ఉత్తరాయణం

రెండు భాషలూ నేర్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఆంగ్లభాషకి ప్రాముఖ్యతనిస్తూ అమ్మభాష అవసరమే లేనట్టు భావించడం ప్రచారవౌతోంది. అది పూర్తిగా తప్పుడు భావన. అమ్మ ఎలాగైతే పిల్లలను తన ఒళ్లో కూర్చోబెట్టుకుని లోకాన్ని పరిచయం చేస్తుందో అదే తీరులో మాతృభాష ప్రాథమిక భావనల్ని సులభంగా అర్థం చేసుకునేలా సహకరిస్తుంది. ప్రాథమిక విద్యాబోధన అమ్మభాషలోనే ఉండడం మంచిది. ఇది శాస్త్ర విజ్ఞానం తేల్చిచెప్పిన నిజం, యునెస్కో సిఫార్సు చేసిన విషయం. ప్రాథమిక స్థాయిలో అమ్మభాషకు సంబంధించి వాడుక, వ్యాకరణం పట్టుబడితే ఆనక ఆంగ్ల భాష కూడా పట్టుబడుతుంది. బతుకుతెరువు, ఉపాధికి అవసరమైన భాషను నేర్చుకోవాల్సిందే. అయితే దాని అర్థం మాతృభాషని చులకన చేయమని కాదు. ప్రపంచ భాషగా రూపుదిద్దుకున్న ఆంగ్లాన్ని కూడా పిల్లలకు నేర్పించాలి. విశ్వమానవులుగా తీర్చిదిద్దుదాం. అమ్మభాష అంతరించపోకూడదు. ఆంగ్ల భాషలో వెనుకబడి పోకూడదు. నిదానంగా ఆలోచిస్తే ఆచరిస్తే ఇదేమంత కష్టమైన గమ్యం కాదు. ప్రభుత్వ ప్రోత్సాహం, పౌర సమాజం చైతన్యం అందిస్తే అప్రయత్నంగా జరిగిపోవాల్సిన చర్య ఇది.
-డివిజి శంకరరావు, పార్వతీపురం
కాంగ్రెస్ దొంగనాటకం!
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమైన అర్హతలను గతంలో నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏ రాష్ట్రానికైనా దేశ సరిహద్దులు కలిగి ఉండడం ఒక అర్హత అని పేర్కొన్నారు. ఈ అర్హత లేనందువల్లనే గతంలో ఏర్పడిన ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించలేదు. దేశ సరిహద్దులకు బదులు కృష్ణా గోదావరి డెల్టాలు, విస్తారమైన సముద్ర తీరం కలిగిన ఆంధ్రకు ప్రత్యేక హోదా లభిస్తుందా? ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని 20-2-2014న రాజ్యసభలో ప్రకటించిన కాంగెస్ ప్రభుత్వం ఆ తర్వాత వౌనం వహించింది. విభజన చట్టంలో ప్రత్యేక హోదా సంగతే లేదు. వాస్తవం ఇట్లుండగా- ఏపి కాంగ్రెస్ నాయకులు ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని గోల చేయడం దొంగ నాటకం మాత్రమే. ప్రత్యేక హోదా అర్హతలు సవరిస్తే ఆంధ్రతోపాటు అన్ని రాష్టల్రకు ప్రత్యేక హోదా లభిస్తుంది. ఇది అసాధ్యం. అభివృద్ధికి కావాల్సింది వౌలిక వసతుల కల్పన. ప్రభుత్వంలో సచ్ఛీలత, అవినీతి రాహత్యం ఎంతో అవసరం.
-కె.వి.రాఘవాచార్య, తిరుపతి
ఇసుక మాఫియా ఆగడాలు
దశాబ్ద కాలంపైగా మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లో ఇసుక మాఫియాకు రాజకీయ నాయకుల అండదండలు వున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక మాఫియాను అరికట్టలేకపోవడం విచారకరం. నదీ గర్భంలోని ఇసుకను ఎన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా కొల్లగొడుతున్నారు. అధునాతన యంత్రాలు, భారీ రవాణా వాహనాల వల్ల ఇసుక తరలింపు ఎక్కువైంది. ఇసుక తవ్వకంపై న్యాయస్థానాల మార్గదర్శకాలు ఉన్నా వాటిని ఎవరూ పట్టంచుకోడం లేదు. నది మధ్యలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఇసుకను మాత్రమే తవ్వి తీసుకోవాల్సి ఉంది. తీరం వెంబడి తవ్వకాలు అరికట్టాలి. స్థానికులు అక్రమ ఇసుక తవ్వకాలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంబంధత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
-కప్పగంతుల వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్