుకోవడం ఈ వ్యవస్థ ఉద్దేశం. మానవ హక్కుల కార్యకర్తలమని గొప్పలు చెప్పుకునేవారు న్యా యస్థానాన్ని ఆశ్రయించి ‘సల్వాజుడుం’ను విజయవంతంగా అడ్డుకున్నారు. నక్సల్స్ సమస్యను ఎదుర్కొనేందుకు సత్ఫలితాలనిచ్చే వినూత్న ప్రయోగం అయినప్పటికీ, ఈ వ్యవస్థను బలవంతంగా రద్దు చేయించారు. అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అసాధారణ పరిష్కారం అవసరం. తిరుగుబాటును ఎదుర్కొనే ఈ వి నూత్న ప్రయోగానికి సుప్రీం కోర్టు జోక్యంతో తెర ప డింది.
ఆఖరుగా- ఇస్లామిక్ జిహాదీలకు, నక్సలైట్లకూ ఏమైనా తేడా ఉందా? ‘రాజ్యం’పై పోరాటమే ఈ ఇద్దరి ధ్యేయం. ‘దైవపరిపాలనా భావజాలం’ విస్తరణే జిహాదీల ఆలోచన. తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజాస్వామ్యాన్ని పడగొట్టాలన్నదే నక్సలైట్ల ఆ శయం. ఒకే నాణానికి నక్సల్స్, జిహాదీలు చెరో పార్శ్యాలు. ప్రజాస్వామ్య రాజ్యంలో మరో ప్రత్యామ్నాయం లేదు- ఈ ఇద్దరినీ అణచివేయడం తప్ప.
*

cell: 80083 22206