సంపాదకీయం

‘స్వచ్ఛత’కు గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలను సంస్కృతీకరించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సాధించగలిగిన వౌ లిక విజయం! సంస్కృతి స్వదేశీయతను ప్రస్ఫుటిస్తోండడం గత మూడేళ్ల చరిత్ర! ‘ప్రజాస్వామ్యం’ అంటే ‘రాజకీయం’ అన్న భ్రాంతి నుంచి సమాజానికి విముక్తి లభిస్తోంది, ‘ప్రజాస్వామ్యం’ ఈ దేశ ప్రజల వౌలిక సంస్కారమన్న వాస్తవం విస్తరిస్తోంది. ఈ వౌలిక సంస్కారం జాతీయ సంస్కృతి! ఈ వౌలిక సంస్కారం ప్రస్ఫుటించే అనేక ప్రక్రియలలో ‘రాజకీయం’ ఒకటి మాత్రమే! ఎన్నికలు, మతదానం, ఫలితాలు, ప్రభుత్వం ఏర్పడడం మాధ్యమం.. లక్ష్యం సంస్కృతి ప్రస్ఫుటించడం! ఈ లక్ష్యసాధనకు ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ నిర్వాహకుల ప్రవర్తన దోహదం చేయడం ప్రజాస్వామ్యం.. సంస్కృతి ఆర్థిక ప్రగతి, భౌతిక సముత్కర్ష స్థితి! కానీ సంస్కృతి ఇది మాత్రమే కాదు, సంస్కృతి బౌద్ధిక మానసిక సంగతి కూడ! ‘ప్రగతి’, ‘సుగతి’ జాతీయ జనజీవన ప్రస్థాన శకటానికి రెండు చక్రాలు! కేవలం ఒక చక్రంతో కాక రెండు చక్రాలతోను ఈ ‘జన జీవన రథాన్ని’ నడిపించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండడం గత మూడేళ్లలో ప్రస్ఫుటించిన వాస్తవం. కృషి ఎంతమేరకు ఫ లించిందన్నది వివాదాంశం కావచ్చు, కాకపోవచ్చు! ‘రాష్ట్రం ప్రజాః’-అన్నది ఈ దేశంలో అనాదిగా వికసించిన ప్రజస్వామ్య భావం! ఈ ప్రజలు ‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః..’- భూమి నాకు తల్లి, నేను ఆమెకు పుత్రుడను-అని భావించడం జాతీయతా స్వభావం! లోక్‌సభలో తొలిసారిగా అడుగుపెట్టిన మోదీ పార్లమెంటు భవనం వద్ద భూమికి నమస్కరించడం ఈ జాతీయ సంస్కార స్వ భావం ప్రస్ఫుటించిన సమయం..
అందరి సహకారం, అందరి అభ్యుయం- అన్నది కేవలం నినాదం కాదన్నది పెద్దనోట్లను రద్దు చేసిన తరుణంలో ధ్రువపడిన వాస్తవం! అవినీతిని నిరోధించడానికి,ఉన్న అవినీతిని తొలగించడానికి జనం గంటల తరబడి బ్యాంకుల వద్ద బారులు తీరి నిలబడడం ‘అందరి సహకారం’, ‘అందరి భాగస్వామ్యం’ అన్న సూత్రానికి ఒక ఉదాహరణ మాత్రమే! ప్రజలు ఇలా ‘దేశం మాకేమిస్తుంది?’ అని కాక ‘మనం దేశానికి ఏమి ఇవ్వగలం?’ అని ఆలోచించి ఆచరించగల సంస్కారవంతులన్న వాస్తవ ధ్రువీకరణకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే! అత్యధిక జనం అనాదిగా ఇలాంటి సంస్కారవంతులు! అయితే సంస్కృతిని రాజకీయం చేసిన విదేశీయ విజాతీయ దురాక్రమణదారులు ప్రజా హృదయాలలో నిరంతరం నిహితమై ఉన్న ఈ సంస్కారాన్ని గ్రహణగ్రస్తం చేసారు. గ్రహణ ముక్తం కావడానికి గత అరవై ఏళ్లకు పైగా స్వదేశీయ పాలకులు చేసింది కూడా శూన్యం! కేంబ్రిడ్జి, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలలో తాము పొందిన లాభాలను గుర్తించి ప్రవచించిన రాజకీయ వేత్తలు మాతృభూమి మట్టినుంచి తమకు లభించగల సంస్కార సుగంధ ధ్యాసను కోల్పోయారు. ఆ ధ్యాస గత మూడేళ్లుగా రాజకీయవేత్తలు ప్రస్ఫుటింప చేస్తున్నారు. అందువల్లనే ప్రజలందరి భాగస్వామ్యం పెరుగుతోంది! ‘రాజునకు ప్రజ శరీరము, రాజు ప్రజలకు రక్ష, రాజున్ ప్రజయన్.. అన్యోన్య విరాజితులై మెలగవలయు..’ అన్న మహాభారతకారుని మాట ‘అందరి సహకారం అభ్యుదయం’-సబ్‌కే సాథ్ సబ్‌కా వికాస్’- అన్న జనతంత్ర సూత్రం! ‘వంట ఇంధనం’పై లభిస్తున్న ప్రభుత్వం వారి ‘రాయితీని’ పరిత్యాగం చేసిన ప్రజలు ఇతరుల మేలు కోరుతున్నవారు! ‘అందరి అభ్యుదయం’ సాధనకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ప్రభుత్వం ప్రజలకిచ్చిన ‘జన్‌ధన్’కు ప్రజల ప్రతిస్పందన ఇది...
