సంపాదకీయం

‘ఢోలా నుంచి ఢోలాకు..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాంలో రోహిత్-లోహిత్ నదిపై నిర్మించిన అతి పెద్ద వంతెనపై రాకపోకలు ఆరంభం కావడం ఈశాన్య ప్రాంతాల ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు, మన ఉత్తర సరిహద్దు ‘గోడ’ను మరింత పటిష్ఠం చేయగల ‘తొడుగు’! ‘రోహిత్’- ‘బ్రహ్మపుత్ర’కు ఉపనది. అరుణాచల్‌లో పుట్టి ప్రవహిస్తున్న ‘రోహిత్’ అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో బ్రహ్మపుత్రలో సంగమిస్తుంది. ఈ సంగమ స్థితికి సమీపంలోని ‘్ఢలా’, ‘సదియా’ల మధ్య ‘రోహిత్’పై నిర్మించిన దాదాపు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన వంతెనను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం చారిత్రక ఘట్టం. దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన ప్రారంభం కావడం వల్ల అస్సాం, అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం రెండు నుంచి ఐదుగంటల మేర తగ్గిపోనున్నదట! ఉభయ ప్రాంతాలు మరింత సన్నిహితం కావడమే గాక మన ఉత్తర సరిహద్దుల్లోని సైనికులు మరింత అప్రమత్తం కావడానికి ఈ వంతెన వీలు కల్పిస్తోంది. ఇలా ఈ ‘రోహిత్’ వంతెన ప్రయాణ వారధి, రక్షణ వారధి. ఈ వంతెనకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే భారత-టిబెట్ సరిహద్దు ఏర్పడి ఉంది. మైత్రికి మారుపేరు అయిన యుగయుగాల నాటి భారత-టిబెట్ సరిహద్దు క్రీస్తుశకం పంతొమ్మిది వందల యాబయి తొమ్మిదవ సంవత్సరంలో ‘్భరత-చైనా’ సరిహద్దుగా మారిపోవడం అంతర్జాతీయ వైపరీత్యం. ఈ వైపరీత్యం ఫలితంగానే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ‘మెక్‌మోహన్ రేఖ’ దా టి మన దేశంలోకి చొరబడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చైనా దు రాక్రమణ ప్రమాదం కొనసాగుతుండడం ‘్ఢలా సదియా’ వం తెన ప్రారంభానికి నేపథ్యం. అప్పటి నుంచి ఇప్పటివరకూ ‘అరుణాచల్ ప్రదేశ్ తమదని’ చైనా నియంతలు ప్రకటిస్తుండడం ‘రోహిత్’ వంతెన నిర్మాణానికి నేపథ్యం.
చైనా దురాక్రమణ వ్యూహం కొనసాగుతున్న కారణంగా అరుణాచల్‌లో మన సైనికులు మరింత అప్రమత్తంగా ఉండవలసి వస్తోంది. దాదాపు నలబయి ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ కొత్త వంతెనపై అరవై టన్నుల సామగ్రితో నిండిన వాణిజ్య శకటాలు, సైనిక వాహనాలు ప్రయాణించడానికి వీలుందట. అందువల్ల ఈశాన్య ప్రాంతంలో సరకుల రవాణా, ప్రయాణీకుల రాకపోకలు, సైనిక వాహనాల సంచారం వేగవంతం కానుంది. తమదికాని టిబెట్‌ను దురాక్రమించిన చైనా నియంతలు ఆ తరువాత మనదైన అరుణాచల్‌ను ఆక్రమించడానికి యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. టిబెట్‌ను చైనా ఆక్రమించకుండా మనం నిరోధించి ఉండినట్టయితే చైనాతో మనకు సరిహద్దు ఏర్పడేది కాదు. చైనాతో మనకు సరిహద్దు ఏర్పడినందువల్లనే అరుణాచల్ తదితర ఈశాన్య ప్రాంతాల భద్రతకు, అభివృద్ధికి విఘాతకరమైన ఘటనలు కొనసాగుతున్నాయి. చైనా 1959 వరకు స్వతంత్ర దేశమైన టిబెట్‌ను దురాక్రమించిన సమయంలోనే మన దేశంలో భాగంగా ఉండిన బర్మాను బ్రిటన్ ‘దొరలు’ మన దేశం నుండి విడగొట్టడం సమాంతర విపరిణామం. 1935లో బర్మా మన దేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ రెండు దుర్ఘటనల ఫలితంగా మన ఈశాన్య ప్రాంతంలో విద్రోహ కలాపాలు, దేశ వ్య తిరేక కలాపాలు పెచ్చుమీరుతున్నాయి. చైనా ప్రే రిత విద్రోహకాండకు ఈ కొత్తవంతెన విరుగుడు..
