ఉత్తరాయణం

నష్టం జరగకుండా చూసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూపిఏ నేతలకు రెండు సంవత్సరాల ముందు తాము ఓటమి చెందనున్న వైనం తెలుసుగాని ఇంత ఘోర పరాజయం వూహించలేదు. కాంగ్రెస్ జీన్స్‌లో వల్లమాలిన వుడుకుమోత్తనం వుంది. బెంగాల్‌లో మొదటిసారి అధికారానికి వచ్చిన కమ్యూనిస్టులు నాటి కాంగ్రెస్ వారి అరాచకాలను మరిచేరేమో గాని భారత్‌లో చాలామంది మరువరు. మరవాలసిన అవసరం వున్నవారు మరిచేరు. ఢిల్లీ ఎన్నికలపుడే చర్చిలపై దాడులు జరిగేయి. కాంగ్రెస్ ఓట్లు ఆప్‌కు బదిలీ అయ్యేయి. భాజపా నిలువరింపబడింది. దాడులు మరి లేవు. బిహార్ తెలిసిందే. నష్టం జరిగేక కుట్రను గ్రహించింది పాలక భాజపా. బీఫ్ ఫెస్టివల్సు, ఏది తినాలో ఏది వద్దో చెప్తారా అనే కాంగ్రెస్, కమ్యూనిస్టు మజ్లిస్ వారి సన్నాయ నొక్కుల వైపు సకాలంలో దృష్టిసారించలేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ భాజపా వారి పేటెంటు సంస్థలలో జొరబడి నాటి బెంగాల్ థియరీని అమలులోకి కాంగ్రెస్ పెడ్తున్న వైనం సమయానికి గుర్తించిన మోదీ దళితుల రక్షణ గూర్చి భాగ్యనగరంలో ప్రస్తావించేరు. దళితుల ఉన్నతికి భాజపా మరిన్ని చర్యలు చేపట్టాలి. అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు పరచాలి. ఇప్పటికే ప్రజల్లో మోదీ పరిపాలనపట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ. దీన్ని కొనసాగించాలంటే విధానాలకు మరింత పదును పెట్టాలి.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
వనమూలికలు పెంచాలి
భారతదేశం ప్రాచీన కాలంనుండి ఆయుర్వేద వనమూలిక వృక్ష సంరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఎన్నో వనమూలికల సంపద వున్నది. కొన్ని తెలిసినా తెలియని వృక్షాలు ఇంకా ఎన్ని వున్నాయో? మన ముందు తరం వారికి తెలిసిన వనమూలికల పేర్లు తెలిసికొని ఆయుర్వేద వైద్యానికి తగిన కృషి సాగించాలి. ప్రతి రైతు తన పొలంలో తెలిసినంతవరకు ఆయుర్వేద వైద్యానికి పనికివచ్చే వృక్ష సంపదను వృద్ధిచేయాలని ఆంక్షలు విధించాలి. అప్పుడు మాత్రమే ఆయుర్వే ద వైద్యానికి అవసరమైన మూలికలు సమృద్ధిగా లభిం చడమే కాకుండా, ప్రజలకు కూడా ఆ వైద్యంపై అవగాహన కలుగుతుంది.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
సెల్‌ఫోన్‌తో ప్రమాదం
సెల్‌ఫోన్‌లు, నెట్ సౌకర్యాలు రావడంతో టెలిఫోన్, టెలిగ్రాం వంటి వాటికి పనిలేకపోయింది. అన్ని శాఖలలోనూ కంప్యూటర్లు రావడంతో 90 శాతం పని తగ్గింది. సెల్‌ఫోన్‌లు మనిషి జీవితంలో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రతి చిన్న పనికి ఫోన్‌ను ఉపయోగిస్తారు. పెరుగుతున్న టెక్నాలజీతో ఫోన్‌లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా ఏదైనా కొనుగోలు చేయాలన్నా, ఏ విషయాన్ని ఇతరులకు అందజేయాలన్నా ఫోన్‌లో ఉంటే అన్ని రకాల సౌకర్యాలు అందుకు కారణంగా ఉంటున్నాయి. ఫోన్‌లోనే నెట్‌వర్క్ కూడా అందజేస్తున్నారు. సెల్‌ఫోన్‌లు ఉపయోగించటం మంచిదే కాని అతిగా తింటే అజీర్తి అన్నట్లు ఎపుడు చూసినా ఫోన్‌లో మాట్లాడటం మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది యువతీయువకులు సెల్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ కండక్టర్ టిక్కెట్ అని అడిగినా కూడా వినిపించుకోకుండా ఫోన్‌లో సంభాషిస్తుంటారు. దీనివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్లు పేలిపోవడం విద్యుద్ఘాతానికి గురై మరణాలు సంభవించడం ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్నాయి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు