సబ్ ఫీచర్

బోధన - పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైజాం కాలంలో తెలంగాణ జిల్లాల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండటానికి కారణాలు ఏమిటి? దాని వెనక వున్న రహస్యమేమిటి? ఆనాడు విద్యాశాఖను నిర్వహించిన మంత్రుల దూరదృష్టి గొప్పది. ఆదర్శ విద్యా విధానాన్ని రూపొందించడంలో వారి దీక్షకు ఇప్పటికీ నేను సలాం చేస్తాను. విద్య కొంతమందికే అందినప్పటికీ ప్రమాణాలు గల చదువును వారికి నేర్పించారు. ఉపాధ్యాయుల నియామకమే అందుకు బలమైన పునాదిగా నిలుస్తుంది.
మహిళా టీచర్లు పల్లెలకు వెళ్లి పనిచేయాలంటే మగ ఉపాధ్యాయులకిచ్చే జీతం కన్నా హయ్యర్‌గ్రేడ్ స్థాయిలో ఇచ్చే జీతాన్ని నిజాం ప్రభుత్వం ఇచ్చింది. అందుకే ఆంధ్రా ప్రాంతం నుంచి సమర్థులైన టీచర్లు తెలంగాణకు వచ్చారు. టీచర్ల నియామకంలో ప్రతిభే గీటురాయి. అవసరమైతే నిబంధనలను సవరించి సమర్థులైన టీచర్లను నియమించేవారు. ఉదాహరణకు నా సహ ఉపాధ్యాయుడు పూర్వాషాఢ ఇద్దరు అక్కలు అశే్లష, మృగశిరలు బీదరులో టీచర్లుగా పనిచేశారు. ప్రభుత్వం వారు సమర్థులైన ఉపాధ్యాయులను నియమించటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాధ్యాయ శిక్షణ లేకున్నప్పటికీ ఆ అభ్యర్థికి మంచి విద్యా నేపథ్యం, ప్రతిభ ఉంటే నేరుగా నియమించారు. నాలుగైదు ఏళ్ళ తర్వాత ఆ వ్యక్తి ఆసక్తిని పరిశీలించి ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ ఇప్పించేవారు. డిగ్రీ కాలేజీల తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, యోగ్యతలను నిర్ణయించే అధికారం విశ్వవిద్యాలయాల అధీనంలోనే జరుగుతాయి. చాలామంది ఉపాధ్యాయులు విద్యారంగంలోనే రీసెర్చి చేసి విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా నియమించబడ్డారు. ఉపాధ్యాయులకు పరిశోధన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వమే ప్రోత్సహించేది.
ఉపాధ్యాయులకు పరిశోధన చేసే అవకాశం ఉంటేనే కొత్త కోణాలను విద్యార్థులకు అందించగలుగుతారు. అందుకే బోధనను, పరిశోధనను విడగొట్టలేం. టీచర్‌కు నిరంతరం విద్యపై జ్ఞానతృష్ణ ఉంటేనే వచ్చే తరంలో జ్ఞానతృష్ణను రగిలించగలుగుతారు. ఇప్పు డు బోధనను, పరిశోధనను విడగొట్టారు. అందుకే విద్యా ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయి. అందుకే ఆనాటి ఉపాధ్యాయులు నేడు కనిపించటం లేదు. ఈ విషయాన్ని గమనించి యుజిసి ఎఫ్.ఐ.సి ప్రోగ్రాంను ఉపాధ్యాయులకు కల్పించింది. నేను సిద్ధిపేట కళాశాలలో ఉన్నప్పుడు 10 మంది ఇన్ సర్వీస్ లెక్చరర్లు పిహెచ్‌డిలు చేశారు. దానివల్ల విద్యా ప్రమాణాలు పెరగటానికి అవకాశం కలిగింది. అందుకే ఆ కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులు వర్సిటీల్లో లెక్చరర్లుగా కనపడుతున్నారు. కాలక్రమేణా బోధనను, పరిశోధనను వేరు చేస్తూ వచ్చారు. బోధనను పరిశోధన కంటే తక్కువగా చూస్తే విద్యాప్రమాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? విద్యా ప్రమాణాలు పెంచాలన్నప్పుడల్లా బడులకు సున్నాలు వేయటం కాదు, ప్రమాణాలు పెరగాలంటే బోధనలో సంపూర్ణంగా మార్పు జరగాలి. గత పదేళ్లుగా టీచింగ్‌లో మార్పు లేదు. కాబట్టి ప్రమాణాలు పడిపోవటానికి అదే కారణభూతమైంది. ప్రమాణాలు పెంచదలుచుకుంటే విశ్వవిద్యాలయాలకు, పాఠశాల విద్యకు మధ్య సమన్వయం ఉండాలి. ఆధునిక బోధనా పద్ధతులు మన తరగతి గదికి రావాలి. బోధనలో కొత్త భావాలు వస్తేనే మారుతున్న సమాజం పోకడలను అందుకోగలుగుతాం. విద్యా శాఖ నిరంతరం ప్రవహించే జ్ఞాననదిలా ఉండాలి.

- చుక్కా రామయ్య