కృష్ణ

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ‘ఈడ్పుగంటి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/ముదినేపల్లి, డిసెంబర్ 11: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఈడ్పుగంటి వెంకట్రామయ్యను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామానికి చెందిన వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వెంకట్రామయ్య ఇటీవల జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవికి పోటీ పడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా పార్టీకి విశేష సేవలు అందించిన వెంకట్రామయ్యకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), కైకలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు అత్యంత సన్నిహితుడైన వెంకట్రామయ్య పార్టీకి చేసిన సేవలకు గాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అప్పగించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు డైరెక్టర్లను నియమిస్తూ జివో నెం. 239ని ప్రభుత్వం జారీ చేసింది. ఆరు డైరెక్టర్ పదవుల్లో స్థానిక సంస్థల నుండి ముగ్గురికి స్థానం కల్పించారు. వీరిలో ఇద్దరు ఎంపిపిలు ఉండగా మరొకరు విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్. పెనమలూరు ఎంపిపిగా వ్యవహరిస్తున్న బొర్రా కనకదుర్గ, జగ్గయ్యపేట ఎంపిపిగా వ్యవహరిస్తున్న తాళ్ళూరి పార్వతి, విజయవాడ కార్పొరేటర్‌గా పని చేస్తున్న షేక్ హబీవుల్లాలకు డైరెక్టర్ పదవులు దక్కాయి. వీరితో పాటు పామర్రు నియోజకవర్గానికి చెందిన పామర్తి విజయ శేఖర్, నందిగామ నియోజకవర్గానికి చెందిన రాతకొండ రామకోటేశ్వరరావు, తిరువూరు నియోజకవర్గానికి చెందిన వేల్పుల మల్లిఖార్జునరావులను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈడ్పుగంటి నియామకంపట్ల హర్షం
దేవపూడి పిఎసిఎస్ అధ్యక్షుడిగా, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈడ్పుగంటి వెంకట్రామయ్య చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ నాయకత్వం ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా నియమించడంపట్ల జెడ్పీటీసి సభ్యురాలు భూపతి నాగకల్యాణి, ఎంపిటిసి పోతినకుమారి, వాడవల్లి సొసైటీ అధ్యక్షుడు, పార్టీ మండలాధ్యక్షుడు శోభనాద్రిచౌదరి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జగన్మోహనరావు, జిల్లా నేతలు విఠల్, మార్కెట్ యార్డు సభ్యుడు పాలడుగు సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.