ఉత్తరాయణం

తెలుగు రాష్ట్రాలపై సవతి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వంలోని నేతలు దేశానికి పాలకులా? లేక వారి ప్రాంతాలకే పాలకులా? వార్షిక బడ్జెట్‌లో రైల్వేశాఖ కేటాయింపుల్లో ప్రతిసారీ కొన్ని ప్రాంతాలకే పెద్దపీట వేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చాలా రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నారు. ఈసారి రైల్వేశాఖ పరంగానూ ఇదే జరిగింది. రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త రైళ్ల కేటాయింపు, స్టేషన్ల ఆధునీకరణ విషయంలో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది. పార్లమెంటులో మన ఎంపీలు గట్టిగా పోరాడనంత కాలం ఈ అన్యాయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు భరించాల్సిందే.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ప్రజాధనం వృథా
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ‘జన్మభూమి’ పేరిట పదిరోజుల పాటు నానా హంగామా నడిచింది. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, స్థానిక అధికారులు పర్యటించిన సందర్భంగా గ్రామసభల పేరిట ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రేషన్ కార్డుల కోసం తరలివచ్చిన పేదలకు నిరాశే మిగిలింది. సభల పేరిట హడావుడి ముగిసినా ప్రభుత్వ పరంగా అర్హులకు సహాయం దక్కిన దాఖలాలు లేవు. ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్ పత్రాలు పంపిణీ చేయలేదని చాలా గ్రామాల్లో జనం ఆగ్రహం చెందారు. రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, గృహవసతి, పంటలకు గిట్టుబాటు ధరలు వంటి విషయాల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలే ఇంకా అమలు కాలేదు. ఇపుడు ‘జన్మభూమి’ సందర్భంగా చేసిన వాగ్దానాలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రచార ఆర్భాటంతో ప్రజాధనాన్ని వృథా చేసే బదులు ఆ నిధులను పేదల కోసం ఖర్చు చేసి ఉంటే కొంతైనా మేలు జరిగేది. ఇకముందైనా ‘జన్మభూమి’ వంటి కార్యక్రమాలను చేపట్టినపుడు అధికారులు నిధులను దుర్వినియోగం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు
బకాయిలు చెల్లించండి ప్రభో..
ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకుంటానని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేళ్లు కావస్తున్నా వేతన సవరణ బకాయిలు, కరవుభత్యం కిస్తీలు చెల్లించడం లేదు. ఎన్టీఆర్ వైద్య సహాయ పథకం సక్రమంగా అమలు జరగనందున విశ్రాంత ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలపాలంటే ఉద్యోగుల సేవలు అవసరం. కానీ, ఆ ఉద్యోగులే ఆర్థిక సమస్యలతో విలవిల్లాడుతున్నారు. ఉద్యోగులు మనస్ఫూర్తిగా పనిచేయాలంటే వారిలో ఆర్థిక భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. బకాయిలన్నింటినీ ప్రభుత్వం చెల్లిస్తే వారు మరింత అంకితభావంతో రాష్ట్రం కోసం పనిచేస్తారు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం