సబ్ ఫీచర్

సృజనాత్మకతను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో జరిగేది ప్రాసెస్ కానీ ప్రాజెక్ట్ కాదు. విద్యార్థికి హోంవర్క్ ఇవ్వగానే సరిపోదు. తల్లి వంట చేయగానే సరిపోదు. ఆ వంట తిని పిల్లలు కేరింతలు వేస్తేనే తల్లి ఉల్లాసంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఆ హోంవర్క్‌ను లెన్స్ పెట్టుకుని చూడాలి. కొన్నిసార్లు ఉపాధ్యాయుడికి కూడా విద్యార్థి పాఠం చెప్పవచ్చును. ఈ విద్యార్థికి వచ్చిన ఐడియా తనకెందుకు రాలేదని ఉపాధ్యాయుడు సంతోష పడుతుంటాడు. విద్యార్థిది ఫ్రెష్ మైండ్. ఉపాధ్యాయుడు అరిగిన రికార్డు. విద్యార్థినుంచి వచ్చే ఐడియాలే కొత్త ఆవిష్కరణలకు బీజాలౌతాయి. అందుకే హార్వర్డ్‌లోని ప్రొఫెసర్లు హైస్కూల్‌లో వచ్చి కూర్చుంటారు. హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు కొన్ని నోట్‌బుక్స్ చూస్తుంటే తప్పులు కూడా కనపడతాయి. ఆ తప్పులే తన ముందు పాఠానికి ప్రాతిపదిక అవుతాయి. ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శన చేసుకోవటానికి ఇదొక అవకాశం.
ఒక అమ్మాయి బైటకు వెళ్లేముందు అద్దంముందు తన స్వరూపం చూసుకొని పోతుంది. అదే విధంగా హోంవర్క్ చూస్తే ఉపాధ్యాయునికి తన బోధన యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. విద్యార్థి హోంవర్క్ రాసేటప్పుడు ఆ విధంగా ఎందుకు రాశాడు? తాను చెప్పిన ప్రెజెంటేషన్‌లో ఏమైనా తప్పున్నదా? గమనిస్తాడు. కొందరు ఉపాధ్యాయులు ఆ పిల్లలు రాసిన తప్పులన్నింటిని రాసుకుంటారు. పరీక్షలో మల్టిపుల్ ఆబ్జెక్టివ్ పేపర్లో సరైన ఆన్సర్‌లకోసం ఆ తప్పులనే పెడతారు. పరీక్షాపత్రాలు తయారుచేసేటప్పుడు హోంవర్క్‌లో జరిగినటువంటి పొరపాట్లన్నీ ఆప్షన్స్ అయిపోతాయి. అందుకే ఐఐటిలో ఉండే ప్రొఫెసర్లకు పిల్లలు చేసిన తప్పులన్నీ రాబోయే సంవత్సరానికి భూమిక అవుతాయి. దీన్ని ఆధారంచేసుకుని ఉపాధ్యాయుడు తను చెప్పిన పాఠాన్ని రిపీట్ చేయవచ్చును. లేదా ప్రత్యేకించి ఆ విద్యార్థులతో మాట్లాడి ఆ తప్పులను సవరించవచ్చును.
నేను చదువు చెబుతున్నప్పుడు ఒక తల్లి వచ్చి అంత కఠినమైన ప్రశ్న ఇస్తే ఎట్లా సార్, నా పిల్లవాడు ఎంత తల్లడిల్లినాడో తెలుసా? అని నన్ను ప్రశ్నించింది. విద్యార్థి శక్తి తెలుసుకునేందుకే ఆ ప్రశ్న ఇచ్చానన్నాను. జీవితంలో వూహించలేని పరిణామం వస్తే సమస్యలు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాల్నో అన్నదానికే శిక్షణనివ్వాలి. దానే్న క్రిటికల్ థింకింగ్ అంటారు. అడవిలో బాట కనపడదు. కనపడని బాటవల్ల కొత్త బాటలు వేసుకోవాలి. అది ఎంత కష్టమో మీరే ఆలోచించుకోండి. ఆవిధంగా కొత్తబాటను నిర్మించుకోవడ మెలా అన్నది విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ పెరిగినకొద్దీ మరింత స్పష్టంగా తెలుస్తుంది.
అందువల్ల హోం వర్క్ అనేది విద్యాబోధనలో ఒక విధానం మాత్రమే కాదు, చెప్పిన పాఠ్యాంశాన్ని ఏవిధంగా అర్థం చేసుకున్నారు? తప్పులెక్కడ చేస్తున్నారు? ఒకవేళ సరైన రీతిలో అర్థం చేసుకుంటే సృజనాత్మకమైన ఆలోచనలు పిల్లల్లో ఏమైనా కలుగుతున్నాయా? అనే అంశాలను అంచనా వేయవచ్చు. అంతేకాదు ఉపాధ్యాయు తాను చెప్పే తర్వాతి పాఠాన్ని, గత పాఠంలో విద్యార్థులు చేసిన తప్పొప్పులను బట్టి సరిదిద్దుకొని ఎప్పటికప్పుడు బోధనలో కొత్త పుంతలు తొక్కాలి. అప్పుడే విద్యార్థుల్లో అవగాహనను పెంచడమే కాదు తాము చేస్తున్న తప్పులను తెలుసుకో వడం ద్వారా నూతన ఆలోచనలకు పదును పెడతారు. ఒకవేళ విద్యార్థి చేసే తప్పులను ఉపాధ్యాయుడు సరిచేయలేకపోతే, అవే పునరావృత్తమయ విద్యార్థిలో సృజనాత్మకత తగ్గిపోతుంది లేదా తప్పుదారి పడుతుంది. సృజనాత్మకత అనేది రెండు వేపులా పదునున్న కత్తి లాంటిది. అది సమాజ హితానికి ఉపయోగపతుంది, విధ్వంసానికి కూడా దారితీస్తుంది. అందువల్ల పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఉపాధాయుని పాత్ర అసామాన్య మైంది.

- చుక్కా రామయ్య