మెయన్ ఫీచర్

విపక్షంలో ‘కబేళా కలకలం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిరోడ్డుపై గొడ్డు మాంసంతో ‘పెద్దకూర పండగ’ (బీఫ్ ఫెస్టివల్) హడావుడి.. రోడ్డుపక్కనే ఆవులను వధించి వాటి మాంసాన్ని జనానికి పంచిపెట్టడం.. దున్నపోతుల తలలు పట్టుకొని వాడవాడలా ఊరేగడం.. ఇలా నిరసనలు చేస్తూ నిప్పులు రాజేస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి, వామపక్షాలకు ఇప్పుడు- ఊపరి సలపని పని.. మోదీ ప్రభుత్వంపై రభస చేయడం, ఆగ్రహం ప్రకటించడమే ఈ విపక్షాల ఏకైక ఎజెండా. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ‘విప్లవకారులైన’ విద్యార్థి సంఘ నేతలు రోడ్లపై పచ్చి మాంసాన్ని పంచడం చూస్తుంటే- అసహ్యకరంగాను, అనాగరికంగానూ అనిపిస్తుంది. వధశాలలకు పశువులను అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడమే కాంగ్రెస్, వామపక్షాల ఆగ్రహానికి కారణం.
మాంసం కోసం పశువుల అమ్మకాన్ని నిషేధిస్తూ కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకొందని, రాష్ట్రాలతో సంప్రదించకుండా ఇంతటి కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ నేతలతో పాటు కేరళ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు నిరసన గళం విప్పారు. పశువుల పట్ల క్రూరంగా వ్యవహరించడాన్ని కొత్త నిబంధనలు నివారిస్తాయని కేంద్రం చెబుతున్నా వినిపించుకొనే తీరిక విపక్షాలకు లేదు. ‘పశువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టం- 1960’ అమలులో లోపాలను సవరిస్తూ తాజాగా జారీచేసిన నిబంధనల వల్ల పశువుల అక్రమ విక్రయాలకు, వాటిని హింసించే సంస్కృతికి అడ్డుకట్టపడుతుందని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు రాజకీయ సెగలు రాజేసేందుకే రంగంలోకి దిగాయి.
కేంద్రం నిబంధనలను కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యతిరేకించగా, ఆ రాష్ట్ర హైకోర్టు మాత్రం ఆ ఆదేశాలను తప్పుపట్టకపోవడం గమనార్హం. మాంసం విక్రయాలను గాని, మాంసం తినడాన్ని గాని కేంద్రం నిషేధించలేదని, మార్కెట్‌లో భారీగా జరుగుతున్న పశువుల క్రయవిక్రయాలను నియంత్రించేందుకే కేంద్రం నిబంధనలను విధించిందని కేరళ హైకోర్టు పేర్కొంది. గొడ్డు మాంసం తినడాన్ని నిషేధించినట్లు కూడా ఆ నిబంధనల్లో ఎక్కడా లేదు. ఉన్నతాశయంతో, నిజాయితీతో కూడిన ఆదేశాలను కేంద్రం ఇచ్చినప్పటికీ బాధ్యత లేని కొందరు రాజకీయ నాయకులు దుర్గంధాన్ని ఎగదోసేందుకు యత్నిస్తున్నా రు. నిరసనకారుల ఎత్తుగడ లేమిటో, వారి బెదిరింపులకు లక్ష్యం ఏమిటో త్వరలోనే మ నం చూస్తాం. రంజాన్ మాసంలో కేంద్రం ఇలా ఆదేశాలు జారీ చేయడాన్ని నిరసనకారులు అనుమానించడం వారి ‘నైతిక హీనమైన బుద్ధి’ని తేటతెల్లం చేస్తోంది. ఇంతకంటే సిగ్గుమాలిన ఆలోచనలు ఉండవు. గత ఏడాది జూలైలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్రం స్పష్టమైన వివరణ ఇచ్చింది. మార్కెట్లలో పశువుల క్రయవిక్రయాలను నియంత్రించేలా, బంగ్లాదేశ్, నేపాల్‌కు పశువుల అక్రమ తరలింపును నివారించి రైతుల వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూడాలని గత ఏడాది సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ఈ విషయమై గత ఏడాది సంబంధిత పార్లమెంటరీ కమిటీ దృష్టి సారించి కొన్ని సిఫారసులు చేయడంతో కేంద్రం తాజాగా నిబంధనలు జారీ చేసింది. పశుసంపదను పరిరక్షించేందుకే ఈ మొత్తం కసరత్తు జరిగింది.
