Others

ఆదర్శప్రాయం ఝార్ఖండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకట్టుకునే నినాదాలు, గొప్ప ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రన లైంగిక సమానత్వం, మహిళా సాధికారత సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి లైంగిక సమానత్వం, మహిళా సాధికారత వంటి పదాలను పదే పదే వల్లెవేస్తూంటాయి. మహిళా సాధికారత పట్ల మన పాలకులకు చిత్తశుద్ధి లేదు. సుదీర్ఘ కాలంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న ‘మహిళా బిల్లు’ ఇందుకు తిరుగులేని నిదర్శనం. భారతీయ సమాజంలో పురుషాధిక్యత అనాదిగా వేళ్ళూనుకుపోయి ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించిన పురుషాధిక్యత అనే వటవృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించడం అంత సులువుకాదు. మహిళా సాధికారత లభించాలంటే ముందుగా వారికి ఆర్థికపరమైన స్వాతంత్య్రం లభించాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబీర్ సింగ్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొన్నారు.
మహిళల పేరుమీద స్థిరాస్తుల కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఝార్ఖండ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. స్థలం లేదా పొలం, ఇంటిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకొనే సమయంలో సదరు ప్రాంతంలో మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వానికి చెల్లించాలి. మహిళల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులను మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఝార్ఖండ్ ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నది.
మన దేశంలో లైంగిక వివక్ష ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఝార్ఖండ్ ఒకటి. ఆడశిశువులు జన్మించకుండా అక్కడ భ్రూణహత్యలు కూడా ఎక్కువే. ఈ పరిస్థితులను మార్పు చేయడానికి ఝార్ఖండ్ ప్రభుత్వం ఒక్క రూపాయికే మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వలన మహిళల ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడటంతోపాటు, భ్రూణహత్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఝార్ఖండ్ మాదిరిగా మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై ఛార్జీలను రద్దుచేస్తే మహిళ పరిస్థితి మరింత మెరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి చర్యల వలన లైంగిక సమానత్వంతోపాటు, మహిళా సాధికారకతను కూడా భవిష్యత్తులో సాధించే అవకాశాలు ఉన్నాయి.

-పి.హైమావతి