ఉత్తరాయణం

అదుపు లేని నీటి కల్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశుభ్రమైన నీటిని తాగేందుకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నందున వాటర్ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వేసవి కాలం కల్తీ వాటర్ కంపెనీలకు వరంగాను, ప్రజలకు శాపంగానూ మారింది. మినరల్ వాటర్ ప్లాంట్ యూనిట్లను ప్రారంభించాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, గ్రామాల్లో సైతం కొంతమంది ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్‌పై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్, బ్యాచ్ నంబర్లు ముద్రించకుండానే మార్కెట్‌లో విక్రయాలు జరుపుతున్నారు. శుద్ధిచేయని సాధారణ నీటిని ప్యాకెట్లు, బాటిల్స్‌లో నింపి ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు ఖర్చుకు వెనుకాడకుండా చాలామంది మంచినీటి ప్యాకెట్లు, బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. అధికారుల నిఘా లేనందున వాటర్ ప్లాంట్లలో నీరు నాణ్యతారహితంగా ఉంటోంది. అడిగేవారు లేకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయి. తగిన అవగాహన, ఆలోచన లేని ప్రజలు వాటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం పూనుకొని పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లపై దృష్టి సారించాలి.
-జి.అశోక్, గోధూర్ (జగిత్యాల జిల్లా)
ప్రమాదాలను నివారిద్దాం
నేటి యువతీ యువకులు సాటివారితో పోల్చుకోవటం, గతంలో కన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, అవసరం లేకపోయినా వాహనాలు కొనడం, తల్లిదండ్రులు పిల్లలను గారాబం చేయటం వంటి కారణాలతో అనేక విపరిణామాలు సంభవిస్తున్నాయి. మితిమీరుతున్న రోడ్డు ప్రమాదాలకు ఈ పరిణామాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. వచ్చీ రాని డ్రైవింగ్‌తో వేలాది మంది మైనర్ యువకులు ఏటా ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు గుండెకోత మిగిలుస్తున్నారు. 15 ఏళ్లు నిండని వారు సైతం బైకులు, కార్లు నడుపుతూ తమ ప్రాణాలే గాక ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రభుత్వమైనా తన బాధ్యతగా చట్టాలను సక్రమంగా అమలుచేసి ప్రమాదాలను నివారించాలి. మైనర్లు వాహనాలు నడిపితే భారీ జరిమానాలు విధించి తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలి. పదే పదే తప్పు చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించాలి. జరిమానాలు విధించడమే గాక ట్రాఫిక్ నిబంధనలపై అన్ని వర్గాలకూ అవగాహన కల్పించాలి. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో వేసవి కాలంలో పిల్లలు చెరువుల వద్దకు సరదాగా ఈతకు వెళ్ళటం, నీట మునిగిపోయి ప్రాణాలు కోల్పోటం తరచూ జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే నీరు ఎక్కువ వున్న చెరువులకు కాపలా పెట్టించాలి. ప్రవేశపు దారి వైపు మూడు అడుగుల లోతు దాటిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ఇది పెద్ద ఖర్చుతో కూడిన సమస్య కాదు.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట