ఉత్తరాయణం

పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సరిహద్దుల్లో నానాటికీ పేట్రేగిపోతున్న పాకిస్తాన్ సైనికుల ఆటవిక చర్యలు జంతుబలులను తలపిస్తున్నాయి. మన సైనికులను హతమార్చడమే గాక వారి శరీరాలను ఛిద్రం చేయడం పాక్ సైనికుల పైశాచికత్వానికి పరాకాష్ఠ. గతంలోనూ మన సైనికులను చంపి తలలు నరికి తీసుకుపోయిన ఘటనలు జరిగినా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడంలో భారత్ వెనుకంజ వేస్తోంది. పాక్ సైనికులు వికృత చేష్టలకు పాల్పడినపుడు ఖండించడం, విచారం వ్యక్తం చేయడం తప్ప చేతల్లో మన పౌరుషం కనబడడం లేదు. దీన్ని మన చేతకానితనంగా భావిస్తూ పాకిస్తాన్ మరింతగా రెచ్చిపోతోంది. ఇతర దేశాల్లో అయితే ప్రతీకార చర్యలు తీవ్రంగానే ఉంటాయి. మన సైనికులు అప్పుడప్పుడు జరిపే మెరుపుదాడులకు పాక్ భయపడుతుందా? అరాచకాలకు పాల్పడుతున్న శత్రుదేశానికి తగిన గుణపాఠం చెప్పే సత్తా భారత్‌కు లేదా?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

ఎందుకొచ్చిన కొలీజియం
న్యాయమూర్తుల నియామకం, తొలగింపునకు ఒక హైపవర్ నిష్పక్షపాత కమిటీ ఉండాలని కేంద్రం, అక్కర్లేదు.. కొలీజియం పద్ధతిలో మేమే న్యాయమూర్తులను ఎంపిక చేసుకుంటాం అని సుప్రీంకోర్టు పంతాలు ప ట్టాయి. కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తి కర్ణన్ ఏకు మేకయ్యాడన్న సంగతి తెలిసిందే. తమమీదే దాడి చేస్తున్నా ఏం చేయాలో తోచక, కర్ణన్ పని చేయకుండా కూచోబెట్టి జీతం ఇస్తున్నది సుప్రీం! కర్ణన్‌ను తొలగించాలంటే అతన్ని అభిశంసించమని సుప్రీం పార్లమెంటుకు రికమెండ్ చేయాలి. అలా చేస్తే కొలీజియం డొల్లతనం బయటపడుతుంది. 2,3 నెలలు మిన్నకుంటే కర్ణన్ రిటైర్ అవుతారు. ఆ తర్వాత ప్రస్తుత సుప్రీం చీఫ్ జస్టిస్ రిటైర్ అవుతారు. అంతవరకు మిన్నకుండటమే మేలు. తర్వాత వచ్చేవారు చూసుకుంటారన్నది సుప్రీం పాలసీ కాబోలు.
-పవన్‌పుత్ర, కాకినాడ