సబ్ ఫీచర్

తెగిపోతున్న దాంపత్య బంధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాబోదు. ఎలాంటి కష్టనష్టాలు ఉన్నా భారతీయులు తమ మూలాలను గుర్తు పెట్టుకుని కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తారు. మనం అన్ని విషయాలు, సమస్యలనూ హిందూ జీవన దృష్టి కోణంలో చూడాలి. హిందూ ధర్మం ప్రకారం స్ర్తి, పురుషుడు ఇద్దరూ ఒకే దైవం సృష్టి. అందుకే హిందూ ధర్మం సమానత్వానికి బదులుగా ఏకత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది...
- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్న మాటలు ఇవి.
కానీ, భారతదేశంలో విడిపోతున్న జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చట్టపరంగా విడాకులు తీసుకోకుండానే విడిపోతున్న వారి సంఖ్య పాశ్చాత్యదేశాల్లో ఎక్కువగా ఉండేది. అది ఇపుడు భారత సమాజంలోనూ వేళ్లూనుకుంటోంది. సహజీవనం చేయడం, నచ్చని రోజున విడిపోవడం.. అంతా తక్షణ నిర్ణయం గా సాగిపోతోంది. కుటుంబ భావనకు మొగ్గతొడకముందే దంపతులు విడిపోతున్నారు. సామాజిక జీవితానికి మూలకేంద్రం కుటుంబ వ్యవస్థ. సామాజిక పరిణామ క్రమంలో కుటుంబ వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లకు ఒడిదొడుకులకు లోనయింది. సమాజంలో వస్తోన్న ఆధునికత మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల్లో పెనుమార్పులకు గురిచేసినట్టే కుటుంబ వ్యవస్థనూ కుదిపేసింది. ఫలితంగా కుటుంబాల్లో సమైక్యత, సమష్టి దృక్పథం తలకిందులైంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందిలో హిందువుల్లో విడిపోతున్న జంటల శాతం 40 కాగా, ముస్లింలలో 39 శాతం, క్రైస్తవుల్లో 46, సిక్కుల్లో 108, బౌద్ధుల్లో 34, జైనుల్లో 50 శాతం పెరిగింది. ప్రతి వెయ్యి మంది లెక్కల్లో విడిపోతున్న జంటలు హిందువుల్లో 6.9 శాతం, ముస్లింల్లో 6.7 శాతం, క్రైస్తవుల్లో 11.9 శాతం , సిక్కుల్లో 4.1 శాతం, బౌద్ధుల్లో 12.0 శాతం, జైనుల్లో 3.6 శాతం ఉండగా, విడాకులు తీసుకుంటున్న వారి శాతాలు చూస్తే హిందువుల్లో 2.2 శాతం, ముస్లింలలో 4.9 శాతం, క్రైస్తవుల్లో 4.7 శాతం, సిక్కుల్లో 2.2 శాతం, బౌద్ధుల్లో 5.6 శాతం, జైనుల్లో 2.7 శాతం ఉంది. ఈ పరిణామాలు భారతీయ సమాజపు పునాదులపై ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఒకే సమాజంలో రక్తసంబంధం, సహచరత్వం, ఒకే నివాసం వంటి బలమైన అంశాలతో స్ర్తి-పురుషుల మధ్య వివాహబంధం ఏర్పడుతుంది. వివాహం దాపంత్యానికి, కుటుంబ వ్యవస్థకు దారి తీస్తుంది. జాతి పునరుత్పత్తి లక్ష్యంగా సాగే కుటుంబ వ్యవస్థ నేడు పక్కదారి పడుతోంది. ఎన్నో కుటుంబాలు నవ నాగరిక ప్రపంచంలో విచ్ఛిన్నం అవుతున్నాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్రమైన ప్రభావానే్న చూపుతోంది.
నవనాగరికత ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు.. రెండు మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి నెలకొంది. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యాభర్తలు ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కడం లేదంటే మన కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లయిన మరునాడే కాపురాలు పెట్టుకుని జంటలుగా ఒంటరైపోతున్నారు. దీంతో సలహాలు ఇచ్చే పెద్ద దిక్కు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కరవైపోవడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం. అంతా సమాజంలోనే జీవిస్తున్నా.. మనుషుల మధ్యనే బతుకుతున్నా చుట్టూ తన వారెందరో ఉన్నా, ఏకాకి జీవితం తప్పడం లేదు.

- బివి ప్రసాద్