సబ్ ఫీచర్

వివక్ష అంటూ వివాదం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు ఓట్లు, రెండు సీట్ల కోసం ఏదో ఒక సమస్యని రాజేసే రాజకీయ నాయకుల వలే జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ ‘ఉత్తరాది, దక్షిణాది’ అంటూ మంటలు రాజేస్తున్నాడు. దక్షిణాది సాంస్కృతిక సంఘం ఏర్పాటు చేస్తాడట. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల సంస్కృతి ఒక్కటేనా? రెండు తెలుగు రాష్ట్రాలకు తప్ప మిగిలిన మూడు రాష్ట్రాలలో ప్రజలకు మాతృభాష, సంస్కృతి పట్ల అభిమానం ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో పదో తరగతి వరకూ బోధన మాతృభాషలోనే. తమిళనాట చాలామంది సంప్రదాయబద్ధంగా లుంగీలతో ఆఫీసులకు వెళ్తారు. తమిళనాట ఏ పార్టీ అధికారంలో వున్నా రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకుంటాయి. మనకు తగవులతోనే సరిపోతుంది. రాష్ట్రం గురించి చింత ఏది? పైగా ఉత్తరాది వివక్ష అంటాం. పవన్ ఏ సంస్కృతి గురించి చెప్తున్నాడు?
- ధర్మతేజ, గొడారిగుంట
జనరిక్ ఔషధాలకు ప్రాధాన్యం
ప్రజలకు అతి చౌకగా లభించే జనరిక్ ఔషధాలను డాక్టర్లు విధిగా తమ ప్రిస్కెప్షన్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించడం ఆహ్వానిత పరిణామం. నిజానికి డాక్టర్లు జనరిక్ మందులను సిఫార్సు చేయని సంగతి తెలిసిందే. దీంతో పేద, మధ్యతరగతి రోగులు అధిక ధరలకు మందులు కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యతాపరంగా జనరిక్ మందులకు, బ్రాండెడ్ కంపెనీల మందులకు ఎలాంటి వ్యత్యాసం లేదని అందరికీ తెలిసిందే. అయితే డాక్టర్లు బడా కంపెనీల మందులనే సిఫార్సు చేస్తున్నారు. కంపెనీల మందులను రాస్తే డాక్టర్లకు ఎంతో కొంత కమీషన్ వస్తుంది. మందుల దుకాణాల యజమానులకు, డాక్టర్లకు మధ్య అవగాహన, ఆర్థిక సంబంధాలు ఉన్నందున జనరిక్ మందులను సిఫార్సు చేయడం లేదు. ఈ దుస్థితిని దూరం చేసేందుకు కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రకటన మేరకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
పాలన మెరుగుపడాలి
నోట్లరద్దు వల్ల దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు నల్ల, తెల్ల ధనం బ్యాంకులకు చేరగానే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎటిఎంలలో డబ్బు నింపడం లేదు, బ్యాంకుల్లో తగినంత నగదు ఇవ్వడం లేదు. స్వైపింగ్ చేస్తే షాపుల వాళ్ళు కమీషన్లు తీసుకుంటున్నారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించేశారు. పెన్షన్లు లేని ఉద్యోగుల డిపాజిట్లపైనా కనికరం లేకుండా చేశారు. బ్యాంకు సేవలకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బ్యాంకులంటే ప్రజలకు ఏహ్యభావం కలుగుతోంది. ఇక రెండవది- నిర్భయ కేసు తరువాత నిందితులకు ఉరిశిక్షలు పడినా, స్ర్తిలమీద అత్యాచారాలు తగ్గడం లేదు. ఇలాంటివారిని భయపెట్టే చర్యలేమీ తీసుకోలేదు. మూడవది సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. దొంగతనాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. లంచగొండులు రోజూ పట్టుబడుతున్నా లంచాలు తగ్గడం లేదు. నాలుగవది- కాశ్మీర్‌లో మారణహోమాలు నిత్యకృత్యాలయ్యాయి. భారత సరిహద్దు రాష్ట్రాలను చైనా ఆక్రమించేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల మారణహోమాలు ప్రశాంతతకు భంగం కలుగజేస్తున్నాయి. పాలు, నీళ్ళతో పాటు అన్ని సరకులు కల్తీమయం అయి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. సమాజ వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్