సంపాదకీయం

పోతన్న పేరు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో జూన్ రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మాతృభాషాభిమానులకు ఆపాత మధురం! జంటనగరాలలోని వందలాది పాఠశాలలలో చదువుతున్న తెలుగు విద్యార్థులలో అత్యధికులకు తెలుగు అక్షరాలు రాని విచిత్ర స్థితి ఏర్పడి ఉండడం తెలుగు కోసం పరితపిస్తున్న వారికి కలవరం కలిగిస్తున్న కఠోర వాస్తవం! ఈ స్థితిలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తున్న పరిణామం. ‘ఏమి నోము ఫలమొ? ఇంత పొద్దొక వార్త వింటిమబలలార వీనులలర..’ అని మహాకవి పోతన శతాబ్దుల క్రితం చెప్పిన మాటలు ఈ ప్రపంచ తెలుగు మహాసభల సమాచారానికి సరికొత్తగా అన్వయం అవుతున్నాయి. పోతన్న చెప్పిన వార్త యశోదమ్మ ‘చిన్ని మగవానిని’ కనడం గురించి.. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన వార్త తెలుగు మరోసారి వెలగడం గురించి.. బమ్మెర పోతన జన్మస్థలాన్ని చారిత్రక స్థలంగా ప్రకటించడం, సాహిత్య సాంస్కృతిక కేంద్రంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పించడం ప్రపంచ తెలుగు మహాసభల నిర్ణయానికి సన్నిహిత సమీప నేపథ్యం. తెలుగు భాషా సాహిత్యాలను సముజ్వలింపచేసిన సనాతన సాంస్కృతిక కాంతిరూపం బమ్మెర పోతన. ఆయన సనాతనుడు అంటే శాశ్వతుడు. ‘సనాతనం’ అని అంటే పాతది అన్న ప్రచారం జరుగుతుండడం భాషకు దాపురించిన రుగ్మతలలో ఒకటి. పోతన స్ఫూర్తితో ఇలాంటి రుగ్మతలను తొలగించుకొనడానికి ప్రయత్నించినప్పుడు తెలుగు మళ్లీ వెలుగులీనుతుంది. ‘సనాతనం’ అని అంటే ‘శాశ్వతం’ అని మాత్రమే అర్థం. సూ ర్యుడు సనాతనుడు, తెలుగు భాషా సాహిత్యాలకు సనాతన ప్రభలనద్దిన పోతన సనాతనుడు.. ఈ సనాతన ప్ర భలు భారతీయ సం స్కృతి, భారతీయ అద్వితీయ జాతీయత! మహా కవి పోతన్న అందువల్ల తెలుగు భాషా జన సముదాయానికి, తెలుగు ప్రాం తం వారికి మాత్రమే కాదు మొత్తం భారత జాతికి ప్రాతఃస్మరణీయుడు, వందనీయుడు.. జూన్‌లో జరిగే ప్రపంచ మహాసభా ప్రాంగణానికి పోతన్న పేరు పెట్టడం సముచితం కాగలదు.. కరుణశ్రీ అన్నట్టుగా పోతన తన మహా భాగవత రచనను సాగించినప్పుడు బహుశా మాటిమాటికీ తన గంటాన్ని తేనెలో ముంచాడు.. ఆ ‘తేనె’ భారతీయ సంస్కృతి మధుధార! అందువల్లనే తరతరాల తెలుగు వారి హృదయాలలో మహా భాగవత కథల తేనెల వానలు కురుస్తున్నాయి! తెలంగాణ పోతన్న కవనపు పసిడి వెనె్నల సోన, తెలుగు సీమ పోతన కవితా వర్షధారలతో నిరంతరం పులకిస్తున్న సమగ్ర సంస్కృతి లలామ!
