మెయన్ ఫీచర్

చైనా చప్పుళ్లకు బెదరని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటిష్ఠంగా అమలవుతున్న భారత విదేశాంగ విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ఖండంలో రాజకీయ ఆర్థిక అంశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇందుకు సాక్ష్యం రెండు ప్ర ముఖ ఘటనలు. ఒకటి- విస్తృత ప్రాతిపదికన చైనా తలపెట్టిన ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ సదస్సును భారత్ బహిష్కరించడమే కాక తన చర్యకు కీలక ఆర్థిక శక్తుల మద్దతును కూడగట్టగలిగింది. చైనా ఆర్థిక విస్తరణ కాంక్షను చిన్న చిన్న దేశాలకు తెలియజెప్పి తద్వారా ఏర్పడే ప్రమాదాలను వారికి వివరించి ఆయా దేశాలను తన వైపునకు తిప్పుకోగలిగింది. రెండవది- భారత పౌరుడు, ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కులభూషణ్ జాధవ్‌ను గూఢచారిగా చిత్రిస్తూ ఆయనకు అన్యాయంగా పాకిస్తాన్ ఉరిశిక్ష ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ హేగ్ నగరంలోని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు సమర్ధవంతమైన వాదనలు వినిపించి ఆ ఉరితీతను భారత్ ఆపించగలిగింది. పాకిస్తాన్ దుందుడుకు, రెచ్చగొట్టే విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టడంలో భారత్ పూర్తిగా విజయవంతమైంది.
ఆసియా, ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ఖండాలను కలుపుతూ ఉపరితల, సముద్ర వాణిజ్య మార్గాల నిర్మాణాన్ని చైనా దేశం తలపెట్టింది. డజన్ల కొద్దీ దేశాల మీదుగా ఈ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మార్గం వెంట అన్ని వౌలిక సౌకర్యాలను నిర్మిస్తారు. చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్’ (బిఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ పథకంలో ప్రధానంగా ఆరు కీలక రహదారులను నిర్మిస్తారు. ఇందులో అంతర్భాగంగా రైల్వేలైన్లు, రహదారులు, ఓడరేవులను నిర్మిస్తారు. పెద్దఎత్తున విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయ వాణిజ్య వేదికగా చైనా నిర్వహించిన ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ సదస్సును భారత్ బహిష్కరించడం సాహసోపేతమైన చర్య. 65 దేశాల ప్రతినిధులు, దాదాపు 20 దేశాల అధిపతులు పాల్గొన్న సదస్సును తిరస్కరించిన భారత్ దీనికి దీటుగా జపాన్‌తో కలిసి ‘గ్రేట్ వాల్’ నిర్మాణం తలపెట్టింది. చైనా ఆర్థిక విస్తరణ వాదానికి వ్యతిరేకంగా మన సరిహద్దుల్లో ఉన్న శ్రీలంక, భూటాన్ లాంటి దేశాల మద్దతును కూడగట్టుకోగలిగింది. తన దేశ సార్వభౌమత్య పరిరక్షణకు ఎట్టి పరిస్థితుల్లోను ఎంతటి వారితోనైనా రాజీ పడబోమని భారత్ ప్రపంచదేశాలకు స్పష్టంగా తెలియజెప్పింది. వన్ బెల్ట్ వన్ రో డ్ పథకంలో కీలకమైన ‘చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ (సిపిఇసి)లో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుండి వెడుతుంది. భారతదేశ అనుమతులు లేకుండా భారత్ భూభాగం అయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా రహదారి నిర్మాణాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది కచ్చితంగా భారతదేశ సార్వభౌమత్య అంశంలో జోక్యం చేసుకోవడమే అని మోదీ ప్రభుత్వ వాదన. ‘తన దేశపు సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సరిహద్దులను సవాల్ చేసే ప్రాజెక్టులను ఏ దేశం సహించదు. ఓబిఓఆర్‌లో అంతర్భాగమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంపై భారత్ వైఖరి ఇప్పటికే ప్రపంచానికంతా తెలుసు. ఈ అంశంపై ఇప్పటికే తన విధానాలను ప్రకటించిన భారత్ చైనాతో అర్థవంతమైన, ప్రయోజనకరమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నది. ఈ అంశంపై చైనా సగుణాత్మకంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం’- అని భారత ప్రభుత్వం చేసిన విస్పష్టమైన ప్రకటన మనదేశపు మనోస్థైర్యాన్ని, నైతిక బలాన్ని తెలియజేస్తున్నది.
