సబ్ ఫీచర్

సాగర జీవాలకు ఎంత కష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రిటన్, స్కాండినేవియా, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న భాగాన్ని ‘నార్త్ సీ’గా వ్యవహరిస్తారు. ఈ ‘నార్త్ సీ’ తీరంలో ఇటీవల ముప్పై వరకు వేల్ చేపల మృత కళేబరాలు కొట్టుకువచ్చాయి. ఆ చేపల కడుపుల్లో భారీగా ప్లాస్టిక్ పదార్థాలు పేరుకుపోవడం శాస్తజ్ఞ్రులను దిగ్భ్రాంతికి గురి చేసింది. జర్మనీలోని శే్లస్వింగ్ హోల్స్టేయిన్ రాష్ట్రంలో ‘వాడెన్ సీ నేషనల్ పార్క్’ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో అందరికీ విస్మయం కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. తీరానికి కొట్టుకువచ్చిన వేల్ చేపల కడుపుల్లో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఒక చేప పొట్టలో 13 మీటర్ల పొడవున్న వలను కనుగొన్నారు. మరో చేప పొట్టలో కార్ల సీట్లు, ప్లాస్టిక్ ముక్కలు దొరికాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలు మెత్తగా వుండడం వల్ల వాటిని ఆహారమనుకుని వేల్ చేపలు మింగి ఉంటాయని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యర్థాలన్నీ సాగర తీర నగరాల్లోని ప్రజలు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ పదార్ధాలే. శే్లస్వింగ్ హోల్స్టేయిన్ రాష్ట్ర పర్యావరణ శాఖా మంత్రి రాబర్ట్ హాబెక్ ఈ విషయమై ఆందోళన చెందుతూ, ‘చేపల కడుపుల్లో వ్యర్థాలు పేరుకుపోవడం మన ఆధునిక ప్లాస్టిక్ నాగరికత దుష్ఫలితాలే. సాగర జీవాలే కాదు, భూమిపై సంచరించే అనేక జంతువులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భావించి తినేస్తున్నాయి. అవి ఎన్నో బాధలు పడి చివరికి చనిపోతున్నాయి’ అన్నారు. ‘్భరీగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను గురించే కాదు, కంటికి కనిపించని వ్యర్థాల వల్ల కలిగే అనర్థాల గురించి కూడా మనం దృష్టి పెట్టాలి. వీటి వల్ల సాగర జీవాలకే కాకుండా ఉభయచర జీవుల మనుగడకు ముప్పు ఉంది’ అని ‘వేల్ అండ్ డాల్ఫిన్ కన్సర్వేషన్’కి చెందిన నికోలా హాడ్మిన్స్ అంటున్నారు.
కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు అరగక చనిపోయిన వేల్ చేపల కళేబరాలు సాగర తీరాలకు కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గ్రీక్ ఐలాండ్స్‌లోని మికనాస్ తీరంలో 2010లో ఒక పిల్ల వేల్ చేప మృతకళేబరం కనిపించింది. దాని పొట్ట కోసి చూస్తే వంద ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వ్యర్థ పదార్థాలు బయటపడ్డాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను మింగేసిన చేపలు, ముఖ్యంగా మగ వేల్స్ విపరీతమైన శరీర బరువు కారణంగా సముద్రంలో ఈదలేక గుండె ఆగి చనిపోయాయని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. విలాస జీవనం పేరుతో నాగరిక మనిషి పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేయడం మాత్రమే కాదు, అవి ఎన్నో అమాయక మూగ ప్రాణులను బలిగొంటున్నాయి. ఒక పర్యావరణ అధ్యయనంలో తేలిందేమంటే- భూమిపై పారవేస్తున్న లేదా డంప్ చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో ఎనభై శాతం సముద్ర జలాల్లోనే కలుస్తున్నాయి. ఇదేదో ఒకరోజో, రెండు రోజుల్లోనో జరగడం కాదు, దశాబ్దాల తరబడి ప్రపంచమంతటా జరుగుతున్న వ్యవహారం. సాగర జలాల, అందులోని జీవాల పరిస్థితి మన ఊహలకందనంత భయంకరంగానే ఉంది. ఒక వేల్ చేప మెదడుతో పోలిస్తే మనిషి మెదడు చాలా చిన్నది. అలాంటిది నేడు భారీ వేల్ చేపల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. తనతోపాటు ఈ భూమిపై జీవిస్తున్న ఇతర ప్రాణుల అస్థిత్వానికి ముప్పు వాటిల్లని విధంగా మనిషి తన మనుగడను మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించనంత కాలం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.

-డి.రాజకిశోర్