సబ్ ఫీచర్

కళామందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు తన రాయలసీమ యాసలో రాస్తాడు. అలాగే, మా వెంకట్రావ్ గారి కొడుకు తెలిదేవర భానుమూర్తి తెలంగాణ భాషలో రాస్తాడు. నా కొడుకు శ్రీనివాస్‌ను తూర్పు గోదావరి జిల్లాకు ఒక పెళ్లికి తీసుకుపోయాను. తూర్పు గోదావరి జిల్లాకు, పశ్చిమ గోదావరి జిల్లాకు భాషలో, యాసలో తేడా ఉంది. దీనే్న క్రియేటివిటీ అంటారు. దానితో ఆ భాషలో ఉండే సౌందర్యాన్ని వ్యక్తీకరించండం జరుగుతుంది. కొందరు తమ కళల ద్వారా చూపిస్తారు. అదే మాదిరిగా కొందరు ఉపాధ్యాయులు తాము చెప్పిన విషయం ఏదైనా ముందుగా తాము అర్థం చేసుకుని తమదైన శైలిలో పిల్లలకు సంభాషణల రూపంలో చెబుతారు. దీనే్న క్రియేటివిటీ అంటారు.
క్రియేటివిటీ అంటే కొత్త విషయాన్ని ఆవిష్కరించటం కాదు. తనకు తెలిసిన విషయాన్ని తన కళతో ఇమిడ్చి చెప్పటం. ఒక విద్యార్థి- నేను 10 స్టెప్స్‌లో చెప్పిన సొల్యూషన్‌ని తన ప్రజ్ఞతో నా 4 స్టెప్స్‌లో చెబుతాడు. ఆ విద్యార్థి కొత్త విషయాన్ని ఆవిష్కరించలేదు. కానీ ఉన్న ఆవిష్కరణలకే కొత్త రంగు వేశాడు. అందుకే తరగతి గది సృష్టికర్త. తరగతి గదిలో 40 మంది విద్యార్థులలో 40 రకాల కళలు దాగి ఉంటాయి. ఉపాధ్యాయుడు బోర్డుపై చెప్పిన దాన్ని విద్యార్థులు తమ ఆటల్లో చూపిస్తారు. అక్షరవనాన్ని కోలాటంలో చూపిస్తారు. జ్ఞానం తోడైతే విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యం అన్నది కళారూపంలో బైటకు వస్తుంది. కొందరు కథల రూపంలో, కొందరు గేయ రూపంలో చెబుతారు. క్రియేటివిటీ అనేది ఐన్‌స్టైన్ లాంటి శాస్తవ్రేత్తలకే సాధ్యం అనేది సరి కాదు. ప్రతి వ్యక్తి తనకుతాను ఊహిస్తాడు. ప్రతి వ్యక్తి ఊహలోపల తనకున్న ప్రజ్ఞతో దాన్ని ప్రకటిస్తాడు. తరగతి గది ఒక కళామందిరం. అందుకే కొన్ని పాఠశాలలు బాలల గురించి నెలకొక మ్యాగజైన్‌లు తీసుకువస్తాయి. క్రియేటివిటీ కొత్త ఆవిష్కరణలకు నాంది.
విడదీయలేని బంధం..
తరగతి గదిలో ఉపాధ్యాయునికి, విద్యార్థుల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఓ 50 ఏళ్ల తర్వాత సహచర విద్యార్థి కలిస్తే ‘నా క్లాస్‌మెట్’ అంటారు. ఇది అపూర్వమైన బంధం. ఎకు బి క్లాస్‌మెట్ అయితే, బి కు సి క్లాస్‌మెట్ అయితే ఎకు కూడా సి క్లాస్‌మెట్ అవుతుంది. అందుకే అన్నదమ్ముల మధ్యన లేక ఒకే ఉదరం నుంచి పుట్టిన వారి మధ్య ఏ సంబంధం ఉంటుందో తరగతి గదికి ఆ ప్రక్రియ ఉంటుంది. మాతృగర్భానికుండే లక్షణమే తరగతి గదికుంటుంది. అక్కడ ఒకే రక్తం ఉంటుంది. ఇక్కడ ఒకే జ్ఞానం ఉంటుంది. పిల్లల మధ్యన ఉండే బంధం ఏకీకృతమయి అది గౌరవంగా మారుతుంది. గౌరవం అనేది అధికారంతో రాదు.. ప్రేమతో వస్తుంది. మనం చెప్పే చదువుతో విద్యార్థి చలిస్తే దానిపై కేంద్రీకరిస్తాడు. గురుశిష్యుల మధ్యన ఉండే బంధం క్లాస్‌మెట్ బంధం కన్నా కూడా శక్తివంతమైనది. అయస్కాంతశక్తి అది. ఆ శక్తిని గురుశిష్యుల మధ్యన తరగతి గది కల్పిస్తుంది.
తరగతి గది ఒక అయస్కాంత క్షేత్రం.
తరగతి గదిలో పాజిటివ్ ఐడియాస్ ఉంటాయి.
ఆ పాజిటివ్ ఐడియాలే ఆ వ్యక్తికి శక్తిని ప్రసాదిస్తాయి. ఈ శక్తి బయట నుంచి పుట్టుకొచ్చింది కాదు. స్వతహాగా తరగతి గదిలో జరుగుతున్న ప్రక్రియల వలన ఆ శక్తి జనిస్తుంది. తరగతి గది కేవలం నాలుగు బెంచీల కూడలి కాదు. అది వ్యక్తుల మధ్యన బంధాన్ని కలిగించే పవిత్రస్థలం. ఇందులో అందరూ పాత్రధారులే. ఆ పాత్రధారుల మధ్యన ఒకే గర్భంలో పుట్టిన బిడ్డల బంధం కలిగిస్తుంది.

- చుక్కా రామయ్య