సబ్ ఫీచర్

అసహనం ఎవరిలో ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘటనలు వాస్తవాలు కనుక వాటిని వక్రీకరించకూడదనేది పత్రికా రచయితలకుండాల్సిన ప్రధాన లక్షణం. కానీ దానిపై అభిప్రాయాలను మాత్రం ఎవరిష్టమైన రీతిలో వారు వ్యక్తం చేసుకోవచ్చు. ఉదాహరణకు రోడ్డుపై శవం ఉంది. దానిపై గాయాలు కూడ ఉన్నాయి. ఇక్కడ శవం ఉండటం వాస్తవం. అది ఆత్మహత్య, హత్య, వాహనం ఢీకొనడం వల్లనా అనేవి పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ దర్యాప్తులో మాత్రం నిజం తేలుతుంది. ఇందంతా వెనకటికాలంలో పాటించిన మాట వాస్తవం. కానీ నేడు దీనికి పూర్తి విరుద్ధంగా నడుస్తోంది. ఘటనను పట్టించుకోకుండా, అభిప్రాయాలకే ప్రాధాన్యతనివ్వడం పరిపాటైపోయింది. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో గోహత్య జరిగిందన్న అనుమానంతో ముస్లిం కుటుంబంపై దాడి, ఒకరి హత్య జరిగాయి. ఆ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.45 లక్షలు, గ్రేటర్ నోయిడాలో నాలుగు ప్లాట్లు పరిహారంగా ఇచ్చింది. అలాగే కర్టాటకలో కల్బరీ హత్య జరిగింది. ఇక్కడ చూడాల్సిందేమంటే..రాజ్యాంగ రీత్యా శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మరి ఇక్కడ మన మేధావులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు? ఖురాన్, భగవద్గీత, రవీంద్రుని గీతాంజలి, కాశ్మీరీ భాషలోకి అనువదించిన నిజమైన సెక్యులరిస్టు కవి సర్వాంద కౌల్ ప్రేమి అనే కాశ్మీరీ పండితుడు. అతడి ఇంటిని అమానుషంగా దోచుకొని, ఆయనను ఇంటినుంచి తీసుకొని వెళ్లి దారుణంగా హత్య చేశారు. రచయిత్రి తస్లీమా నస్రీన్ తల నరికిన వారికి రూ.5 లక్షల బహుమానాన్ని ముస్లిం పెద్దలు ప్రకటించడం, హైదరాబాద్‌లో ఆమె పాల్గొనే సమావేశంపై దాడి చేయడం మరో దారుణ సంఘటన. మైనారీటీ హక్కులంటే, ముస్లింలు హిందువులను హత్యచేయడం అన్న అభిప్రాయాన్ని పరోక్షంగా సమర్ధించడం వల్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. మరి ఈ సంఘటనలను సమానంగా చూడాలని అడిగిన వాడిని హిందూ ఛాందసవాదిగా ముద్ర వేయడం ఎంతవరకు సబబు? ముస్లింలపై దాడి జరిగితే విరుచుకుపడుతున్నారు. ముస్లింలు దాడిచేస్తే ఎవరూ మాట్లాడరు. ఎందుకని? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేధావులపై ఉంది. ఏ మతానికి చెందినవారిదైనా రక్తం పారడానికి వీల్లేదని ఎలుగెత్తి చాటే ధైర్యం వీరికి లేదా? ముస్లింలపై జరిగిన దాడులకు మాత్రమే నిరసనగా అవార్డులు తిరిగి ఇస్తే అది అసహనంపై నిరసనలో సహించరాని అసమానత కాదా?
బెంగళూరులోని మహేంద్ర మున్నాట్ (49) అనే షాపు యజమాని ‘గోహత్యా నిరోధం ఎందుకు?’ అనే పుస్తకం రాశాడు. దానిపై సభలు జరుపుతూ స్కూలు పిల్లలకు ఆ పుస్తకాలు ఉచితంగా పంచుతుంటాడు. గంగానహళ్లి ప్రాంతంలో గోవుల తరలింపులను గమనించి ఫోటోలను కూడా తీసి, పోలీసులకు సమర్పించాడు. వాళ్లు చర్య తీసుకోలేదు. అక్టోబర్ 1న ఒక స్కూలు వద్ద పుస్తకాలు పంచుతున్నాడు. తోడుగా డ్రైవర్ మరో వ్యక్తి ఉన్నారు. కారెక్కి బయలు దేరే సమయంలో 50 మంది ముస్లింల గుంపు ఆయుధాలతో వీరిపై దాడి చేశారు. స్కూలు యాజమాన్యం ప్రాణాలకు తెగించి వారందరినీ రక్షించి స్కూల్లో పెట్టి తాళం వేసింది. పోలీసులు వస్తున్నారని తెలిసిన తరువాతనే ఆ ముస్లింల గుంపు అక్కడినుంచి వెళ్లిపోయింది. కర్ణాటకలోనే అక్టోబర్ 9న ప్రశాంత్ పుజారి అనే యువకుడి దారుణ హత్య జరిగింది. అతను గోహత్యా నిరోధాన్ని బలపరుస్తాడు. మూడీబిద్రి మార్కెట్‌లో అతను ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై వచ్చి దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను ఆసుపత్రిలో మరణించాడు. సంఘటనకు ప్రత్యక్ష సాక్షి వామన్ పుజారి ఉరేసుకొని చనిపోయాడు మిగిలిన సాక్షులకు కూడా బెదిరింపుకాల్స్ తప్పలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ సంఘటనలను ఘండిస్తూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. గుర్‌గావ్‌లో సందీప్ కటారియా(32) అనే వ్యక్తిని తాను నడుపుతున్న గోసంరక్షణ కేంద్రంలోనే హత్య చేశారు. అక్టోబర్ 14 సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మరో సంఘటనలో వధశాలకు గోవులను తరలిస్తున్న ఒక వాహనాన్ని వెంబడిస్తూ విక్రాంత్ యాదవ్ (22) అనే యువకుడు 2013 ఆగస్టు 25న హత్యకు గురయ్యాడు. దీనిపై ఆందోళనలు చెలరేగితే అప్పటి ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా హతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, అతని సోదరికొక ప్రభుత్వ ఉద్యోగం, ఇస్తానని వాగ్దానం చేసి తర్వాత దాని వూసే ఎత్తలేదు. ఈ మధ్యనే ఈ కేసులో తాహిర్ అనే వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరి ఈ హత్యలేవీ జాతీయ దినపత్రికల్లో రాలేదు. ఏ నాయకుడూ నోరెత్తలేదు.

- చాణక్య