బర్మాలో స్థావరాలను ఏర్పరచుకున్న చైనా ప్రేరిత విద్రోహులు ఈశాన్యంలోకి చొరబడి నిరంతరం హత్యాకాండ జరపడం దశాబ్దుల చరిత్ర. 2015 జూన్‌లో మన సైనికులు బర్మా-మ్యాన్‌మార్- లోకి చొచ్చుకొనిపోయి విద్రోహుల స్థావరాలను ధ్వంసం చేసినప్పటి నుంచి ఈ ‘చైనా తొత్తుల’ బీభత్సం తగ్గుముఖం పట్టింది. మణిపూర్ తదితర ఈశాన్య ప్రాంతాలలో జరుగుతున్న బీభత్స కలాపాలలో తమకు సంబంధం లేదని చైనా ప్రభుత్వం 2015 జూన్‌లో భుజాలను తడుముకొంది! ఇలా ‘బీభత్స’ ప్రతిఘటనను ప్రారంభించిన మన ప్రభుత్వం ఈశాన్యంలో వౌలిక సదుపాయాలను పెంపొందించడానికి పూనుకొనడం ముదావహం. ఇప్పటివరకూ ఈశాన్యంలో రహదారి రవాణా, రైలు రవాణా సౌకర్యాలు పెంపొందక పోవడం వల్ల జనం రకరకాల అగచాట్ల పాలవుతున్నారు. ఇది అంతర్గత వైపరీత్యం. ఈ వౌలిక సదుపాయలు లేకపోవడం వల్లనే 1962లో చైనా దురాక్రమణదారులను మన సైనికులు సమర్థంగా ప్రతిఘటించలేకపోయారు. మరో ‘్ఢలా’ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. ‘మెక్‌మోహన్ రేఖ’కు సమీపంలో ఉంది. 1914లో మన దేశానికి, స్వతంత్ర టిబెట్ దేశానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భూటాన్‌కు తూర్పుగా ఉభయ దేశాల మధ్య ఏర్పడిన ‘సరిహద్దు’కు ‘మెక్‌మోహన్ రేఖ’ అని పేరు వ చ్చింది. అప్పుడు మన దేశం బ్రిటన్ దాస్యగ్రస్తం అయి ఉండేది. మెక్ మోహన్ అనే బ్రిటిష్ అధికారి మన దేశం తరఫున ‘సరిహద్దు’ చర్చలలో పా ల్గొన్నాడు. అందువల్ల భారత్-టిబెట్ సరిహద్దుకు ‘మెక్ మోహన్ రేఖ’ అన్న పేరు.. టిబెట్ ప్రభుత్వం అంగీకరించిన ఈ సరిహద్దును, టిబెట్‌ను దిగమింగిన చైనా అంగీకరించక పోవడం మనకూ చైనాకు మధ్య సంఘర్షణకు కారణం. 1950వ దశకంలో చైనా టిబెట్‌ను క్రమక్రమంగా ఆక్రమించినపుడు అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ దురాక్రమణను సమర్థించాడు. మన ప్రభుత్వం టిబెట్‌కు అండగా నిలబడి ఉండినట్టయితే టిబెట్ మన దేశానికి, చైనాకు మధ్య స్వతంత్ర దేశంగా ఉండేది. ‘్భరత్- చైనా’ సరిహద్దు ఏర్పడి ఉండేదికాదు! కానీ నెహ్రూ చైనాను సమర్థించాడు. చైనా అతి సులభంగా టిబెట్‌ను కాజేయగలిగింది. ‘కొరివి కొంపమీదికి తెచ్చుకున్న’ విధానాన్ని పాటించిన నెహ్రూ హిమాలయ మహాపరాధం చేశాడు. మనకు దురాక్రమణ ప్రమాదం శాశ్వతంగా ఏర్పడిపోయింది!
చైనా దురాక్రమణ సైనికులు 1962 సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ‘మెక్ మోహన్ రేఖ’ను దాటి ‘్థగ్లా’ లోయలోని ‘్ఢలా’ను ఆక్రమించుకొన్నారు. చైనా దురాక్రమణకు ఆ ‘్ఢలా’ సాక్ష్యం. యాబయి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మొదలైన మరో ప్రతిఘటన ఈ ‘్ఢలా’ మాధ్యమం. ఆ ‘్ఢలా’ వద్ద దురాక్రమణ తరువాత చైనా ప్రభుత్వం టిబెట్ పొడవునా మన సరిహద్దు వరకూ రహదారులను నిర్మించింది. రైలు మార్గాన్ని నిర్మించింది. మనం ఇప్పటికీ టిబెట్ సరిహద్దు వరకూ రైలు మార్గం నిర్మించలేదు. ‘్ఢలా’ వంతెన ప్రతిఘటనకు శుభారంభం మాత్రమే..