సబ్ ఫీచర్

అద్వానీపై కేసు ఓ కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో పాతికేళ్ల క్రితం అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి ఇప్పుడు భాజపా అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 12 మందిపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించడం ఓ కుట్రగానే కనిపిస్తోంది. నిజానికి అయోధ్యలో ‘బాబ్రీ’ కట్టడాన్ని కూల్చివేయడానికి ఎలాంటి కుట్ర అవసరం లేదు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నపుడు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు యత్నించగా ముస్లిం పార్టీ చారిత్రక వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించింది. హిందూ ఆలయాన్ని నేలమట్టం చేసిన స్థలంలో బాబ్రీ కట్టడాన్ని నిర్మించారన్నది తిరస్కరించడానికి వీలులేని నిజం. ఇది తెలిసి ముస్లిం పార్టీ ప్రతినిధులు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నపుడు జరిగిన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాతి సమావేశానికి కూడా వారు రాలేదు. హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన చోట బాబ్రీ కట్టడాన్ని నిర్మించినట్లు సాక్ష్యాధారాలుంటే ఆ స్థలాన్ని రామమందిరం నిర్మాణానికి అప్పగిస్తామని పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇక, పురావస్తు శాఖ అధికారులు రాడార్ సాయంతో శాస్ర్తియ పద్ధతుల్లో ఆధారాలు సేకరించి, ధ్వంసమైన హిందూ ఆలయంపై బాబ్రీ కట్టడం నిర్మించినట్లు అలహాబాద్ హైకోర్టుకు నివేదించింది. దీంతో అలహాబాద్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం- వివాదాస్పదం స్థలంలో మూడోవంతు స్థలాన్ని రామమందిరం నిర్మాణానికి కేటాయించాలని తీర్పు చెప్పింది.
1991లో అయోధ్యలో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినపుడు బాబ్రీ సమస్య రాజుకుంది. తాము అధికారంలోకి వస్తే రామరాజ్యాన్ని స్థాపిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో రామమందిరాన్ని పునరుద్ధరించాలని, జాతి గౌరవాన్ని కాపాడేందుకు, చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు మందిరంలో పూజలు ప్రారంభించాలన్న హిందువుల ఆకాంక్ష మరింతగా బలపడింది. అసలు విషయాలు ఇలా ఉండగా బాబ్రీ కట్టడాన్ని కూల్చేందుకు అద్వానీ తదితర నేతలు కుట్ర పన్నారన్నది అర్థరహితం. ఆగ్రహంచిన కరసేవకులు నిగ్రహం పాటించేలా అద్వానీ ప్రయత్నించారు. బాబ్రీ కట్టడాన్ని కూల్చేసిన రెండున్నర దశాబ్దాల తర్వాత అద్వానీ తదితరులపై చార్జిషీట్లు పెట్టి విచారణ చేపట్టడం అనైతికం, జాతి వ్యతిరేకం.

- డా. టి.హనుమాన్ చౌదరి