ఉత్తరాయణం

చైనా చర్యల్ని ఖండించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని అనేక దేశాలు నిరసిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం పాకిస్తాన్‌కు మద్దతు తెల్పుతోంది. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. అటువంటి చైనాకు భజన చేయడం మన దేశంలోని కమ్యూనిస్టులకే చెల్లుతుందేమో. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు అమెరికా అండగా నిలబడింది. అమెరికా, భారత్ ప్రజాస్వామ్య దేశాలు. ఇవి స్నేహంగా వుండటంలో ఆశ్చర్యం లేదు. అలా స్నేహంగా వుండటాన్ని భారత్ అమెరికాకు ఊడిగం చేస్తుందని సిపిఎం నేత బివి రాఘవులు వంటివారు వ్యాఖ్యానించడం విడ్డూరం. చైనా వస్తువుల్ని భారతీయులు కొనవద్దని చెప్పడం ఇప్పుడు అత్యంత అవసరం. చైనా మనకు శత్రుదేశం. నియంతలా వ్యవహరిస్తున్న చైనాను ఎంత దూరంగా వుంచితే మనకు అంత మేలు జరుగుతుంది. మన విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే మంచిదే.
- జి.శ్రీహరిరావు, గంగవరం
సాయిలో దైవత్వం..
దేవుడంటే రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషులే కాదు. మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులు, తల్లిదండ్రులు కూడా దైవాలే. నమ్మకమే దైవత్వం. ధర్మమే దేముడు. దైవం అన్న పదం అన్ని మతాల వారిదీ. ఎందుకంటే ఇందులో మనకు కనిపించే రూపం లేదు. దేవుడు నిజానికి నిరాకారుడు. పేరుపెడితేనే మతం తెలిసేది. షిరిడీ సాయి ఏ మతం వాడైనా సద్గురువుగా, భగవత్ స్వరూపుడుగా ఆరాధింపబడుతున్నాడు. సాయి ఒక భూతమని, ఆయనను పూజించడం అపచారమని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించడం సరికాదు. షిరిడీ సాయిని నమ్మిన భక్తుల మనోభావాలను, నమ్మకాలను కించపరచేలా మాట్లాడడం స్వామీజీకి తగదు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
మాట మార్చిన కామ్రేడ్లు
‘పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప’-అని తెల్లటి గోడలపై ఎర్రని రాతలు చూసినవారికి ఇపుడు కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి. పోరాడితే ఖర్చయేది వయసు. మిగిలేది వృద్ధాప్యం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)ను ఎస్‌బిఐలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నేతలు మాట్లాడడం విడ్డూరం. ‘ఎస్‌బిహెచ్ నిజమైన తెలంగాణ బ్యాంక్, దీన్ని తొలుత నిజాం ప్రారంభించాడు..’ అని సిపిఐ జాతీయ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి అనడం సరికాదు. భూమి కోసం, భుక్తికోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా నిజాంపై కమ్యూనిస్టులు పోరాటం చేశారని చెప్పుకునే వారు నిజాంను కీర్తించడం తగదు. అలాగే, ఒకప్పుడు కాంగ్రెస్‌లో కుటుంబ పాలన గురించి విమర్శించిన సిపిఎం నేతలకు ఇపుడు తెరాసలో వారసత్వ రాజకీయాలు కనిపించక పోవడం నవ్వు తెప్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంకు వీడ్కోలు పలికి, తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్యకు ఇపుడు కెసిఆర్ కుటుంబ రాజకీయాలు సవ్యంగానే కనిపించడం విచిత్రం. ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన కెసిఆర్ కుటుంబంలో అందరూ పదవులు చేపట్టాలా?
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్