ఉత్తరాయణం

దౌష్ట్యానికి దౌత్యంతో బదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత మాజీ నౌకాదళాధికారి కులభూషణ్ జాధవ్‌ను అన్యాయంగా దోషి అని తేల్చి ఉరిశిక్ష ప్రకటించిన పాకిస్తాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో భంగపాటు కలగడం భారత దౌత్య విజయం. తద్వారా భారత్ న్యాయ దృష్టికి, నియమం తప్పని నడతకు గౌరవం పెరగడమే కాక, పాకిస్తాన్ కుటిల నీతి నగ్న స్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టినట్లయింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో పదకొండుమంది న్యాయమూర్తుల బెంచ్ ఏకాభిప్రాయంతో పాకిస్తాన్ పోకడను తప్పుపడుతూ, ఆ దేశం జాధవ్‌కు విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం పాకిస్తాన్‌ని తీవ్రంగా మందలించినట్టే లెక్క. దళసరి చర్మం దేశానికి ఇలాంటి అవమానాలు అలవాటే అయినా ఈసారి దులుపుకుపోవడం మాత్రం అంత సులభం కాదు. భారత్ తనెంత నష్టపోయినా ఏనాడూ అంతర్జాతీయ న్యాయ నియమాల్ని ఉల్లంఘించలేదు. ముంబయి తీవ్రవాద దాడుల్లో అన్ని సాక్ష్యాధారాలతో పట్టుబడ్డ పాక్ జాతీయుడు, తీవ్రవాది కసబ్ పట్ల కూడా మన దేశం హుందాగానే వ్యవహరించింది. విచారణల్లో న్యాయ సహాయం నిందితుడికి లభించేలా చూసింది. పట్టుబడ్డ ఏ విదేశీ విషపు నాగు పట్లనైనా సహజ న్యాయసూత్రాలకనుగుణంగానే వ్యవహరించింది. తమపై దాడి చేసి, పారిపోయి పాక్‌లో అతిథి మర్యాదలు పొందుతున్న తీవ్రవాదుల జాతకాల్ని సవివరంగా చూపి సహనంతో న్యాయ పోరాటం చేస్తోంది తప్ప నియమాల్ని ఉల్లంఘిద్దామని భావించలేదు. ఈ వైఖరికి పూర్తి భిన్నమైనది పాక్ ధోరణి. భారత పౌరుడు జాధవ్‌ని ఎక్కడ ఏ అభియోగాలతో అరెస్టు చేశారో, ఏం దర్యాప్తు చేశారో, ఏ సాక్ష్యాలతో దోషిగా తేల్చారో అంతా రహస్యం. ‘ఆయన దేశద్రోహానికి పాల్పడ్డాడం’టూ ఎకాఎకీ మరణశిక్షని వారి సైనిక న్యాయస్థానం విధించి నిర్ణయాన్ని వెంటనే చెప్పేస్తుంది. శిక్ష ప్రకటించిన తర్వాతనైనా జాధవ్‌తో మాట్లాడే అవకాశం కూడా భారత్‌కి ఇవ్వరట. ఈ ఉదంతంలో పాక్ అక్కసు, కడుపుమంట తప్ప వేరే నీతి నియమం కనబడటం లేదు. వారి ఉద్దేశమల్లా భారత్ కూడా తమలాగే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుందని లోకాన్ని నమ్మించడమే. భారత్ ఇదే తీరును మున్ముందూ కొనసాగించాలి. జాధవ్ విషయంలో అంతిమ న్యాయం పొందేవరకూ అందుబాటులో ఉన్న అన్ని దారుల్నీ వాడుకోవాలి. నైతిక బలాన్ని పెంచిన ఈ దౌత్య విజయం మరిన్ని విజయాలకు ప్రేరణ కావాలి.
-డివిజి శంకర్‌రావు, పార్వతీపురం
విశాఖపై రైల్వేశాఖ వివక్ష
ఒడిశా అంటే రైల్వే శాఖకు ఎంత ఘాటు ప్రేమో ఈ ఉదంతం వల్ల స్పష్టమవుతుంది. కొద్దిరోజుల క్రితం ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ చేసిన ట్వీట్‌కి రైల్వే మంత్రి సురేష్ ప్రభు క్షణాల్లో స్పందించి పచ్చజెండా ఊపారు. పూరి నుంచి కోణార్క్‌కు రైల్వే లైన్ వేయాలని, పర్యాటక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పట్నాయక్ పంపిన ట్వీట్‌కి మరుక్షణంలోనే ప్రభు సమ్మతించడం ఆశ్చర్యకరమే. ఈ లైన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులిస్తుందని నవీన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేస్తోంది. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’గా పేరుపొందిన విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకై దశాబ్దాల తరబడి ప్రజలు నిరసనోద్యమాలు చేపడుతున్నా అది బధిరుల ముందు శంఖారావమే అయింది. ఒడిశాకు ఆదాయం తగ్గిపోతుందని విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం లేదనే ఆరోపణలు నిజమే కావచ్చు. రైల్వే ఇకనైనా వివక్షను విడనాడి విశాఖకు న్యాయం చేయాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు