మిర్చిమసాలా

రాజకీయ సెగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే ఎండకాలం, పైగా వడగాడ్పులు. గుక్కెడు నీళ్లకోసం జనం అల్లాడిపోతున్నారు. రాజకీయ నాయకులు మాత్రం ఏసిలోనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి రాజకీయ స మావేశాలతో ఉ క్కిరి బిక్కిరైంది. బి జెపి అధినేత అ మిత్ షా తెలంగాణ పర్యటనలో సిఎం కేసిఆర్‌పై బాణాలు సంధించారు. అమిత్‌షాను తెరాస అధినేత తన సహజశైలిలో కడిగిపారేశారు. ఇక, టిడిపి మహానాడు గతంలో మాదిరిగా అంగరంగవైభవంగా కాకపోయినా, ఊపుతగ్గకుండా నడిచింది. టిడిపి అధినేత, ఏపి సిఎం చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో తమ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. జూన్ 1న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. దీంతో ఎండాకాలంలో రాజకీయ వేడి జోరందుకుంది.
- శైలేంద్ర

హైటెక్ దీక్షలు..
స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి నిరాహార దీక్షల గురించి నేటి తరం వారికి తెలియకపోవచ్చును కానీ, కనీసం ‘జై ఆంధ్ర’ పోరు తరహా దీక్షలు కూడా ఇపుడు కన్పించడం లేదు! విజయవాడలో నిత్యం కనీసం మూడుచోట్ల ధర్నాలు, రిలేదీక్షలు జరుగుతుంటాయి. రిలే దీక్షలంటే మర్నాడు ఉదయం మరో బృందం వచ్చేదాకా దీక్షలో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. టీవీ చానల్స్ మైక్‌లు, కెమెరాలు రావటంతోనే చాలా దీక్షలు మధ్యాహ్నానికే ముగుస్తున్నాయి. దీంతో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలకు మధ్య తేడా తెలియకుండాపోతోంది. దీక్షా శిబిరాల్లో అక్కడక్కడా ఏసీలు, కూలర్లు వంటి సౌకర్యాలు ప్రత్యక్షవౌతున్నాయి!
- నిమ్మరాజు చలపతిరావు

పనిచేయని ‘ఆకర్ష్’
బిజెపి అధినేత అమిత్ షా తెలంగాణ పర్యటనపై మీడియాలో అనేక ఊహాగానాలు సాగాయి. రాష్ట్రానికి చెందిన బిజెపి జాతీయ నాయకులు కూడా అదే ఊహాగానాలకు ఊతం ఇస్తూ ప్రచారం సాగించారు. ‘చాలా మంది టిఆర్‌ఎస్ నాయకులు మాతో టచ్‌లో ఉన్నార’ని బిజెపి నేత మురళీధర్ రావు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో షా పర్యటన కనుక ఆ జిల్లా కాంగ్రెస్ ప్రముఖులు బిజెపిలో చేరతారన్న ప్రచారం జరిగింది. ఇంత హడావుడి చేసినా- చివరికి అమిత్ షా సమక్షంలో టిఆర్‌ఎస్ జడ్‌పిటీసి సభ్యుడొకరు ‘కమల దళం’లో చేరారు. తీరా చూస్తే అతడిని 14నెలల క్రితం టిఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. ఇంతకుమించి ‘కమలం’ ఆకర్ష్ మంత్రం పనిచేయలేదు.
- మురళి

మా సంగతేంటి..?
బిజెపి అధినేత అమిత్ షా తెలంగాణ పర్యటనతో ఊపుమీదున్న ఆ పార్టీ నాయకులకు కొత్త చిక్కొచ్చి పడింది. నల్గొండ జిల్లా తేరేట్‌పల్లికి అమిత్ షా వచ్చినపుడు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తారని స్థానిక నాయకులు చెప్పడమే గాక, 17 ఇళ్లను గుర్తించారు. దాంతో కొంతమంది పట్టువస్త్రాలు, శాలువలు, పసుపుకుంకుమలతో సిద్ధమైపోయారు. తీరా తేరేట్‌పల్లిలో అమిత్ షా ఐదారు ఇళ్లు తిరిగి, మిగతా కార్యక్రమాలకు వెళ్లిపోవడంతో నిరాశకు గురైన వారంతా మా సంగతేమిటి ? అని నేతలను నిలదీస్తున్నారు. గ్రామంలో నక్సల్స్ బాధితులను అమిత్‌షా పరామర్శించగా, తాము కూడా బాధితులమే, తమను పరామర్శించేదెవరు? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
- బివి ప్రసాద్

డిజిటల్ సమాధి!
ప్రపంచంలో సాంకేతిక విప్లవం ఎంతగానో పెరిగిందనడానికి ఈ సమాధులే మచ్చుతునక. మధ్య యూరప్‌లోని ఓ శ్మశాన వాటికలో డిజిటల్ సమాధులు ఏర్పాటవుతున్నాయి. మరణించిన వ్యక్తి పేరు, తేదీ తదితర వివరాలు శిలాఫలకంపై పెట్టడం మనం చూస్తుంటాం. కానీ అక్కడ అలా కాదు. సమాధి ముందు ఎవరైనా నిలబడితే సమాధి చేయబడిన సదరు వ్యక్తికి సంబంధించిన ఆడియో, వీడియో ఆటోమెటిక్‌గా ఆరంభమవుతాయి. శ్మశాన వాటికిలో లౌడ్ స్పీకర్లు ఉండకూడదు గనుక ఇయర్ ఫోన్ ద్వారా వింటూ ఆ వీడియోలను చూడొచ్చు, వినొచ్చు. దీని కోసం 48 అంగుళాల స్క్రీన్ సమాధిపై ఏర్పాటు చేశారు. ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు, అభిమానం ఉండాలే కానీ అంటున్నారట జనం.
- వి.ఈశ్వర్ రెడ్డి