మిగిలిన భారతీయ భాషలతోపాటు తెలుగును కూడ ఆంగ్ల భాష దిగమింగుతుండడం నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్రను ఇలాగే కొనసాగించినట్టయితే తెలుగు భాషా సాహిత్యాలు కేవలం ఘనమైన గత కీర్తిగా మిగిలిపోగలవన్నది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గమనించదగిన తక్షణ సమస్య, పరిష్కరించవలసిన తక్షణ సమస్య.. పోతన్నను, నన్నయ్యను, తిక్కనను, శ్రీనాథుడిని, ఆంధ్ర భోజుడిని ఘనంగా స్మరించుకున్నంత మాత్రాన తెలుగు వెలుగు విస్తరించదు. పోతన్న పద్యం ఒక్కటి కూడా నోటికి రాని వారు ‘పోస్టుగ్రాడ్యుయేట్లు’గాను, ‘డాక్టరేట్లు’గాను చెలామణి అవుతుండడం నిరాకరింపజాలని నిజం. తెలుగు భాష ‘అక్షర రమ్యత’ గురించి ఆదికవి నన్నయ ఘనంగా చెప్పాడు! కానీ, తెలుగు అక్షరాలే రాని ‘అధిక విద్యావంతుల’కు రమ్యత గురించి ఏమి ధ్యాస ఉంటుంది? ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతున్న పాఠశాలల్లో సైతం రెండు భారతీయ భాషలను విద్యార్థులకు బోధించాలన్నది జాతీయ విద్యా విధానంలోని మార్గదర్శక సూత్రం. కానీ, తెలుగు వాసన అంటని ‘కార్పొరేట్’ పాఠశాలలు హైదరాబాద్ అంతటా పాశ్చాత్య సంస్కృతి పాపపు పుట్టలవలె విస్తరించి ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి! తెలుగు అక్షరాలు రాని ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులు నగరాలలోను, పెద్ద పట్టణాలలో ప్రతి ఇంటా ఉన్నారు! ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ అన్న మాటలను వీరు చదవలేరు! ఇంజనీర్లు, డాక్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిలో సైతం ఎక్కువ శాతం మంది తెలుగు వ్రాయలేరు.. తెలుగు వెలుగుతోందా? కొడిగట్టి ఉందా?
వేసవి సెలవులలోనైనా తమ పిల్లలకు తెలుగు అక్షరాలను నేర్పించడానికి శ్రద్ధవహిస్తున్న తెలుగు వారి సంఖ్య బహు తక్కువ! అందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూనుకొని వేసవి సెలవుల్లో నెలరోజులపాటు తెలుగు అక్షరాలను, తెలుగు పదాలను, తెలుగు పాటలను, తెలుగు పద్యాలను నేర్పించడానికి వీలుగా పట్టణాలలోను, నగరాలలోను శిబిరాలను, శిక్షణ తరగతులను నిర్వహించాలి.. ‘సిబిఎస్‌సి’ వంటి అఖిల భారత స్థాయి పాఠ్య ప్రణాళికలను బోధిస్తున్న పాఠశాలల్లో సైతం తెలుగును విధిగా నేర్పించాలన్న నిబంధనను ఈ విద్యా సంవత్సరం నుంచైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అ మలు జరపాలి! కర్నాటకలోను, మహారాష్టల్రో ను ఒడిశాలోను ఇప్పటికే ఇలాంటి నిబంధనను అమలు జరుపుతున్నారు! అందువల్ల ‘సిబిఎస్‌సి’, ‘మైనారిటీ’ తదితర అన్ని పాఠశాలల్లోనూ కనీసం ఒకటినుంచి పదవ తరగతి వరకు విధిగా రోజూ ఒక ‘కాలాంశం’- పీరియడ్- తెలుగును బోధించడానికి కేటాయించాలన్న నిబంధనలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకని అమలు జరుపరాదు? తెలుగు అక్షరాలు రాని పిల్లలు తెలుగును మాట్లడడాన్ని కూడా నిషేధిస్తున్న ‘కార్పొరేట్’ పాఠశాలలను ప్రభుత్వాలు ఎందుకని మూసివేయించరాదు? పాఠశాలల ప్రాంగణాలలో పొరపాటున తెలుగు మాట్లాడిన ‘బాల నేరస్థుల’కు పంతలమ్మలు, పంతుళ్లూ శిక్షలు విధిస్తున్నారు. ‘ఐ డోంట్ స్పీక్ టెలుగూ’-నేను ‘టెలుగు’ను మాట్లాడను- అని కనీసం పాతికసార్లు ఇంగ్లీషులో వ్రాయమనడం వంటివి చూస్తున్నాం...
ప్రపంచంలోని తెలుగు వారిని ఒకే చోట సమావేశపరచడం భాషా పరిరక్షణకు విస్తృతికి మా ధ్యమం.. కానీ, మన ఇళ్లలోనే తెలుగును నిరంతరం ఇంగ్లీషు పదాలతో సంకరం చేస్తున్నాము. ప్రతి వాక్యంలోను కనీసం ఒక ఆంగ్ల పదమైనా వాడడం ‘పరమాన్నం’లోకి వేసిన ఇంగువ తిరగమోత వలె ఇంటింటా గుబాళిస్తున్న వైపరీత్యం! ‘డీప్ ఫ్రయిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లేదు...’ అన్న అమ్మమ్మగారి ప్రకటన పరాకాష్ఠ. ‘డీప్ ఫ్రయిడ్ ఫుడ్’ అని అంటే ‘నూనెలో వేయించిన తిండి...’. నన్నయ భట్టారకుడు తెలుగును సంస్కృత భాషతో సంకరం చేశాడని ఆ మధ్య ఒక ‘విబుధ దైత్యుడు’ గట్టిగా రోదించాడు. కానీ తెలుగును, ఆంగ్లంతో మహా సంకరం చేస్తున్న వర్తమానం మాట ఏమిటి?