సబ్ ఫీచర్

గోవధను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుదిపేస్తున్న సమస్యల్లో బీఫ్ ఫెస్టివల్ ఒకటి. మన హిందువుల సాంప్రదాయాల్లో గోవును మాతగా గౌరవించడం, పూజించడం మనకు ఎప్పటినుండో ఉన్నది. కుల, మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు గోవును గౌరవిస్తారు. కొందరి ప్రవర్తనల వల్ల గోవులు అంతరించిపోతున్నాయి. గోవధలో భాగంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతవరకు సబబు. రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుచేయాల్సిన అవసరం వుంది. లేకపోతే ఇరు రాష్ట్రాల్లో తలెత్తే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించవల్సిన అవసరం ఉంటుంది.
పురాణాలు, వేదాలు సైతం గోవు విశిష్టతను తెలియజేస్తుంటే నేటి కలికాలంలో బీఫ్ ఫెస్టివల్స్ పేరిట గోవధ నిర్వహించడం ఎంతవరకు సబబు? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాతను సంహరించి, భుజించడాన్ని నిషేధిస్తూ చట్టమున్నా దానిని అమలుచేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హిందువుల సంస్కృతిని దెబ్బతీస్తూ, వారిలో అనైక్యతను పెంపొందించేందుకు కొన్నివర్గాలు చేస్తున్న కుట్రలో రాజకీయవేత్తలు భాగస్వాములవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దేశానికి మేధావులనందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం ఏమేరకు సమంజసం? ప్రతిసారి విశ్వవిద్యాలయంలో ఫెస్టివల్ నిర్వహించడం శోచనీయంగా ఉంది.
మతతత్వంపై నిప్పులు చెరుగుతున్న వామపక్ష భావజాల వ్యక్తులు బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొనటం మత తత్వానికి ఊతమిస్తున్నట్లు కాదా? హిందూ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై దేశంలో హైందవ మతాన్ని, ధర్మాన్ని భస్మీపటలం చేస్తున్న కుట్రలో భాగమే బీఫ్ ఫెస్టివల్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. దేశంలో పెరుగుతున్న జనాభాను అరికట్టి, ప్రజలందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో, సచ్చీలతతో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న హిందువులను దేశద్రోహులుగా, అసలు కుటుంబ నియంత్రణే తెలియనట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిని దేశభక్తులుగా కొలుస్తున్న రాజకీయ నాయకులను ఏమనుకోవాలి.
స్వామీజీలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలుచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారా? ఏదిఏమైనా రాజకీయ నాయకులు ఒక సమస్యను జటిలం చేయకుండా దానిని సున్నితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సర్వమతాలకు సమాన స్వేచ్ఛనిస్తున్న మన దేశంలో ఇలాంటివి జరగటం కడు శోచనీయం. కొన్నివర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకు ఇలాంటి సమస్యలను గోరంతని కొండంతలుగా చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబు? ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో మనస్పర్ధలు రాకుండా తక్షణమే తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులు పరమపవిత్రంగా భావించే గోమాతను రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘గోవధ నిషేధ చట్టం’ను కఠినంగా అమలుపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మెజారిటీ మతస్థుల మనోభావాలను కించపరచడమే సెక్యులరిజమా? మైనారిటీల మనోభావాలు దెబ్బతింటాయన్న మిషతో, మెజారిటీ వర్గాల మనోభావాలను దెబ్బతీయడం ఎంతవరకు సబబు? ప్రపంచంలోని ఎంతటి ప్రజాస్వామ్య దేశంలోనైనా మెజారిటీ వర్గాల అభిప్రాయాలకు అత్యంత విలువ ఉంటుంది. దురదృష్టవశాత్తు మనదేశంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. మనదేశంలోని మెజారిటీ వర్గం వారు సహన శీలురు కాబట్టే దేశంలో శాంతి సుస్థిరతలు కొనసాగుతున్నాయ. అటు వంటి సర్వమత సమభావ నిష్టకలిగిన వర్గాల మనోభావాలను దెబ్బతీ యడం ఎంతవరకు సబబు?

- జి. రమణయ్య