మురికి అంటని పరిసరాలు ఏర్పడడం భౌతికమైన ‘స్వచ్ఛ భారతం’, అవినీతి మురికి అంటని పరిపాలన బౌద్ధికమైన ‘స్వచ్ణ భారతం’! పుడమి కాలుష్య రహితం కావడం స్వచ్ఛత, మది మదిలో అవినీతి వ్యతిరేకత రగలడం స్వచ్ఛత! అధికార రాజకీయవేత్తలు అవినీతికి పాల్పడకపోయినట్టయితే ఈ రెండు రకాల స్వచ్ఛత విస్తరించగలదు. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ‘అవినీతి’కి పాల్పడిన అభియోగం లేదు, ప్రతిపక్షాలు సైతం అధికార పక్షంపై అవినీతి ఆరోపణలు చేయలేదు.. ఇదీ ప్రజాస్వామ్య శకటం ‘స్వచ్ఛ భారత్’ పథంలో సాగుతోందనడానికి నిదర్శనం. గంగానదిని కాలుష్య ముక్తం చేయడం కోసం ఒకేసారి నూట నాలుగు చోట్ల రెండు వందల ముప్పయి ఒక్క ‘శుద్ధి’ యంత్ర వ్యవస్థను గత ఏడాది నెలకొల్పడం స్వచ్ఛ భారతం మళ్లీ అవతరిస్తోందనడానికి ప్రతీక! గంగానది స్వచ్ఛతకు ప్రతీక, సంస్కృతికి ప్రతీక, తరతరాలుగా భారత జాతి జీవనయాత్రకు ప్రతీక! గంగానది ప్రతీక మాత్రమే! దేశంలోని దాదాపు అన్ని నదుల నీరు స్నాన యోగ్యంగా, పానయోగ్యంగా మారడం లక్ష్యం! ఈ లక్ష్యం నెరవేరినప్పుడు ‘నీటి’కి అక్రమ వాణిజ్యం నుండి విముక్తి లభిస్తుంది! కాలుష్యం పెంచుతున్నది పరిశ్రమలు మాత్రమే కాదు, కాలుష్యాన్ని విష రసాయనాలను వాడుతున్న వ్యవసాయం కూడ పంచుతోంది, అందువల్ల తరతరాల సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించడం, దేశవ్యాప్తంగా విస్తరింపచేయడం అనివార్యమన్న ధ్యాస పెరగడం గత మూడేళ్ల పరిణామం. సిక్కిం రాష్ట్రంలోని మొత్తం పొలాలలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది! సేంద్రియ వ్యవసాయానికి ఆవు, పాడిపశువులు ప్రాణం! గోసంతతి, పశు సంతతి ప్రాణాలను కాపాడాలన్న ధ్యాస పెరగడం మరో సమాంతర శుభ పరిణామం! ఇదంతా భారతీయ ప్రగతి జీవన స్వచ్ఛత పెరుగుతోందనడానికి నిదర్శనం! ఈ ‘స్వచ్ఛ’ సంస్కారం జాతీయ శ్రమ జీవన యోగం.. అంతర్జాతీయ యోగా దినోత్సవం మన సాంస్కృతిక ప్రభావ విస్తరణకు చిహ్నం! అందరి సహకారం అందరి అభ్యుదయం.. ఇదీ భారతీయ జీవన వేదం....
మన రక్షణ పటిమ పెరగడం, ఇరుగు పొరుగు దేశాలతో మన స్నేహం పటిష్ఠం కావడం గత మూడేళ్ల పాలనకు పతాకం. బ్రహ్మపుత్ర నదిపై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం కావడం ఉత్తర సరిహద్దులకు సరికొత్త పదును పెట్టిన పరిణామం! ఈ ప్రగతి సుగతి విదేశీయ వాణిజ్య దురాక్రమణ కారణంగా సంకరమైపోతుండడాన్ని నిరోధించలేకపోవడం మాత్రం కొనసాగుతున్న అపశ్రుతి. ఈ అపశ్రుతిని తొలగించడానికి సైతం ప్రభుత్వం ఇప్పుడు నడుం బిగించిన సూచనలు కనిపిస్తున్నాయి. ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’-ఎఫ్‌డిఐ-సాధన మండలిని రద్దు చేశారట! దాని స్థానంలో ‘్భరత్‌లో నిర్మించండి’ స్ఫూర్తికి అనుగుణంగా నిధుల, వస్తువుల సేకరణ మండలిని ఏర్పాటు చేస్తున్నారట! సురక్ష, స్వయం సమృద్ధి, స్వావలంబన, స్వదేశీయత పరస్పర పరిపోషకాలు...