వివిధ రంగాలలో భారత్ ప్రగతిని అడ్డుకోవడంలో పాకిస్తాన్‌తో సమానమైన పాత్రను చైనా కూడా పోషిస్తున్నది. ఐక్యరాజ్యసమితికి చెందిన ‘న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్’లో భారత్‌కి సభ్యత్వం రానీయకుండా చైనా అడుగడుగునా అడ్డం పడుతున్నది. కరడుగట్టిన జిహాదీ తీవ్రవాది మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించి భారత్‌కు అప్పచెప్పాలని లేదా అతనిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని భారత్ చేస్తున్న డిమాండ్లకు చైనా అడ్డుపడుతూ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తున్నది. మన భౌగోళిక భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. భారత్ ప్రగతికి అడుగడుగునా అడ్డు తగులుతున్న చైనాతో ఢీకొట్టడానికి మన ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. గతంలోని ప్రభుత్వాలు అనుసరించిన మెతక విదేశాంగ విధానానికి భిన్నంగా మోదీ ప్రభుత్వం స్థిరమైన కఠినమైన విధానాలను అమలు చేస్తున్నదనడానికి ప్రస్తుత చర్య ఒక నిదర్శనం. వన్ బెల్ట్ వన్ రోడ్ పథకం చైనా వస్తువుల మార్కెటింగ్‌కు అత్యంత కీలకమైన పథకం. 2013లో చైనా అధినేత షీలిన్ పింగ్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఇందులో రెండు ప్రధాన మార్గాలున్నాయి. చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లోని చబర్ నౌకాశ్రయం వరకు ఉపరితల రవాణా మార్గం ఒకటైతే, సముద్ర మార్గాల నిర్మాణం మరొక భాగం. అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి, అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించడానికి చైనా పన్నిన విస్తృత పథకాన్ని భారత్ సవాల్ చేసింది.
బెల్ట్ అండ్ రోడ్ సదస్సు పేరిట చైనా ఏర్పాటు చేసిన కార్యక్రమం పాక్షికంగానే విజయవంతం అయిందని చెప్పుకోవాలి. పేరుకు అనేక దేశాలు ప్రాతినిధ్యం వహించాయని చెప్పుకున్నప్పటికీ ఆయా దేశాలు తమ దేశానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక బృందాలను ఈ సదస్సుకు పంపలేదు. వచ్చిన సభ్యులందరూ ఈ సదస్సు వల్ల తమకేం లాభం జరుగుతుందనే దృక్పథంతో వచ్చినవారే. ఆర్థిక ప్రయోజనాలే వీరి ప్రాతినిధ్యానికి ప్రధాన కారణం. చైనాతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను బేరీజు వేసుకోవడానికే వారు వచ్చారు. కొన్ని చిన్న చిన్న దేశాలు తమ సొంత నిధులతో వౌలిక అవసరాలను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నాయి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కొన్ని దేశాలవారు వచ్చారు. ఇదే అంశాన్ని సాకుగా మార్చుకుని ఆయా చిన్న దేశాలను వలస దేశాలుగా మార్చుకోవాలన్న దురుద్దేశం కూడా చైనాకు లేకపోలేదు. మిగిలిన అన్ని దేశాల కంటే పాకిస్తాన్ మాత్రం ఈపథకం పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. సిపాఇసి ద్వారా ఆర్థిక సైనిక ప్రయోజనాలను పొందగలనని పాకిస్తాన్ భావిస్తున్నది. ఈ పథకం వల్ల పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతుందని, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయని, దాదాపు అంతర్యుద్ధం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతాయని పాకిస్తాన్ మేధావులే హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం. సదస్సులో పాల్గొన్న మిగిలిన దేశాల ప్రతినిధులు కూడా ఇటువంటి భయాలనే వ్యక్తం చేసారు.
