హైదరాబాద్

విలువలతో కూడిన విద్యనందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విద్యా శాఖ మంత్రి కడియం
కాచిగూడ, డిసెంబర్ 18: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యనందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. బుక్‌ఫెయిర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్ 2015ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. సభకు సుద్దాల హనుమంతు వేదికగా నామకరణం చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ సామాజిక విలువలతో ముందుకు వెళ్లాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత విద్యనందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నేడు మారుతున్న పరిణమాలకు అనుగుణంగా విద్యార్థులు గ్రంథాలయాలపై ఆసక్తి కనబరుచుట లేదని వారిని ఆకర్షించేందుకు ఆలోచన చేయాలని అన్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. బుక్ ఫెయిర్‌కు దేశవ్యాప్తంగా పేరు రావాలని ఆకాంక్షించారు. బుక్ ఫెయిర్‌కు కావల్సిన సహాయ, సహకారాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బిజెపి శాసనసభ పక్షనేత డా.లక్ష్మణ్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే నిరక్ష్యరాస్యులను అక్షరాసులుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యా విధానంలో పేదరికం అడ్డుకాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. నగరంలో నేడు అనేక గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. మారుతున్న పరిణమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. బుక్‌ఫెయిర్‌ను 10రోజులు కాకుండా నెల రోజులు కొనసాగించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రముఖ రచయిత దేశ్‌పతి శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ పరిణామానికి పుస్తకమే పునాదన్నారు. పుస్తకాలు లేకుండా తెలంగాణ లేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఎన్నో పుస్తకాలను సృష్టించిందని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలను బహుమతిగా ఇచ్చి వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. బుక్‌ఫెయిర్ అసోసియేషన్ అధ్యక్షుడు జులూరి గౌరిశంకర్ సభాధ్యక్షత వహించగా, ప్రముఖ విద్యవేత్త చుక్కారామయ్య, తెలుగుభాష సంస్కృతి డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సుద్దాల అశోక్, అసోసియేషన్ ప్రతినిధులు రాజేష్, సాంబశిరావు, శోభన్‌బాబు పాల్గొన్నారు.
పుస్తకాల పండుగ వచ్చేసింది
హైదరాబాద్: నిన్నమొన్నటి వరకు పక్షం రోజుల పాటు జరిగిన కోటి దీపోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఎన్టీఆర్ స్టేడియం ఇపుడు సరస్వతి నిలయంగా మారనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో విస్తత్ర ఏర్పాట్ల మధ్య భాగ్యనగర పుస్తకాల పండుగు కొలువుదీరింది. ఈ నెల 27వ తేదీ వరకు పదిరోజుల పాటు నిర్వహించనున్న ఈ పుస్తకాల పండుగ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ ప్రాంతీయ రచయితలను ఒక వేదిపైకి తీసుకువచ్చి, వారి పుస్తకాలను వారే స్వల్ప తగ్గింపు ధరలకు విక్రయించుకునేందుకు వీలుగా రైటర్స్ కామన్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్టక్రు చెందిన సుప్రసిద్ధ రచయితల పుస్తకాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. శుక్రవారం తొలి రోజు కావటంతో పూర్తి స్థాయిలో స్టాళ్లలో లేకపోయినా, శనివారం సాయంత్రం కల్లా కొలువుదీరనున్నాయి. ఈ సారి భారతదేశంలోని ప్రచురణ కర్తలందర్నీ ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేయటం విశేషం. కేవలం ప్రచురణకర్తలు, రచయితలను ఆకట్టుకునేందుకే గాక, పుస్తక ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకుల తరపున జూలూరి గౌరీశంకర్ తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు,విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలు, అలాగే సందర్శకులను ఆకట్టుకునేందుకు వీలుగా పలు పుస్తకావిష్కరణ, పుస్తకపఠనంపై ఇష్టాగోష్ఠి, సదస్సులు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి తోడు రోజురోజుకి పెరిగిపోతున్న ఆధునికత కారణంగా పుస్తకపఠనంపై ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతోందని, పుస్తక పఠనానికి పూర్వ వైభవాన్ని సంతరింపజేయాలన్న ప్రధాన లక్ష్యంతో పలు స్టాళ్లు ఏర్పాటయ్యాయి.