సంపాదకీయం

సమీకృత శుల్కం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తువులపై, సేవలపై దేశమంతటా సమాన శు ల్కాలను వసూలు చేయడానికి వీలు కల్పించే ‘సమీకృత వాణిజ్య వ్యవస్థ’ ఏర్పడడం విప్లవాత్మక రాజ్యాంగ పరిణామం. రెండేళ్లపాటు ఊరించిన ఈ ‘వస్తుసేవల పన్నుల’- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జిఎస్‌టి- వ్యవస్థ జూలై ఒకటవ తేదీ నుంచి అమలుకానుంది. జనజీవనంపై ఈ నూతన పన్నుల వ్యవస్థ చూపనున్న ప్రభావం ఏమిటన్నది వేచి చూడదగిన అంశం. వస్తువుల ధరలు, సేవల శుల్కాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉండడం వల్ల దశాబ్దుల పాటు కొనసాగిన ఆర్థికపరమైన గందరగోళం తొలగిపోనుంది. ‘వస్తుసేవల పన్నుల నిర్ణాయక మండలి’- జిఎస్‌టి కౌన్సిల్-లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన భాగస్వామ్యం ఉండడం ‘స మాఖ్య’-ఫెడరల్- స్ఫూర్తికి నిదర్శనం. నిర్ణయాలను ఇలా సర్వ సమ్మతి ప్రక్రియ ద్వారా తీసుకొనడం సామరస్య దోహదకరమైన రాజ్యాంగ పరిణామం. వందలాది వస్తువుల ధరలు, వివిధ సేవలకు వినియోగదారులు చెల్లించాల్సిన శుల్కాలు దేశమంతటా ఒకే విధంగా ఉండడం ‘ఆర్థిక సమీకృతి’కి దోహదకరం. అందువల్ల సమైక్య జాతీయ జీవన స్ఫూర్తికి భంగకరం కాని పద్ధతిలో ‘స మాఖ్య’-ఫెడరల్- సిద్ధాంతం అమలు జరగడానికి ‘జిఎస్‌టి’ దోహదం చేయగలదు. ‘జిఎస్‌టి’ వ్యవస్థను రూపొందించే ప్రక్రియ నెలల తరబడి కుంటినడక నడవడానికి,కూలబడిపోడానికి ప్రధాన కారణం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ అధికారాల గురించి పట్టు పట్టడం. ‘జిఎస్ టి’వల్ల కేంద్ర ప్ర భుత్వం ఏకపక్షంగా వ్యవహరించడానికి అవకాశం ఏర్పడుతుందని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రచారం. భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో లేని రా ష్ట్రాల ప్రభుత్వాలు ఈ ‘అధికార’ సమస్యను మరింత తీవ్రంగా ప్రచారం చేశాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలను, జాతీయస్థాయి ప్రతిపక్షాలను ‘జిఎస్‌టి’కి అనుకూలంగా మార్చడానికి కేంద్ర ప్ర భుత్వం అత్యంత సహనంతో సుదీర్ఘకాలం ప్రయత్నించడం రాజకీయ సయోధ్య ఏర్పడడానికి, పార్లమెంటులో ‘బిల్లు’కు ఆమోదం పొందడానికి దో హదం చేసింది. ‘జిఎస్‌టి కౌన్సిల్’లో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం ఏర్పడడం రాష్ట్రాల అధికారానికి, సమాఖ్య స్ఫూర్తికి రక్షణ లభించింది. ‘జిఎస్‌టి కౌన్సిల్’ సమావేశాల్లో పన్నుల స్వరూప స్వభావాలపై అనేక రోజుల పాటు ఏకాభిప్రాయం కుదరక పోవడానికి కారణం కూడ రాష్ట్రాల ప్రభుత్వాలు పదే పదే భిన్నస్వరాలను వినిపించడం. ఇలా భిన్నస్వరాలను వినిపించడం కూడ ‘సమాఖ్య’ స్ఫూర్తికి అనుగుణమైన పరిణామక్రమం. చివరికి రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య ఏకాభిప్రాయం కుదరడం సమైక్య భావానికి భంగం లేని ‘సమాఖ్య’ స్ఫూర్తి వెల్లివిరిసిందనడానికి మరో ధ్రువీకరణ!
రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను ఏకపక్షంగా రుద్దకపోవడం లేదా రుద్దలేక పోవడం ‘పన్నుల’ సమీకృత వ్యవస్థ ద్వారా ప్రస్ఫుటిస్తున్న ‘సమాఖ్య’ స్ఫూర్తి. గురు, శుక్రవారాల్లో జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జరిగిన ‘జిఎస్‌టి కౌన్సిల్’ సమావేశంలో ఈ వాణిజ్య ‘సమాఖ్య’ స్ఫూర్తి ప్రస్ఫుటించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులను విపక్షాలు కాని విమర్శించడానికి వీలులేని ‘సమైక్య’ స్ఫూర్తి కూడ ప్రస్ఫుటిస్తోంది. ఇలా ‘సమైక్యం’ వౌలిక ప్రాతిపదికగా ‘సమాఖ్య’ ఏర్పడి ఉండడం మన దేశంలో అనాది చరిత్ర. అనేక ‘రాజ్యాలు’ ఏర్పడి ఉండినప్పటికీ ఆసేతు శీతనగం, గాంధారం నుంచి బర్మా పర్యంతం నిర్నిరోధ వ్యాపార వాణిజ్యాలు కొనసాగడం చరిత్ర. ఈ ‘వివిధ రాజ్యాలు’ సాంస్కృతిక సమైక్య వ్యవస్థగా ఏర్పడి ఉండడం కూడ మన అనాది అద్వితీయ జాతీయతకు నిదర్శనం. జాతీయతా ఏకత్వానికి భంగం లేని రీతిలో మన దేశంలో వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్యం కొనసాగింది. విదేశీయ దురాక్రమణదారులు ఈ సమీకృత వ్యవస్థను భగ్నం చేశారు. ‘జిఎస్‌టి’ వ్యవస్థ ఏర్పడడం నిజానికి ఈ ప్రాచీన సమీకృత వాణిజ్య వ్యవస్థ పునరుద్ధరణ వంటిది. మొత్తం దేశం ఒకే వాణిజ్య మండలం...
దేశంలో ఉత్పత్తి అవుతున్న, విక్రయం అవుతున్న అన్ని వస్తువులపైన, వినియోగదారుడు పొందుతున్న సేవలపైన నాలుగు తరగతుల పన్నులు మాత్రమే విధించడంతో వాణిజ్య గందరగోళం తగ్గిపోనుంది. కూరగాయలు, పాల వంటి ఆహార పదార్థాలపై ఎలాంటి పన్ను ఉండక పోవడం వల్ల వాటి ధరలు దేశవ్యాప్తంగా తగ్గిపోతాయట! చక్కెర, వంటనూనెలు, తేయాకు, కాఫీ వంటి వాటిపై ఐదుశాతం పన్ను విధిస్తారట! వీటి ధరలు కూడ తగ్గనున్నాయి. శుద్ధి చేసి నిలువ చేసే అమ్మే తిండి పదార్థాలు- వెన్న, జున్ను, ఎండబెట్టిన పండ్లు, పండ్లరసాలు మొదలైనవి పనె్నం డు శాతం పన్నుకు గురికానున్నాయి. అందువల్ల ఈ పదార్థాల ధరలు యధావిధిగా కొనసాగనున్నాయి. సబ్బులు, అక్కరలేని టూత్ పేస్ట్‌లు, అనవసరమైన రసాయన వాసనలు కొట్టే ‘అలంకరణ’ సా మగ్రి మొదలైన వాటిపై పద్దెనిమిది శాతం పన్నులు విధిస్తారట! విలాసవంతమైన కార్లు, ఆరోగ్యానికి హానికరమైన రసాయన మధుర శీతల పానీయాలపై ఇరవై ఎనిమిది శాతం పన్నులు తప్పవట! ఇలా నాలుగు శ్రేణులుగా మాత్రమే పన్నులు విధించడం వల్ల ధరలు పెంచి దోచుకునే దళారీల పన్నాగం కొంతమేరకు వమ్మయిపోయే అవకాశం ఉంది. వినియోగదారులకు ‘పన్నుల’ పరిజ్ఞానం ఏర్పడడానికి ఈ నాలుగు అంతస్థుల శుల్కాల వ్యవస్థ సులభ మార్గం. వివిధ రకాల సేవలపై కూడ ఇలా నాలుగు రకాల పన్నులు మాత్రమే విధిస్తారు!
‘అత్యవసరాల’ ధరలు తగ్గడం, ‘విలాసాల’, ‘అనవసరాల’, ‘ఆరోగ్య హానికరాల’ ధరలు పెరగడం ‘జిఎస్‌టి’ వ్యవస్థ వల్ల ఏర్పడే దీర్ఘకాల పరిణామం. కానీ చక్కెర, వంటనూనెలపై పన్నులు ‘సున్న’ చేయాలన్నది జనాభీష్టం. అవి కూడ ఆహారంలో భాగం. ఈ వ్యవస్థ వల్ల మొత్తం ఆదాయంలో రాష్ట్రాల వాటా పెరగనుండడం కూడ ‘సమాఖ్య’ స్ఫూర్తి విస్తరించగల పరిణామం. అయితే వ్యాపారులు ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచకుండా నిరోధించే పద్ధతి ఈ వ్యవస్థలో నిహితమై లేదు. ‘జిఎస్‌టి’ స్ఫూర్తిని నీరుకార్చగల ‘అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం’ కొనసాగుతోండడం ఇందుకు కారణం. ఈ ‘అంతర్జాతీయ అనుసంధానం’ ప్రపంచీకరణ వ్యవస్థలో భాగం.. అతిగమించడం ఎలా??