చైనా తలపెట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ పథకం నిజానికి కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఇటువంటి రహదారులు వినియోగంలో ఉన్నాయి. వీటిని మెరుగు పరచాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి వీటిని చేర్చాల్సిన ఉన్నది. బిసిఐఎం (బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్)ల మధ్య రోడ్డు నిర్మాణం విషయమై భారతదేశం బంగ్లాదేశ్‌తో చర్చలు జరిపి నిర్మాణం పనులను మొదలుపెట్టింది. ఈశాన్య భారతంలో రోడ్లను వేగంగా నిర్మిస్తున్నారు. మయన్మార్‌తో కనెక్టివిటీకి ఈ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓబిఓఆర్ పేరిట అడుగడుగునా చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం ఆయా దేశాల వారిని భయాందోళనలకు గురి చేస్తున్నది. ఈ పథకం నిర్మాణం కోసం చైనా పౌరులను ఆయా దేశాలకు పంపడం, వీరి రక్షణ కోసం సైనికులను ఏర్పాటు చేయడం వల్ల తమ దేశాల్లో సామాజిక స్థితిగతులు ఆందోళనకు గురి అవుతాయన్నది వీరి భయం. చైనా ఒత్తిడులకు లొంగే ప్రసక్తే లేదని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు హాజరు కాకపోతే ప్రపంచ దేశాల మధ్య భారత్ ఒంటరి అయిపోతుందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం ఈ సదస్సులో పాల్గొనేలా చూడాలని చైనా ప్రతినిధులు విశ్వప్రయత్నం చేసారు. కానీ, చైనా ఒత్తిడులను భారత్ ఆమోదించలేదు. తమ దేశపు సార్వభౌమత్వమే తమకు అత్యంత ప్రముఖమని తేల్చి చెప్పింది. చైనా బెదిరింపులకు లొంగకుండా బౌద్ధ మతగురువు దలైలామాను అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది. ఇంతేకాకుండా అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం దలైలామాను ధర్మశాలలో కలుసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసింది. భారత్ చర్యల పట్ల చైనా కొద్దిగా కలత చెందిందనడం అతిశయోక్తి కాదు.
అభివృద్ధి చెందిన దేశాలు మొదట్లో ఈ సదస్సులో పాల్గొనడానికి అంతగా ఉత్సాహం చూపలేదు. యూరోప్‌లో శక్తివంతమైన ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ తదితర దేశాలు సదస్సు ప్రకటనపై సంతకాలు చేయడానికి నిరాకరించాయి. ఈ పథకం రూపకల్పనలో పారదర్శకత లేదని, ఇందులో కనపడని పన్నాగాలు ఉన్నాయని ఆయా దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఒబిఒఆర్ పథకంలో ఉత్తర కొరియాకు పెద్దపీట వేయడం చైనా దుష్ట పన్నాగాలను బహిర్గతం చేసింది. ఉత్తర కొరియా-చైనాల మధ్య భీకర వాతావరణం నెలకొని ఉంది. ఉత్తర కొరియాపై చైనా అనేక నిషేధాలు విధించింది. అటువంటిది ఈ సదస్సులో ఉత్తర కొరియాకు ప్రాధాన్యతనీయడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. చైనా తలపెట్టిన ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి ఎవరికి చెందుతున్నదన్న విషయంలో కూడా అనేక అనుమానాలున్నాయి. ఆయా దేశాలకు మేలు జరుగుతుందా? చైనా బలపడుతుందా? అన్న అనుమానాలు పలువురిని పీడిస్తున్నాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించింది. దీనికి తోడు ‘ఇండియా ఫస్ట్’ విధానానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ రెండు విధానాలను దృష్టిలో ఉంచుకుని చైనా సదస్సును భారత్ బహిష్కరించి ప్రపంచ దేశాల మధ్య ‘హీరో’గా నిలబడింది. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113