ఈ నిబంధనలపై గొంతు చించుకుంటున్న వారు- ‘పేదరైతులకు పశుసంపద ము ఖ్యమని, పశువుల ద్వారా ప్రభుత్వానికి భారీగా విదేశీమారక ద్రవ్యం లభించడం ము ఖ్యం కాద’ని గ్రహించాలి. ‘స్థూల జాతీయోత్పత్తి’ (జిడిపి)కి కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధం ఉందంటూ మీడియా ప్రచారం చేయడం మరీ విడ్డూరం! జిడిపి వృద్ధి రేటు, విదేశీమారక ద్రవ్యం పెరగడం తక్షణ అవసరమని, పశువులను పరిరక్షించడం కాదంటూ మీడియా గోల చేస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో జరిగే వారపుసంతల్లో రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం పశువులను అమ్మడం,కొనడం చేసేవారు. మాంసం విక్రేతలు, మాంసం ఎగుమతిదారుల కళ్లు పశువులపై పడడంతో రైతులు దోపిడీకి గురికావడం ఇటీవలి విపరిణామం. భారీ ఎత్తున పశువులను కొంటూ వాటిని కబేళాలకు, పొరుగుదేశాలకు అక్రమంగా తరలించడం ఎక్కువైంది. పశువులను క్రూరంగా వధించి, అక్రమంగా మాం సాన్ని భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులకు ఆవులు, ఎద్దులు, గేదెలు వంటివి న్యాయమైన ధరలకు లభించాలన్నదే కేంద్రం ఆదేశాల లక్ష్యం. ప్రజల ఆహారపు అలవాట్లపై నిషేధం విధించడానికి కేంద్రం సంకల్పించలేదన్నది సుస్పష్టం. అయితే, ‘విదేశీయ విలువల’ను అమితంగా అనుకరించే మన ‘నిరసనకారులు’- ఏది తినాలో, ఏది ధరించాలో, ఏది చూడాలో అన్నది ‘వ్యక్తుల హక్కు’ అని ఘోషిస్తుంటారు. భారతీయ సంప్రదాయం, సాంస్కృతిక విలువల కంటే వారికి ‘హక్కులు’ ముఖ్యం. నిజానికి ఈ ‘నిరసనకారులు’ ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు. ‘గొడ్డు మాంసం’ అంటే ఏమిటో వారు స్పష్టత ఇవ్వగలరా? గొడ్డు మాంసం అంటే అది ఆవు మాంసమా? ఎద్దు మాంసమా? గోమాంస భక్షణను చా లా రాష్ట్రాల్లో నిషేధించినందున ఇపుడు ప్రజలకు తాము పంచిపెడుతున్నది గోమాంసమా? ఎద్దు మాంసమా? అన్న విషయాన్ని ఈ నిరసనకారులు వివరించాలి. కానీ- వారు ఎలాంటి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ మతస్థులను అవమానపరచడం, కించపరచడమే వారి ఏకైక ధ్యేయం.
పశువధ నిషేధంపై కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు విమర్శలు చేస్తున్నాయో విశే్లషించాల్సిందే. కేరళ, పశ్చిమ బెంగాల్, కర్నాటక ముఖ్యమంత్రులతో పాటు తమిళనాట డిఎంకె నేతలు తీవ్ర నిరసనకారులుగా ఎందుకు మా రారు? ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ ప్రాబల్యం పెరుగుతుందనే ఆందోళనే వీరి విమర్శలకు, భయాలకు మూలం. బిజెపిని నిలువరించేందుకు ఇపుడు ఒక ఆ యుధం దొరికిందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే- కత్తి దూయాల్సిన ముస్లింలు వౌనం వహించగా, చెన్నై ఐఐటి వంటి విద్యాసంస్థల్లో ‘విప్లవకారులైన’ కొందరు విద్యార్థులు హడావుడి చేస్తున్నారు. ఇపుడు కొత్త నినాదాలు, నిరసనలు విం టున్నాం. ‘మా వంటగదిలో దూరేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది’.. ‘మా భోజనం ప్లేటులో ఏం ఉండాలో ప్రభుత్వం నిర్ణయించలేదు’.. ‘మేం ఏం తినాలో అన్నది మాకు సంబంధించిన వ్యవహారం’.. ఇలాంటి మాటలు నేడు తెగ వినిపిస్తున్నాయి. అమెరికాలో అక్కడి ‘సాంప్రదాయ విలువల’ మేరకు గుర్రం, శునక మాంసాలను నిషేధించారు. కానీ, భారతీయ సంస్కృతి, విలువల గురించి మాట్లాడితే చాలు- ‘నిరసనకారులు’ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రస్తావిస్తూ ఊగిపోతుంటారు. కొన్ని నిషేధాలకు తర్కపరమైన కారణాలు లేవని అమెరికన్లు అంగీకరిస్తుంటారు. గుర్రాలు, శునకాలతో మైత్రీబంధం ఉన్నందునే అమెరికన్లు వాటి మాంసాన్ని ముట్టరు. ఇది విలువలకు సంబంధించింది.. చట్టంతో పనిలేదు. తైవాన్, దక్షిణ కొరియాలోనూ శునక మాంస భక్షణపై నిషేధం ఉంది. జంతువులను ఆదరించే పద్ధతిపైనే ఏ దేశం గొప్పతనమైనా ఆధారపడి ఉంటుందని సియోల్ మేయర్ అనడాన్ని మనం గమనించాలి. శ్రీలంక ప్రభుత్వం తన పార్లమెంటు క్యాంటీన్‌లో, జాతీయ ఉత్సవాల్లో గొడ్డు మాంసాన్ని నిషేధించిం ది. విదేశీ మారక ద్రవ్యం కంటే- ఓ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు ఉండాలన్నదే శ్రీలంక ప్రభుత్వ భావన.
అయితే, మన దేశంలోని నిరసనకారులకు, లౌకికవాదులకు ఇలాంటి విలువులు, గుర్తింపులు అవసరం లేదు. ఏది నచ్చితే అది తినాలన్న స్వార్థబుద్ధిని వీరు వ్యాపింపజేస్తున్నారు. గోవు మనకు మాతృమూర్తితో సమానమని, గో పూజ మన సంప్రదాయమని చెబితే- ఈ నిరసనకారులు విరగబడి మన ముఖంపైనే నవ్వుతారు. ఓ టీవీ యాంకర్ చెప్పిన మాటలు వింటే మనకు ‘షాక్’ తగలడం గ్యారంటీ... భారత రాజ్యాంగంలోని నిర్దేశక సూత్రాలు ఏమీ కాదని, గోహత్య నిషేధాంశాన్ని సూచించే ఆర్టికల్ 48ను పట్టించుకోనక్కర్లేదని ఆ యాంకర్ వాదన. కనుక- రాజ్యాంగ నియమాలను ఎలా కావాలంటే అలా మనం అన్వయించుకోవడమే తరువాయి..!
*

cell: 80083 22206