సబ్ ఫీచర్

బడులకు ‘డిజిటల్’ కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగానికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వినూత్న ప్రయోగం జరిగినా దానిని అమలు చేసి, ఫలితాలను సాధించి, మంచి చెడులను విశే్లషించడంలో కేరళ రాష్ట్రానిది అందెవేసిన చేయి. గరిష్ట అక్షరాస్యతలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న కేరళ మరో కొత్త రికార్డుకు సిద్ధం అవుతోంది. ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ రాష్ట్రంలో 9,279 ప్రభుత్వ పాఠశాలలలో సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో (ఐ సిటి) డిజిటల్ అభ్యసానానికి సిద్ధమవుతోంది. మలయాళంలోనే కాకుండా ఇంగ్లీషు, తమిళ, కన్నడ భాషల్లో కూడా డిజిటల్ పాఠాలను రూపొందించారు. డిజిటల్ పాఠాలను కొన్ని అంశాలకే పరిమితం చేయకుండా సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అమలుకు కేరళ సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం స్కూల్ ప్రాజెక్టును ప్రారంభించింది. జూన్ 1 నుండి ఈ ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కేరళ విద్యామంత్రి సి.రవీంద్రనాధ్ వెల్లడించారు. దీంతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ డిజిటల్ తరగులు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకోనుంది. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకూ రెండేళ్ల క్రితమే డిజిటల్ తరగతులను ప్రారంభించింది. వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు సైతం డిజిటల్ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇ-విద్య పేరిట ప్రారంభించిన ప్రత్యేక ప్రాజెక్టులో ఐసిటి పాఠ్యపుస్తకాలు (డిజిటల్ రూపంలో) తయారుచేశారు.
డిజిటల్ రూపంలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్ధుల్లో ఉల్లాసాన్ని, ఆసక్తిని, అనురక్తిని కలిగించడమే గాక, వారికి ఇష్టపూర్వకంగా మనస్సు సంకల్పించినపుడు పాఠ్యాంశాలను నేర్చుకునే సౌలభ్యం ఉంది. సరిగా అర్థం కాలేదనుకుంటే మరోమారు అదే పాఠాన్ని అదే స్థాయిత్వంలో నేర్చుకోవచ్చు. తరగతి గదిలో ఒకసారి విన్న పాఠ్యాంశాన్ని మరోమారు వినే సౌలభ్యం ఉండదు, ఒక వేళ అదే టీచర్ చెప్పినా ఆ స్థాయిలో మళ్లీ వినలేం. ఈ సమస్యలన్నింటినీ డిజిటల్ వ్యవస్థ అధిగమించింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా గొప్ప అధ్యాపకుడు చెప్పిన పాఠాన్ని అయినా వినేందుకు అవకాశం దొరుకుతుంది. ఎప్పటికపుడు మారిపోతున్న సిలబస్‌కు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాలను రూపొందించుకోవ చ్చు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొద్ది గంటల వ్యవధిలోనే పూర్తి చేసి వెనువెంటనే పాఠశాలలకు పంపించుకోవచ్చు. అదే సిలబస్ మార్చాలంటే ఒక పెద్ద ప్రహసనంగా మారి ఏళ్ల తరబడి కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. టెక్నాలజీ వీటన్నింటికీ పరిష్కారం చూపడమే గాక, తక్కువ వ్యవధిలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే మార్గాన్ని సూచించింది. అందులో కేరళ అడుగులు వడివడిగా వేస్తోంది.

- బివి ప్రసాద్