ఉత్తరాయణం

ఉత్తరాయణం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ లెనిన్ విగ్రహాలను రాజకీయ కక్షతో కొందరు ధ్వంసం చేయడం అనాగరిక చర్య. ఓడిపోయిన వారు దేశం వదలిపోవాలనడం సరికాదు. తమిళనాడులో పెరియార్ విగ్రహాలపై దాడి చేయడం రాక్షస చర్యే. లెనిన్ టెర్రరిస్టు అని, అతను ఎంతోమందిని చంపించాడని భాజపా నేత సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు మూర్ఖత్వం అనాలి. యుద్ధంలో రక్తపాతం అనివార్యం. తాలిబన్లు బహ్రెన్‌లో బుద్ధుని విగ్రహం పగులగొట్టడం దుశ్చర్య. ఇలాంటి ఘటనలు హింసకు దారితీసేవే.
- బండి రాజేశ్వరి, అత్తిలి
ఉద్యమకారులపై కేసులు వద్దు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలి. గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఇప్పటికీ ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకప్పుడు ‘ప్యాకేజీ’ ఉత్తమమని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ తన పార్టీ ఎంపీల చేత ఆందోళనలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై కేసులను ఎత్తివేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
భాషా పండితులకు అన్యాయం
పదో తరగతి స్పాట్ వేల్యుయేషన్‌లో ప్రతిసారీ భాషా పండితులకు అన్యాయం జరుగుతోంది. తెలుగు, హిందీ భాషలను రెండు దశాబ్దులుగా బోధిస్తున్న వారిని స్పాట్ వేల్యుయేషన్‌కు నియమించడం లేదు. అవే సబ్జెక్టులను బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు మూడేళ్ల అనుభవం ఉన్నా ‘స్పాట్’కు ఎంపిక చేస్తున్నారు. భాషా పండితుల పట్ల ఇలా వివక్ష చూపడం దారుణం. కామన్ సీనియారిటీ ప్రకారం భాషా పండితులకు అవకాశం కల్పించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
నగదు కొరత ఎన్నాళ్లు?
ఎక్కడా లేని నగదు కొరత తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఉత్పన్నమవుతున్నదో ఆలోచించాల్సిందే. పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోనే నగదు కొరత ఓ సమస్య అయింది. అప్పట్లో కొందరు బ్యాంక్ మేనేజర్లు లంచాలు ఆశించి నగదును నల్లకుబేరులకు ఇచ్చేసి సామాన్యులకు మొండి చేయి చూపారు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కొందరు బ్యాంకుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుంటున్నందునే సామాన్యులకు సమస్య అయిందనుకోవాలి. భారీగా నగదును విత్ డ్రా చేసేవారిపై ప్రభుత్వం నిఘా పెట్టాలి.
- చంద్ర, కాకినాడ
జాతీయత పట్టని ప్రాంతీయ పార్టీలు
దక్షిణ భారత్‌లో బలపడుతున్న అనేక ప్రాంతీయ పార్టీల్లో జాతీయ భావం లోపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల వల్ల అనువంశిక పాలనకు అవకాశం ఏర్పడుతోంది. ఈ పార్టీల వైఖరి వల్ల దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితి రావచ్చు. ఓటు బ్యాంకు రాజకీయాలు, జాతీయ పక్షాల్లో కుమ్ములాటలు, యువతలో నిస్తేజం, సంపాదనపై నేతల కక్కుర్తి, పలు సామాజిక రుగ్మతలు వంటివి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే జాతీయ భావం వికసించాలి. యువత వల్లే ఇది సాధ్యమవుతుంది. సమగ్రతకు ముప్పు తెచ్చే వారిని యువత ధైర్యంగా ఎదిరించాలి. మేధావులు, అభ్యుదయ వాదులు యువతరాన్ని ముందుకు నడిపించాలి.

- కొలుసు శోభనాచలం, గరికపర్రు