సబ్ ఫీచర్

చైనా జనాభా లెక్కలు తప్పట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దే శంగా తామే మొదటి స్థా నంలో ఉన్నట్లు చైనా చెబుతున్న లెక్కలు వాస్తవం కాదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమ దేశ జనాభా 137 కోట్లు అని చైనా చెబుతోంది. కానీ, ఆ దేశానికి చెందిన ప్రముఖ శాస్తవ్రేత్త రుూ ఫుక్సియాంగ్ తమ దేశ జనాభా 129 కోట్లుగా ఉండొచ్చని అంటున్నారు. ఇదే నిజమైతే అత్యధిక జనాభాగల దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లే. ఎందుకంటే భారత జనాభా ఇప్పుడు 131 కోట్లకు చేరుకుంది. ఈ మార్పు ఊహించిన దానికన్నా ఐదేళ్లు ముందుగానే సాధ్యమైందని ‘రుూ’ చెబుతున్నారు. బీజింగ్‌లోని పెకింగ్ యూనివర్శిటీలో ఆయన ఈ మేరకు తన వాదనలను వినిపించారు. చైనాలో దశాబ్దాలుగా కఠినంగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ చట్టాలే ఈ పరిస్థితికి కారణమని, ఇప్పటికిప్పుడు చట్టాలు సరళతరం చేసినా తక్షణ సానుకూల ఫలితాలు ఉండవని తన అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.
ఫుక్సియాంక్ విస్కాన్సిన్-మేడిసన్‌లో విద్యావేత్త. చైనా జనాభా, అక్కడి కుటుంబ నియంత్రణ విధానాలపై ఆయన చాలాకాలంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. తమదేశ జనాభాను ఎక్కువ చేసి చెప్పడం 1990 నుంచి చైనా మొదలెట్టిందని, మునుముందు చైనా ‘వయోభార జనాభా’తో సతమతం కాబోతోందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘చైనా వాస్తవ జనాభా 129 కోట్లు. ఆ దేశం చెబుతున్నదానికన్నా 90 లక్షలు తక్కువ’ అని ‘రుూ’ చెబుతున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విమర్శ లు ఎదుర్కొన్న నేపథ్యంలో చైనా ‘ఒక కుటుంబం-ఒకేబిడ్డ’ విధానాన్ని 2015 నుం చి విరమించుకుంది. ఇద్దరు పిల్లల్ని కనే వెసులుబాటు కల్పించింది. 1991-2016 మధ్య 37.76 కోట్ల జననాలు నమోదయ్యాయని, నిజానికి ప్రభుత్వ చెబుతున్న జననాల సంఖ్య 46.48 కోట్లు కాదని ‘రుూ’ గట్టిగా చెబుతున్నారు. జనాభా నియంత్రణ విధానాల వల్ల కొత్తతరం తగ్గిపోగా వయసు మళ్లిన తరం ఎక్కువవుతోందని, ఇది పని, ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆ దేశంలోని మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెకింగ్ యూనివర్శిటీకి చెందిన మరో విద్యావేత్త లి జియాంగ్సిన్ కూడా జనాభా పెరుగుదల రేటు తగ్గిన విషయాన్ని సమర్థిస్తున్నారు. అయితే కాలిఫోర్నియా వర్శిటీ లీడింగ్ డెమోగ్రాఫర్ వాంగ్‌ఫెంగ్ వీరి వాదనను కొట్టిపారేస్తున్నారు. చైనా జనాభా విధానాలను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్న ‘రుూ’ వాదనలను నమ్మడానికి లేదని ఆయన అంటున్నారు. జనాభా విషయంలో చైనా చెబుతున్న 137 కోట్ల సంఖ్య అటూఇటూగా నిజమే కావచ్చని వాగెఫెంగ్ అంటున్నారు. మరోవైపు భారత్‌లో 1947 నుంచి జనాభా పెరుగుదల ఉధృతంగానే ఉంది. అప్పటి జనాభాతో పోలిస్తే ఇప్పటికి మూడింతలైంది. 2050 నాటికి ఇది 170 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య స్థ అంచనావేస్తోంది. ఆ తరువాత జనాభా పెరుగుదల రేటు తగ్గటం మొదలవుతుందన్నది ఆ సంస్థ అంచనా.

-ఎస్‌కెఆర్